Pan Card And Aadhaar Link: అదిరిపోయే శుభవార్త.. పాన్‌- ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు..!

Pan Card And Aadhaar Link: మీకు పాన్ కార్డు ఉందా.? ఆధార్‌ నెంబర్‌తో దానిని లింక్ చేశారా.? లింక్ చేయకపోతే టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. ఇందుకే..

Pan Card And Aadhaar Link: అదిరిపోయే శుభవార్త.. పాన్‌- ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 18, 2021 | 11:20 AM

Pan Card And Aadhaar Link: మీకు పాన్ కార్డు ఉందా.? ఆధార్‌ నెంబర్‌తో దానిని లింక్ చేశారా.? లింక్ చేయకపోతే టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. ఇందుకే కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో ఆధార్‌ కార్డుతో పాన్‌ కార్డు అనుసంధానం చేసేందుకు సెప్టెంబర్‌ 30తో గడువు ఉండేది. ఇప్పుడు ఆ గడువును పొడిగించింది. పాన్‌తో ఆధార్‌ అనుసంధానం గడువును మార్చి 31, 2022 వరకు పొడిగించింది కేంద్రం. ఇందుకు గతంలో నిర్దేశించిన గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సింది. కరోనా కాలంలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా మరో ఆరు నెలల సమయం కల్పిస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) శుక్రవారం వెల్లడించింది. అంతేకాదు, ఐటీ చట్టంలో భాగంగా పెనాల్టీ ప్రొసీడింగ్స్‌ను పూర్తి చేసేందుకు సైతం గడువును ఈ నెల 30 నుంచి వచ్చే ఏడాది మార్చి చివరి వరకు పొడిగించింది. ‘బినామీ ఆస్తుల లావాదేవీల నిరోధక చట్టం, 1988’లో భాగంగా తీర్పు ఇచ్చే అధికారి నోటీసులు, ఆదేశాల జారీకి కాలపరిమితిని సైతం వచ్చే మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) వెల్లడించింది.

కాగా, ప్రస్తుతం బ్యాంకు ఖాతాలు తెరవడం, బ్యాంకు ఖాతాలో నగదు డిపాజిట్‌ చేయడం, డీమ్యాట్‌ ఖాతా తెరవడం, స్థిరాస్తుల లావాదేవీ, సెక్యూరిటీలలో లావాదేవీలు వంటి ఆర్థిక లావాదేవీల కోసం పాన్‌ కార్డు తప్పనిసరి అయిపోయింది. పాన్‌ కార్డు అనేది దేశంలో తప్పనిసరి. ఇందులో భాగంగా పాన్‌ కార్డుకు ఆధార్‌ నెంబర్‌ను అనుసంధానం చేయడం ఎంతో ముఖ్యంగా. కేంద్రం ప్రభుత్వం ఈ రెండింటిని లింక్‌ చేసేందుకు ఎన్నో సార్లు గడువు పొడిగిస్తూ వస్తోంది. చివరిగా ఈ నెలాఖరుతో గడువు పూర్తి ఉండగా, వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది మార్చి నెల వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాన్‌తో ఆధార్‌ అనుసంధానం చేయని వారికి ఎంతో ఊరటనిచ్చినట్లయింది.

పాన్‌కార్డులు చాలా ఆర్థిక లావాదేవీల్లో కీలకం

పాన్‌కార్డులు చాలా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటిల్లో చాలా కీలకం. బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు, మ్యూచువల్‌ ఫండ్లు, షేర్‌లలో ఇది ఎంతో ముఖ్యం. అయితే రూ. 50 వేలకు మించి నగదు లావాదేవీల సమయంలోనూ పాన్‌ కార్డు తప్పనిసరి అవసరం. పాన్‌ చెట్లుబాటులో లేకపోతే ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. ఇబ్బందులు తలెత్తే అవకాశాలుంటాయి. అయితే పాన్‌, ఆధార్‌లను లింక్‌ చేయడం సులభమే. ఇన్‌కంట్యాక్స్‌ ఇఫైలింగ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటిపిని ఎంటర్‌ చేస్తే పూర్తయిపోతుంది.

లేదా..ఆధార్‌తో అనుసంధానం అయిన మొబైల్‌ నెంబర్‌ నుంచి UIDAIPAN అని టైప్‌ చేసి 12 అంకెల ఆధార్‌ నెంబరు, స్పేస్‌ ఇచ్చి, పాన్‌ నెంబరును.. 567678 లేదా 56161 అనే నెంబర్లకు సందేశం పంపించాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఆధార్‌, పాన్‌ వివరాలన్నీ ఒకే విధంగా ఉండాలి. కాగా, ఇప్పటికే మీరు రెండింటిని జత చేసుకున్నా.. మరోసారి ఇఫైలింగ్‌ వెబ్‌సైట్‌లకి వెళ్లి చెక్‌ చేసుకోవడం మంచిది.

ఇవీ కూడా చదవండి: Hero MotoCorp: కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్‌.. భారీగా పెరగనున్న హీరో ద్విచక్ర వాహనాల ధరలు.. ఎంతంటే..!

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్‌.. డబ్బులు లేకపోయినా.. రూ.70 వేల వరకు షాపింగ్‌ చేయవచ్చు.. ఎలాగంటే..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే