FASTAG Video: ఇకపై పార్కింగ్‌లోనూ ఫాస్టాగ్..! పార్కింగ్ గేటు దగ్గర వెయిట్ చెయ్యాల్సిన అవసరం లేదు..(వీడియో)
డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ పేటీఎం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌తో కలిసి ఫాస్టాగ్ ఆధారిత పార్కింగ్ సర్వీసులు ప్రారంభించింది. వీటిని త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్పష్టం చేసింది....
డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ పేటీఎం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌తో కలిసి ఫాస్టాగ్ ఆధారిత పార్కింగ్ సర్వీసులు ప్రారంభించింది. వీటిని త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్పష్టం చేసింది. కశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఈ తరహా విధానంలో ఫాస్టాగ్ స్టికర్ గల కార్లు.. పార్కింగ్ ఏరియాలోకి వచ్చినప్పుడు నగదు చెల్లించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ దగ్గర ఆగాల్సిన అవసరం ఉండకుండా ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది.
ఇక ద్విచక్ర వాహనాల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపుల విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పీపీబీఎల్ పేర్కొంది. ఈ విధానం వల్ల ఫాస్టాగ్ ఉన్న కార్లు పార్కింగ్ కౌంటర్ వద్ద ఎలాంటి ఆలస్యం లేకుండా వెళ్లేందుకు వీలవుతుంది. కార్లతో పాటు ద్విచక్రవాహనాలకూ యూపీఐ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేటీఎం పేర్కొంది. జూన్ నాటికి పేటీఎం కోటికి పైగా ఫాస్టాగ్‌లను జారీ చేసింది. మొత్తం అన్ని బ్యాంకులూ కలిసి జూన్ చివరి నాటికి 3.47 కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేశాయి.
రానున్న రోజుల్లో షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, విమానాశ్రయాల్లోని పార్కింగ్ స్థలాల్లోనూ డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు పలు సంస్థలతో చర్చిస్తున్నట్లు పేటీఎం వివరించింది. కాగా, టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో అన్ని ఆన్‌లైన్ అయిపోతున్నాయి. టోల్‌గేట్ల వద్దనే ఫాస్టాగ్ ఉండగా, ఇప్పుడు పార్కింగ్‌లోనూ ఏర్పాటు చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : IPL 2021: రెడ్ టూ బ్లూ.. కొత్త లుక్‌లో ఆర్సీబీ.. కారణం ఏంటో తెలుసా.?(వీడియో)
శివాలయంలో నాగుపాము హల్ చల్.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..(వీడియో): Snake Viral Video.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

