Diabetic Eye Disease: మీ కళ్లు మసకబారుతున్నాయా..? ఈ వ్యాధి కావచ్చు చెక్‌ చేసుకోండి..!

Diabetic Eye Disease: ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. చాపకింద నీరులా చాలా మందిని వెంటాడుతోంది. ఈ వ్యాధి వంశపారపర్యంగా,..

Diabetic Eye Disease: మీ కళ్లు మసకబారుతున్నాయా..? ఈ వ్యాధి కావచ్చు చెక్‌ చేసుకోండి..!
Diabetic Eye Disease
Follow us

|

Updated on: Sep 19, 2021 | 4:06 PM

Diabetic Eye Disease: ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. చాపకింద నీరులా చాలా మందిని వెంటాడుతోంది. ఈ వ్యాధి వంశపారపర్యంగా, టెన్షన్‌, సరైన నిద్ర లేకపోవడం ఇంకా ఎన్నో కారణాల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది వ్యాపించిందంటే ఆహారంలో చాలా మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. మద్యం, అలాగే డాక్టర్‌ సూచించిన విధంగా పాటిస్తే ఎప్పటికి అదుపులో ఉంచుకోవచ్చు. రక్తంలోని చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఇబ్బంది పెట్టే ఈ సమస్య వల్ల.. శరీరంలోని వివిధ అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇన్సులిన్ తక్కువగా విడుదల కావడం.. తద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలు అలాగే పెరిగిపోతూ ఉండడం ఈ సమస్యకు ముఖ్య కారణమని వైద్యులు చెబుతున్నారు. ఒకసారి షుగర్ కనిపిస్తే దాన్ని పూర్తిగా తగ్గించే మార్గం లేదు. అదుపులో ఉంచుకోవాలి తప్ప పూర్తిగా నయం చేసే మార్గం లేదు. జీవనశైలిని మార్చుకోవడం మాత్రం చేయాల్సి ఉంటుంది.

డయాబెటిస్‌ ఉన్న వారిలో కంటి చూపు సమస్య:

డయాబెటిస్‌ సమస్య ఉన్నవారిలో కంటి చూపు మందగించే అవకాశాలు ఉంటాయి. కొన్నికొన్నిసార్లు వివిధ వస్తువుల రూపాలను కనిపెట్టడం కూడా చేయలేకపోతారు. మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకని చక్కెర వ్యాధితో బాధపడుతున్న మహిళలు.. వారి కండ్లపై కన్నేసి ఉంచడం చాలా ముఖ్యం. డయాబెటిస్‌1, టైప్‌-2 కలిగిఉన్న దాదాపు 25 శాతం మందిలో రక్తంలో అధిక చక్కెరల స్థాయితో పాటు కంటి సమస్యలు కనిపిస్తాయి. రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించలేకపోవడంతో అది కంటి వెనుక ఉండే సన్నటి రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. తద్వారా కంటి చూపు పూర్తిగా పోయే అవకాశాలు ఉంటాయి.

డయాబెటిస్ ఉన్నవారికి డయాబెటిక్ రెటినోపతి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. డయాబెటిక్ రెటినోపతి కారణంగా డయాబెటిక్ మాక్యులర్ ఎడీమా, కంటిశుక్లం, గ్లాకోమా వంటి కంటి సమస్యలు తలెత్తుతాయి. డయాబెటిక్ మాక్యులర్ ఎడీమా, డయాబెటిక్ రెటినోపతి అనేవి డయాబెటిస్ ఉన్నవారిలో అంధత్వానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. కొందరిలో కంటి చూపు సమస్యలు పైకి కనిపించవచ్చు. మరికొందరిలో కనిపించవు. అలా కనిపించనంత మాత్రాని డయాబెటిస్‌ వ్యాధి కంటిపై ఎలాంటి ప్రభావం చూపదని అనుకోవద్దు.

డయాబెటిక్‌ ఐ ఎవరిలో ఎక్కువ..

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించలేకపోవడం వల్ల అది కండ్లను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ కాలం మధుమేహం ఉన్న వ్యక్తులు, డయాబెటిస్‌ లక్షణాలు ఉన్న గర్భిణీలు, దీర్ఘకాలంపాటు రక్తంలో గ్లూకోజ్‌ను అదుపుచేయని వారు, రక్తంలో అధిక కొలెస్ట్రాల్‌ కలిగి ఉన్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారిలో డయాబెటిక్‌ ఐ కనిపిస్తుంది. అలాగే, సిగరెట్‌ స్మోకింగ్‌ చేసేవారిలో, ఊబకాయులు కూడా డయాబెటిక్‌ ఐ కి గురయ్యే ప్రమాదం ఉన్నది. ఇది మన జీవన నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. మధుమేహులు తప్పనిసరిగా రక్తంలో చక్కెరల స్థాయిలను నియంత్రించేలా చూసుకోవడం అవసరం.

డయాబెటిక్‌ ఐ ఉన్నవారిలో లక్షణాలు..

డయాబెటిక్‌ ఉన్నవారిలో సాధారణంగా.. చూపు మసక బారటం, రంగులను గుర్తించడంలో ఇబ్బందిగా మారడం, చూపుపై చుక్కలు, తీగలు వేలాడుతున్న అనుభూతి కలగడం, తక్కువ వెలుతురులో చూడటం ఇబ్బందికరంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలు కనిపించగానే వెంటనే కంటి వైద్యుడ్ని సంప్రదించడం ఎంతో ముఖ్యం. లేనట్లయితే, కంటి సమస్యలు మరింత ఎక్కువై కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది.

డయాబెటిక్‌ ఐ నిరోధనం ఎలా..?

► డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు రెగ్యులర్‌గా కంటి పరీక్షలు చేయించుకోవాలి.

► కంటి వైద్యుడిని కలిసి ఏడాదికోసారి కంటి పూర్తి చెకప్‌ చేయించుకోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి.

► డయాబెటిక్‌ ఐ ని తొలి దశలోనే గుర్తించడం ద్వారా తగిన మందుల వాడకంతో అదుపులో పెట్టుకోవచ్చు.

► కంటి వైద్యుడిని సంప్రదిస్తూనే కొన్ని లైఫ్‌స్టైల్‌ మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలి.

► తరచుగా బ్లడ్‌ గ్లూకోజ్‌ పరీక్షలు చేయించుకుంటూ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవాలి.

► తంబాకు తినడం, సిగరెడ్‌, బీడీ తాగడం మానుకోవాలి.

► ప్రతియేటా ఒక్కసారైనా పూర్తి కంటి పరీక్ష చేయించుకోవాలి.

► ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు, ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం తప్పనిసరి.

► క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో పెట్టుకోవడం ద్వారా మధుమేహం ఉన్నవారు కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Google Images: మీకు కావాల్సిన ఫోటోలు గూగుల్‌లో దొరకడం లేదా..? ఇలా చేయండి..!