Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turmeric Milk Benefits: పాలలో పసుపు వేసుకుని తాగితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసా..?

Turmeric Milk Benefits: కొన్ని ఇంట్లో ఉండే వాటితోనే మన ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆహార నియమాలు పాటిస్తూ మంచి విటమిన్‌..

Turmeric Milk Benefits: పాలలో పసుపు వేసుకుని తాగితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసా..?
Turmeric Milk Benefits
Follow us
Subhash Goud

|

Updated on: Sep 17, 2021 | 8:55 AM

Turmeric Milk Benefits: కొన్ని ఇంట్లో ఉండే వాటితోనే మన ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆహార నియమాలు పాటిస్తూ మంచి విటమిన్‌ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణ చాలా మందికి రోజు పాలు తాగే అలవాటు ఉంటుంది. అయితే దానికి కాస్త మంచి పసుపును జోడిస్తే రుచికి రుచి.. అరోగ్యానికి ఆరోగ్యం అని అంటున్నారు నిపుణులు. పాలలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెదడును ఎంతో చురుగ్గా ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడులోని కణాల ఆర్యోగానికి సహాయపడతాయి. రోజూ మూడు గ్లాసుల పాలు తాగేవారు వ్యాధులకు దూరంగా ఉంటారని పలు పరిశోధనల్లోనూ తేలింది. అలాంటి సుగుణాలున్న పాలకు పసుపు తోడైతే ఆరోగ్యానికి అదనపు ప్రయోజనాలు లభించినట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇది పురాతన కాలం నుంచి ఉన్నదే. మన పూర్వీకులు కూడా పసుపు పాలను తాగేవారు. అందుకే వారు ఆరోగ్యంగా ఉండేవారు. దగ్గు, జలుబుతో బాధపడేవారు ఈ పసుపు పాలను తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. పసుపులో ఎన్నో ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయి. అలాగే కఫం ఎక్కువగా ఉండి ఇబ్బందిపడేవారు వెచ్చని పసుపు పాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. పాలలో సెరటోనిన్‌ అనే బ్రెయిన్‌ కెమికల్‌, మెలటోనిన్‌ ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్‌ న్యూట్రియంట్స్‌తో కలిసి ఒత్తిడిని తొలగిస్తాయి. దానివల్ల హాయిగా నిద్ర పడుతుంది.

పసుపు పాలతో మరిన్ని ప్రయోజనాలు:

► రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. ► పసుపు పాలు వైరల్‌ దాడి నుంచి కాలేయాన్ని రక్షిస్తాయి. ► పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి. ► ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గిస్తుంది. ► కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పక తాగితే ఎంతో ప్రయోజనం. ► రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులను దూరం చేస్తుంది. ► అందుకే కాలేయ సంబంధ పచ్చ కామెర్ల లాంటి వ్యాధులు దరి చేరవు. ► కాలేయంలో చేరే విషకారకాలను హరిస్తుంది. ► పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి కామెర్లు దరిచేరకుండా కాపాడుతుంది. ► లింఫోటిక్‌ సిస్టమ్‌ను కూడా శుద్ధిచేస్తాయి. ► పసుపులో ఉండే కర్‌క్యుమిన్‌ శరీరంలో వైరస్‌ వృద్ధిని అరికడుతుంది. ► నీటి ద్వారా శరీరంలోకి చేరుకున్న వైరస్‌ త్వరితగతిన రెట్టింపు కాకుండా అడ్డుకుంటుంది.

ఇవీ కూడా చదవండి:

Beetroot Juice Benefits: బీట్‌రూట్‌ జ్యూస్‌ పరగడుపున తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..?

Weight Loss Tips: ఈ మూడు కీలక సూత్రాలు పాటిస్తే బరువు తగ్గవచ్చు.. ఆరోగ్య నిపుణుల సూచనలు..!

Fitness Tips: మీరు జిమ్‌కు వెళ్తున్నారా? ఫిట్‌నెస్‌ కోసం ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!