Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Horn Sound: అక్కడ రైలు హరన్‌ సౌండ్‌ బదులు.. కుక్కల అరుపులు.. కారణం ఏంటంటే..

Train Horn Sound: ప్రపంచ వ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. రైలు వస్తూ కూతపెట్టిందంటే ఈ శబ్దమే వేరు. రైలు కూతకు బదులు కుక్కల అరుపులు..

Train Horn Sound: అక్కడ రైలు హరన్‌ సౌండ్‌ బదులు.. కుక్కల అరుపులు.. కారణం ఏంటంటే..
Follow us
Subhash Goud

|

Updated on: Sep 19, 2021 | 11:53 AM

Train Horn Sound: ప్రపంచ వ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. రైలు వస్తూ కూతపెట్టిందంటే ఆ శబ్దమే వేరు. రైలు కూతకు బదులు కుక్కల అరుపులు ఉంటే ఎలా ఉంటుంది. వినడానికి ఆశ్యర్యంగానే ఉంది.  అక్కడ మాత్రం రైలు కూతకు బదులు కుక్కల కూత ఉంటుంది. రైలు హరన్‌కు కుక్కల కూత ఏంటని అనుకుంటున్నారా..? ఇది నిజమే. భూకంప పరిస్థితుల్లో సైతం ప్రత్యేక ఆటోమేటిక్‌ లాకింగ్‌ వ్యవస్థలు కలిగిన జపనీస్‌ ట్రైన్‌ టెక్నాలజీకి.. 2018 వరకూ ఆ దేశ వన్యప్రాణులే బ్రేక్స్‌ వేసేవి. సూపర్‌ ఫాస్ట్‌ షింకన్సేన్‌ (బుల్లెట్‌ ట్రైన్‌) సైతం దూసుకుపోగలిగే జపాన్‌ రైల్వే ట్రాక్స్‌పై వందలాదిగా జింకలు ప్రాణాలు కోల్పోవడం, ఆ కారణంగా రైల్వే ప్రయాణికులు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకోవడం.. జపాన్‌ రైల్వే వ్యవస్థకు పెద్ద సమస్యగా మారింది.

రైల్వే ట్రాక్‌కు, హిల్స్‌కు జరిగే యాక్షన్‌లో కొన్ని ఐరన్‌ ఫిల్లింగ్స్‌ ఆకర్షించే రుచిని కలిగి ఉండటంతో.. వాటిని నాకేందుకు జింకలు భారీగా రైల్వే ట్రాక్స్‌ మీదకు వస్తున్నాయని అధ్యయనాలు తేల్చాయి. అలా వచ్చిన జింకలు రైలు కిందపడి చనిపోయేవి. దాంతో రంగంలోకి దిగిన రైల్వే టెక్నికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్టీఆర్‌ఐ) పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది.

సింహం పేడను తెచ్చి ట్రాక్‌పై..

ఇక జింకలు రైల్వే ట్రాక్‌పైకి రాకుండా ఉండేందుకు సింహం పేడను తెచ్చి ట్రాక్‌ పొడవునా జల్లి ఓ ప్రయోగం చేశారు. ఆ వాసనకి అక్కడ సింహాలు ఉన్నాయేమోనన్న భయంతో జింకలు ట్రాక్‌ మీదకి వచ్చేవి కావట. అయితే వర్షం పడి సింహం పేడ కొట్టుకుపోవడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. శాశ్వత పరిష్కారం కోసం రైలు కూత శబ్దానికి కుక్క అరుపులను జోడించారు. 20 సెకన్ల పాటు కుక్క అరుపులు వినిపిస్తుంటే.. జింకలు ట్రాక్‌ మీద నుంచి పారిపోవడం గమనించిన అధికారులు.. ఈ ప్రయోగం బాగానే ఉందని గుర్తించారు. ప్రస్తుతం వన్యప్రాణులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో జపాన్‌ రైళ్లు కుక్కల్లా మొరుగుతున్నాయి. జపానీస్‌ల ఐడియా అదిరిపోయింది కదూ.

+

ఇవీ కూడా చదవండి:

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Bank Account Aadhaar Link: మీ ఆధార్‌ నెంబర్‌ ఏ బ్యాంకు ఖాతాకు లింక్‌ అయ్యిందో తెలుసుకోండిలా..!

Bank Balance: ఒకే రోజు కరోడ్‌పతి.. రైతు బ్యాంకు ఖాతాలో రూ.52 కోట్లు జమ.. షాకైన అధికారులు