Cooking Oil Price: కేంద్రం నిర్ణయంతో దిగి వచ్చిన వంట నూనె ధరలు.. హోల్‌సేల్ మార్కెట్లో ధరల వివరాలు..
Cooking Oil Price: పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యులకు ఇబ్బందిగా మారుతోంది. ముఖ్యంగా వంట నూనె ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య జనాలకు..
Cooking Oil Price: పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యులకు ఇబ్బందిగా మారుతోంది. ముఖ్యంగా వంట నూనె ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య జనాలకు మరింత భారంగా మారుతోంది. ఇప్పటికే దిగి వచ్చిన వంట నూనె ధరలు.. మున్ముందు మరింతగా దిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంట నూనెల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనె దిగుమతిపై విధించే సుంకంలో కోత విధించింది. నూనె దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 5.5 శాతం తగ్గించింది. కేంద్రం నిర్ణయంతో పండగ సీజన్‌లో సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. అయితే గత ఏడాది కాలంగా మండిపోతున్న వంటనూనె ధరలు దిగి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం సుంకాలు తగ్గించడంతో హోల్‌సేల్ మార్కెట్‌లో వివిధ రకాల వంటనూనెల ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు వివిధ నూనెలకు సంబంధించి ధరల తగ్గింపు వివరాలను కేంద్రం వెల్లడించింది.
హోల్‌సేల్ మార్కెట్‌లో పామాయిల్ ధరలు 2.5 శాతం తగ్గాయి. గత వారం టన్ను పామాయిల్ ధర రూ. 12,666 ఉండగా ప్రస్తుతం రూ. 12,349కి చేరుకుంది. సీసమ్ ఆయిల్ 2.08 శాతం తగ్గి టన్ను ఆయిల్ ధర రూ. 23,500లకు చేరుకుంది. కొబ్బరి నూనె ధరలు 1.72 శాతం తగ్గి టన్ను ఆయిల్ ధర రూ. 17,100లుగా ఉంది. అలాగే సన్‌ఫ్లవర్ నూనె ధరలు 1.30 శాతం తగ్గి టన్ను ధర రూ. 15,965లకు చేరుకుంది. అంతకు ముందు ఈ ధర రూ.16,176 ఉండేది. ఇక వేరు శనగ నూనె ధరలు 1.28 శాతం తగ్గి హోల్ సేల్ మార్కెట్‌లో టన్ను ఆయిల్ ధర 16,839గా ట్రేడ్ అవుతోంది. వనస్పతి నూనె ధరలు 1 శాతం తగ్గి రూ. 12,508కి చేరుకుంది. అలాగే ఆవాల నూనె ధరలు సైతం 1 శాతం తగ్గి టన్ను ఆయిల్ ధర రూ. 16,573 వద్ద ట్రేడవుతోంది.
కాగా, వంట నూనె ధరల్లో తగ్గుదల ఉన్నా గత సంవత్సరం ఇదే సమయానికి నమోదైన ధరలతో పోల్చితే ఇంకా అధికంగానే ఉన్నాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో ధరలు తగ్గిపోవడంతో నూనె ధరల వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించాలంటూ వ్యాపారులను కేంద్రం ఆదేశించింది. సెప్టెంబర్ 30 వరకు ముడి పామాయిల్ పై ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 30.25 నుంచి 24.7 శాతానికి తగ్గించగా, శుద్ది చేసిన పామాయిల్ దిగుమతి సుంకాన్ని 41.25 శాతం నుంచి 35.75 శాతానికి తగ్గించింది. ఇక సన్‌ప్లవర్ నూనెపై దిగుమతి సుంకం కూడా సెప్టెంబర్ చివరి నాటికి 45 శాతం నుంచి 37.5 శాతానికి తగ్గించబడింది.
ఈ నెలాఖరు నాటికి కొత్త ఖరీఫ్ పంట రాకతో ప్రపంచ మార్కెట్లలో ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. కేంద్ర తీసుకున్న చర్యలతో వంట నూనె ధరలు దిగివస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి కొత్త ఖరీఫ్ పంట రాకతో ప్రపంచ మార్కెట్లలో ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు.