Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fitness Tips: మీరు జిమ్‌కు వెళ్తున్నారా? ఫిట్‌నెస్‌ కోసం ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Fitness Tips: ఇప్పుడున్న రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముందే కరోనా మహమ్మారి వల్ల చాలా మంది ఆనారోగ్యం బారిన పడి ఎన్నో..

Fitness Tips: మీరు జిమ్‌కు వెళ్తున్నారా? ఫిట్‌నెస్‌ కోసం ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 10, 2021 | 7:08 AM

Fitness Tips: ఇప్పుడున్న రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముందే కరోనా మహమ్మారి వల్ల చాలా మంది ఆనారోగ్యం బారిన పడి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఫిట్‌నెస్‌ కోసం అనేక కసరత్తులు చేస్తున్నారు. అయితే జిమ్‌లలో చేస్తున్న తప్పిదాలు వారి ప్రాణాలను వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల బెంగళూరులో ఓ వ్యక్తి జిమ్‌ చేస్తూ అలిసిపోయి మెట్లపై కూర్చున్నాడు. నిమిషాల వ్యవధిలో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే మరణించిట్లు వైద్యులు నిర్ధారించారు. ఇలా అనుకోని ఘటనలు జరిగినప్పుడు జిమ్‌ సెంటర్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఎలాంటి పరిస్థితుల్లో జిమ్‌ చేయాలి? చేయకూడని అంశాలపై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. జిమ్‌లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు తెలియజేస్తున్నారు.

జిమ్‌లలో వెంటిలేషన్‌..

జిమ్‌ సెంటర్లలో వెంటిలేషన్‌ లేకుంటే జిమ్‌ చేయకూడదు. చిన్న చిన్న గదుల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌, రిన్నింగ్‌, జాగింగ్‌ లాంటివి చేసినప్పుడు వదిలే గాలినే తిరిగి తీసుకోవాల్సి వస్తుంది. దీంతో రక్తంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతం పెరుగుతుంది. అధిక తలనొప్పి రావడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

బరువు తగ్గించుకోవడం, వెయిట్‌ గెయిన్‌ కోసం చాలా మంది జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇంకొంత మంది ఫిట్‌నెస్‌ కోసం వెళ్తున్నారు. ఉద్యోగులు, మహిళలు అధిక బరువు, థైరాయిడ్‌ లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. అమ్మాయిలైతే నడుము చుట్టున్న కొవ్వును తగ్గించుకునేందుకు, యువకులైతే మజిల్స్‌, చెస్ట్‌ పెంచుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అందుకే ప్రత్యేక వ్యాయమాలు, ఫిట్‌గా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు.

జిమ్‌ జీవితంలో ఒక భాగమైపోయింది. థైరాయిడ్‌, అర్ధరైడ్‌తో బాధపడుతున్నవారు అధికంగా జిమ్‌లకు వస్తున్నారు. 50 ఏళ్లు పైబడిన వారు మోకాల నొప్పులు, బీపీ తగ్గించుకునేందుకు వ్యాయామంపై దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం సరైన శిక్షణ లేనివారు కూడా జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మంచి కోచ్‌ ఉన్న జిమ్‌లో చేరడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

► జిమ్‌లో సరైన వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలి.

► జిమ్‌ చేసేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు వాడుతున్నవారు వైద్యుల సూచన మేరకు వ్యాయమం చేయాలి.

► ప్రతి జిమ్‌లో తప్పనిసరిగా మెడికల్‌ అడ్వైజర్‌ను ఏర్పాటు చేసుకోవాలి.

► సామర్థ్యానికి మించి వ్యాయమం చేయకపోవడం మంచిది.

► జిమ్‌లలో ఒకే విధమైన వ్యాయమం చేయకుండా రకరకాలుగా చేయడం మంచిది.

► వ్యాయామం చేస్తున్న సమయంలో మాస్క్‌లు ధరించవద్దు.

► జిమ్‌ కోచ్‌ దగ్గరే వ్యాయామాలు నేర్చుకోవాలి.

► జిమ్‌లో అతిగా బరువున్న పరికరాలను ఎత్తకపోవడం మంచిది.

► వాటర్‌ బాటిల్‌, టవల్‌, లెమన్‌ వాటర్‌, కొబ్బరి వాటర్‌, ఓఆర్‌ఎస్‌ వెంట ఉంచుకోవడం మర్చిపోవద్దు.

► జిమ్‌ చేసిన తర్వాత పండ్లు, గుడ్డు తీసుకుంటే ఒంటి, కండరాల నొప్పులు రావు.

► వ్యాయామాలు చేసే ముందు జిమ్‌లో కోచ్‌ సలహాలు, సూచనలు తీసుకోవడం తప్పనిసరి.

ఇవీ కూడా చదవండి:

Blood Pressure: మీకు అధిక రక్తపోటు ఉందా..? ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే అదుపులో ఉంటుంది

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా.. కానీ స్వీట్లు చూసి ఆగలేకపోతున్నారా..! అయితే 4 ఆహారాలను ట్రై చేయండి..