IPL 2021: రెడ్ టూ బ్లూ.. కొత్త లుక్‌లో ఆర్సీబీ.. కారణం ఏంటో తెలుసా.?(వీడియో)
ఐపీఎల్ 2021 రెండవ దశ కోసం యూఏఈలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అక్కడి చేరుకున్న అన్ని జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోగా.. మరికొంత మంది ప్లేయర్లు ఇంకా క్వారంటైన్‌లో ఉన్నారు. సెప్టెంబర్ 19 నుంచి ఈ లీగ్ మొదలుకానుంది.అయితే.....
RCB New Jersey Video in IPL 2021: ఐపీఎల్ 2021 రెండవ దశ కోసం యూఏఈలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అక్కడి చేరుకున్న అన్ని జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోగా.. మరికొంత మంది ప్లేయర్లు ఇంకా క్వారంటైన్‌లో ఉన్నారు. సెప్టెంబర్ 19 నుంచి ఈ లీగ్ మొదలుకానుంది. చెన్నై వర్సెస్ ముంబై టీంల మధ్య మ్యాచ్‌తో పోటీలు ప్రారంభంకానున్నాయి. అయితే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్‌సీబీ జట్టు.. కొత్త జెర్సీతో బరిలోకి దిగబోతుంది.
సెప్టెంబర్ 20 న కేకేఆర్‌తో తమ మొదటి తొలి పోరాటానికి సిద్ధమవుతోంది ఆర్సీబీ. అయితే కొత్త లుక్‌లో రెండవ దశలో బరిలోకి దిగనున్నారు ఆర్సీబీ జట్టు. బ్లూ కలర్ జెర్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కనిపించనుంది. తొలి దశలో ఎరుపు జెర్సీలో కనిపించిన కోహ్లీ టీం.. నీలం రంగు జెర్సీలో కనిపించనున్నారు. అయితే ఇది ఈ ఒక్క మ్యాచ్ కోసం మాత్రమేనని టీం పేర్కొంది. కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ కార్మికులకు మద్దతు ఇవ్వడం కోసం బ్లూ జెర్సీని ధరిస్తున్నట్లు టీం పేర్కొంది.
ఐపీఎల్ 2021 మొదటి దశలో కూడా, కెప్టెన్ విరాట్ కోహ్లీ టీం కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ కార్మికులకు పూర్తి ఉత్సాహంతో మద్దతు ఇచ్చారు. లైట్ బ్లూ రంగు జెర్సీ ధరించడం ద్వారా వారికి మద్దతు ఇచ్చారు. ఫ్రంట్‌లైన్ కార్మికులకు మద్దతుగా లేత నీలం రంగు జెర్సీని ధరిస్తుంది. ఎందుకంటే ఈ జెర్సీ రంగు PPE కిట్‌తో సరిపోతుందని టీం పేర్కొంది. హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడానికి తన ఫ్రాంఛైజీ ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుందని కోహ్లీ ప్రకటించాడు.
మరిన్ని చదవండి ఇక్కడ : News Watch : నిర్మల్ గజ్వేల్ లో గర్జనలు | చంద్రబాబు ఇంటిపై దండయాత్ర మరిన్ని వార్తా కధనాల కొరకు న్యూస్ వాచ్… ( వీడియో)
శివాలయంలో నాగుపాము హల్ చల్.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..(వీడియో): Snake Viral Video.