AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Images: మీకు కావాల్సిన ఫోటోలు గూగుల్‌లో దొరకడం లేదా..? ఇలా చేయండి..!

Google Images: ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కారణంగా ప్రతీది ఆన్‌లైన్‌లోనే దొరికిపోతుంది. ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్‌ చేసి క్షణాల్లోనే తెలుసుకోవచ్చు..

Google Images: మీకు కావాల్సిన ఫోటోలు గూగుల్‌లో దొరకడం లేదా..? ఇలా చేయండి..!
Subhash Goud
|

Updated on: Sep 19, 2021 | 12:57 PM

Share

Google Images: ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కారణంగా ప్రతీది ఆన్‌లైన్‌లోనే దొరికిపోతుంది. ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్‌ చేసి క్షణాల్లోనే తెలుసుకోవచ్చు. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌లో చాలా మంది తమకు కావాల్సిన ఇమేజెస్ దొరకడం లేదని ఫీలవుతుంటారు. అటువంటి, వారి కోసం కొన్ని కొత్త పద్దతులను పరిచయం చేస్తోంది గూగుల్. వీటిని అనుసరించడం ద్వారా యూజర్లు తమకు కావాల్సిన ఇమేజ్‌ను హై క్వాలిటీలో డౌన్​లోడ్​చేసుకోవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా.. గూగుల్‌ సెర్చ్‌లో ఇమేజ్ వచ్చాక దానిపై రైట్ క్లిక్ చేసి సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీకు బోలెడన్ని ఇమేజెస్ కనబడుతాయి. అందులో మీకు కావాల్సిన ఇమేజ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా ఇమేజెస్ దొరకనప్పుడు గూగుల్ అందించే రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా మీరు క్వాలిటీ ఇమేజెస్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందుకుగాను మీరు మీ డెస్క్ టాప్ లేదా ఫోన్ లేదా ఇతర ఏ డివైజెస్‌లోనైనా గూగుల్​ఇమేజ్ సులభంగా డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

► బ్రౌజర్‌లో https://images.google.com/ అని టైప్ చేయండి.

►వెబ్ పేజ్‌లోని కెమెరా ఐకాన్‌కు ఎడమవైపునకు ఉన్న సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి.

► ఇప్పుడు మీరు మీకు కావాల్సిన ఇమేజ్ యూఆర్ఎల్ పేస్ట్ చేసి లేదా అప్‌లోడ్ యాన్ ఇమేజ్ ట్యాబ్ ద్వారా ఇమేజ్‌నుఅప్‌లోడ్ చేయండి. తద్వారా మీకు కావాల్సిన ఇమేజ్‌ను గూగుల్ సెర్చ్ చేసి పెడుతుంది.

► ఒకవేళ మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నట్లయితే మీరు సెర్చ్ చేయాలనుకున్న శాంపిల్ ఇమేజ్‌పై రైట్ క్లిక్ చేసి సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ అనే ఆప్షన్​ను ఎంచుకోండి. మీకు కావాల్సిన ఫోటోలు కనిపిస్తాయి.

► మీ వద్ద ఉన్న ఇమేజ్‌ను గూగుల్ ఇమేజెస్ సైట్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కూడా సిమిలార్ ఇమేజెస్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్‌లో సైతం రివర్స్ సెర్చ్ ద్వారా మీకు కావాల్సిన ఇమేజెస్‌ను ఇట్టే వెతుక్కోవచ్చు.. ఎలాగంటే..

► రివర్స్ సెర్చ్ ద్వారా ఇమేజెస్ సెర్చ్ చేయాలనుకుంటే మీ ఫోన్‌లో గూగుల్ యాప్ ఖచ్చితంగా ఉండాలి.

► సెర్చ్ బార్‌లో కెమెరా ఐకాన్‌పైన క్లిక్ చేయాలి. అప్పుడు మీ కెమెరా ఆటోమేటిక్‌గా ఆన్ అయి పిక్చర్ తీసుకోవాలా? అని మిమ్మల్ని అడుగుతుంది.

► కెమెరా నుంచి మీరు ఫొటో తీయొచ్చు లేదా మీ ఫోన్‌లోని ఇమేజ్‌ను బ్రౌజ్ చేసి అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకుగాను మీరు ఆ విండో కింది భాగంలో ఎడమ వైపున ఉండేసెలక్ట్ యాన్ ఇమేజ్ అనే ఆప్షన్ అనే బటన్‌ను క్లిక్ చేస్తే మీకు కావాల్సిన ఫోటోలు వస్తాయి. తర్వాత డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Train Horn Sound: అక్కడ రైలు హరన్‌ సౌండ్‌ బదులు.. కుక్కల అరుపులు.. కారణం ఏంటంటే..

Follow Us
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..
కార్తీక మాసంలో .. వీరు ఏం చేసినా విజయమే.. ముట్టింది ముత్యమే
కార్తీక మాసంలో .. వీరు ఏం చేసినా విజయమే.. ముట్టింది ముత్యమే
నవంబర్ 2026 సింహ రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెంపు
నవంబర్ 2026 సింహ రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెంపు