Empty Stomach: ఉదయం లేవగానే ఖాళీ క‌డుపుతో వీటిని తీసుకుంటున్నారా..? మీ ఆరోగ్యం పాడైనట్లే..!

Empty Stomach: ఉద‌యం లేవ‌గానే క‌డుపు ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే.. రాత్రి ప‌డుకునే ముందు ఆహారం తీసుకున్నా.. ఉద‌యం లేచేవ‌ర‌కు క‌డుపులో ఉన్న..

Empty Stomach: ఉదయం లేవగానే ఖాళీ క‌డుపుతో వీటిని తీసుకుంటున్నారా..? మీ ఆరోగ్యం పాడైనట్లే..!
Empty Stomach
Follow us
Subhash Goud

|

Updated on: Sep 17, 2021 | 11:59 AM

Empty Stomach: ఉద‌యం లేవ‌గానే క‌డుపు ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే.. రాత్రి ప‌డుకునే ముందు ఆహారం తీసుకున్నా.. ఉద‌యం లేచేవ‌ర‌కు క‌డుపులో ఉన్న ఆహారం అరిగిపోతుంది. అంటే క‌నీసం 8 గంట‌ల నుంచి క‌డుపు ఖాళీగా ఉంటుంది. అటువంటి స‌మ‌యంలో శ‌రీరం లోప‌ల చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ స‌మ‌యంలో తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం అశ్రద్ద చేసినా.. అనారోగ్యానికి గురైనట్లే. ఇప్పుడున్న కాలంలో చాలా మంది అనారోగ్యానికి గురయ్యే వారే ఉంటున్నారు. చాలా మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. కొన్ని చిట్కాలను పాటిస్తే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు.

ఉద‌యం లేవ‌గానే.. ఖాళీ క‌డుపుతో.. లేదా ప‌రిగ‌డుపున ఏం తిన‌కూడ‌దో చాలామందికి తెలియ‌దు. ఏది పడితే అది తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అస‌లు.. ఉద‌యం లేవ‌గానే ఏం తిన‌కూడ‌దు.. ఏం తాగ‌కూడ‌దు.. అనే విష‌యాల‌ను సెల‌బ్రిటీ న్యూట్రిష‌నిస్ట్ పూజా మ‌ఖిజా త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. అవేంటంటే..

కాఫీ:

ఉదయం లేవగానే ముందుగా తాగే కాఫీ. లేవ‌గానే చాలామంది చేసే ప‌ని ఇదే. కాఫీ లేనిదే ఉండరు. నిద్ర లేవగానే ఇది తాగితే కానీ.. వాళ్ల ప‌నులు మొదలు పెట్టరు. దానికే బెడ్ కాఫీ అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఖాళీ క‌డుపుతో కాఫీ తాగితే అసిడిటీ సమస్యలు వస్తాయంటున్నారు. అసిడిటీ వ‌ల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్రావం ప్రేరేపితం అయి చాలా స‌మ‌స్యలు వ‌స్తాయి. తిన్నది అర‌గ‌క‌పోవ‌డం, చాతిలో నొప్పి రావ‌డంతో పాటు ఇంకా చాలా స‌మ‌స్యలు వ‌స్తాయి. అందుకే.. ఖాళీ క‌డుపుతో కాఫీ తాగ‌డం ఎంత త్వర‌గా మానేస్తే అంత మంచిది.

ఆల్కాహాల్:

చాలామందికి ఇష్టమైన డ్రింక్ ఇది. కానీ.. దీన్ని ఎప్పుడు తీసుకోవాలో అప్పుడే తీసుకోవాలి. ఖాళీ క‌డుపుతో మ‌ద్యాన్ని తీసుకుంటే ఆల్కాహాల్ నేరుగా ర‌క్తంలో క‌లిసిపోతుంది. దాని ద్వారా శ‌రీరంలో మొత్తానికి ఆల్కాహాల్ వ్యాపిస్తుంది. దీని వల్ల బీపీ ఎక్కువ కావడమే కాకుండా పల్స్‌ రేటు సైతం ఒక్కసారిగా పడిపోతుంది. అలాగే ఆల్కాహాల్‌ ర‌క్తం ద్వారా కిడ్నీలు, ఊపిరితిత్తులు, లివ‌ర్.. అటునుంచి మెద‌డుకు కూడా చేరుతుంది. ఇది దీర్ఘకాలంలో చాలా స‌మ‌స్యలు వస్తాయి.

ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మెడిసిన్‌ను అస్సలు వేసుకోకూడదు. పెయిన్‌ కిల్లర్‌, జ్వరం తగ్గించే మందులు వంటివి ఈ కేటగిరి కిందకే వస్తాయి. వీటిని ఖాళీ క‌డుపుతో అస్సలు వేసుకోవ‌ద్దు. ఏదైనా తిన్నాకే ఈ మెడిసిన్‌ను వేసుకోవాలి. ఖాళీ క‌డుపున ఈ మెడిసిన్స్ వేసుకుంటే.. క‌డుపులో తిప్పిన‌ట్టుగా అవ‌డం, వాంతులు, వికారం అయ్యే ప్రమాదం ఉంటుంద‌ట‌. అలాగే.. మెడిసిన్స్ ప‌డ‌క నోటిలో, క‌డుపులో పుండ్లు అవుతాయ‌ని న్యూట్రిష‌నిస్ట్ చెబుతున్నారు.

షాపింగ్ చేయడం:

ముఖ్యంగా మహిళలు షాపింగ్‌ అంటే ముందుంటారు. కొందరు ఏమి తినకుండానే షాపింగ్‌కు వెళ్తుంటారు. ఖాళీ క‌డుపుతో షాపింగ్ చేస్తే.. కావాల్సిన వాటి కంటే ఎక్కువ వ‌స్తువుల‌ను తీసుకుంటార‌ట‌. అలాగే.. ఎక్కువ కాల‌రీలు ఉన్న ఆహారాన్ని, జంక్ ఫుడ్‌ను తింటార‌ని.. అందుకే ఖాళీ క‌డుపుతో కాదు.. ఫుల్‌గా తిని షాపింగ్‌కు వెళ్లాల‌ని పూజ స‌ల‌హా ఇస్తున్నారు. అలాగే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఎవ్వరితోనూ గొడవ పెట్టుకోకూడదట. ఒక‌వేళ ఎవ‌రితోనైనా ఎక్కువగా వాదించాలంటే ముందు ఏదైనా తిని ఉండటం మంచిది అంటున్నారు పూజ. ఆక‌లితో ఉన్నప్పుడు త‌క్కువ బీపీ ఉంటుంద‌ట‌. అలాగే గొడ‌ప పెట్టుకుంటూ ఉండే.. బీపీ పూర్తిగా డౌన్ అయిపోయే ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది.

చూయింగ్‌ గమ్‌:

చాలా మందికి చూయింగ్‌ గమ్‌ అంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అయినా ఉదయం ఖాళీ కడుపుతో నమలకూడదు. వాస్తవానికి చూయింగ్‌ గమ్‌ నమలడం వల్ల జీర్ణవ్యవ‌స్థలో ఆమ్లాలు విడుద‌ల‌వుతాయి. అవి జీర్ణాశ‌యంలో ఉన్న ఆహారాన్ని అర‌గ‌దీస్తాయి. ఖాళీ క‌డుపుతో చూయింగ్‌ గ‌మ్ న‌మిలితే జీర్ణాశ‌యంలో ఎటువంటి ఆహారం ఉండ‌దు కాబ‌ట్టి గ‌మ్ న‌మ‌ల‌డం వ‌ల్ల విడుద‌లైన ఆమ్లాలు జీర్ణవ్యవస్థపై దెబ్బతిస్తాయి. దాని వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి.

ఇవీ కూడా చదవండి:

Beetroot Juice Benefits: బీట్‌రూట్‌ జ్యూస్‌ పరగడుపున తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..?

Weight Loss Tips: ఈ మూడు కీలక సూత్రాలు పాటిస్తే బరువు తగ్గవచ్చు.. ఆరోగ్య నిపుణుల సూచనలు..!

Fitness Tips: మీరు జిమ్‌కు వెళ్తున్నారా? ఫిట్‌నెస్‌ కోసం ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Turmeric Milk Benefits: పాలలో పసుపు వేసుకుని తాగితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసా..?

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.