Bank Account Aadhaar Link: మీ ఆధార్‌ నెంబర్‌ ఏ బ్యాంకు ఖాతాకు లింక్‌ అయ్యిందో తెలుసుకోండిలా..!

Bank Account Aadhaar Link: ప్రస్తుతం ఆధార్‌ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు రేషన్‌ కార్డు, బ్యాంకింగ్‌ రంగంలో..

Bank Account Aadhaar Link: మీ ఆధార్‌ నెంబర్‌ ఏ బ్యాంకు ఖాతాకు లింక్‌ అయ్యిందో తెలుసుకోండిలా..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 18, 2021 | 12:42 PM

Bank Account Aadhaar Link: ప్రస్తుతం ఆధార్‌ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు రేషన్‌ కార్డు, బ్యాంకింగ్‌ రంగంలో, ఇతర చిన్నపాటి పనులకు కూడా ఆధార్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. ఇక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన అకౌంట్లలో జమ అవుతుంటాయి. ఆధార్‌ కార్డు లింక్‌ కాని పక్షంలో వెంటనే చేసుకోవాలని ఇప్పటికే అధికారుల పదేపదే కోరుతున్నారు. దీంతో బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరిగా మారిపోయింది. అయితే రెండు మూడు, ఇంకా అంతకంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నవాళ్లు తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయిందో తెలియక సతమతమవుతుంటారు.

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఈ సేవలను అందిస్తోంది. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లో మీరు మీ ఆధార్ నెంబర్‌ను ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేశారో తెలుసుకోవచ్చు. అయితే ముందుగా మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండటంత తప్పనిసరి. అలాంటి సమయంలోనే ఈ వివరాలు తెలుస్తాయి. ఒకవేళ మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే చేసుకోవాలి.

ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకోండిలా..

– ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్  ఓపెన్ చేయండి. – హోమ్ పేజీలో Aadhaar Services పైన క్లిక్ చేయండి. – Check Aadhaar Bank Linking Status లింక్ పైన క్లిక్ చేయండి. – కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. – ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయండి. – సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి. – ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేయండి. – మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. – ఓటీపీ ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి.

మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు అకౌంట్‌కు లింక్ అయిందో వివరాలు కనిపిస్తాయి. మీ ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలు, బ్యాంక్ లింక్ స్టేటస్, ఎప్పటి నుంచి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అయింది, ఏ బ్యాంకుతో ఆధార్ నెంబర్ లింక్ అయిందో వివరాలు తెలుస్తాయి. ఒక వేళ మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ కానట్లయితే మీరు మీ ఖాతా ఉన్న బ్యాంకు వెబ్‌సైట్‌లో ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. మీకు రెండు మూడు బ్యాంక్ ఖాతాలున్నట్లయితే మీరు ప్రభుత్వ పథకాలకు చెందిన డబ్బుల్ని ఏ అకౌంట్‌లోకి పొందాలనుకుంటే ఆ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయాలి.

ఇవీ కూడా చదవండి:

Bank Balance: ఒకే రోజు కరోడ్‌పతి.. రైతు బ్యాంకు ఖాతాలో రూ.52 కోట్లు జమ.. షాకైన అధికారులు

Pan Card And Aadhaar Link: అదిరిపోయే శుభవార్త.. పాన్‌- ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు..!