Blood Pressure: మీకు అధిక రక్తపోటు ఉందా..? ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే అదుపులో ఉంటుంది

Blood Pressure: ప్రస్తుతం అధిక మంది బాధపడుతున్న సమస్యల్లో హైబీపీ ఒకటి. కనీసం 30 ఏళ్లు నిండని వారు కూడా ఈ హైబీపీ బారిన పడుతున్నారు. మారుతున్న జీవన శైలి, ఆనారోగ్య అలవాట్లు, మానసిక ఆందోళన..

Blood Pressure: మీకు అధిక రక్తపోటు ఉందా..? ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే అదుపులో ఉంటుంది
Follow us

|

Updated on: Sep 08, 2021 | 8:20 PM

Blood Pressure: ప్రస్తుతం అధిక మంది బాధపడుతున్న సమస్యల్లో హైబీపీ ఒకటి. కనీసం 30 ఏళ్లు నిండని వారు కూడా ఈ హైబీపీ బారిన పడుతున్నారు. మారుతున్న జీవన శైలి, ఆనారోగ్య అలవాట్లు, మానసిక ఆందోళన, అధిక ఒత్తిడిల కారణంగా ఈ అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. ఈ హైబీపీ కారణంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ బీపీ కారణంగా హృదయ సంబంధ రోగాలకు కూడా దారి తీస్తుంది. అందుకే, హైబీపీ రాకుండా అత్యంత జాగ్రత్త వహించాలంటున్నారు వైద్య నిపుణులు. మనం రోజూ తీసుకునే కొన్ని ఆహార పదార్థాలతో అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా బెర్రీలు, యాపిల్స్, బేరి, రెడ్ వైన్ వంటి ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉండే పండ్లు, పానీయాలతో సిస్టోలిక్ రక్తపోటు స్థాయి తగ్గించుకోవచ్చు. యాంటీ ఆక్సిడేటివ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మ్యూటాజెనిక్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు కలిగి ఉన్న ఫ్లేవనాయిడ్స్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పెరుగు:

పెరుగులో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం ఉండటం వల్ల ఇవి శరీరంలో ఫ్యాట్ తగ్గిస్తాయి. అలాగే రక్తపోటు అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. నిత్యం ఎవరైతే పెరుగు తప్పనిసరిగా తింటారో వారికి అధిక రక్తపోటు సమస్య ఉండదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

అరటి పండ్లు:

ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పొటాషియం సోడియం ప్రభావాలను తగ్గిస్తుంది. అలాగే రక్త నాళాల పొరలను ఉద్రిక్తతను తగ్గిస్తుంది.

చేపలు:

కొవ్వు చేలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కొవ్వులు రక్తపోటును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. వాపు, ఆక్సిలిపిన్స్, రక్తనాళాలు సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అలాగే తక్కువ రక్తపోటు స్థాయిలతో ఒమేగా 3 కొవ్వు ఆమ్లం అధికంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గుమ్మడి కాయ గింజలు:

గుమ్మడి కాయ గింజలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ గింజలలో పోషకాలు అనేకం ఉంటాయి. ఇది మెగ్నీషియం, పొటాషియం, అర్జినిన్ కలిగి ఉంటుంది. ఇవన్నీ రక్తపోటు తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గించడానికి రోజువారీ ఆహారంలో గుమ్మడికాయ గింజలు లేదా గుమ్మడికాయ నూనెను తీసుకోవడం ఉత్తమం.

యాపిల్స్ :

యాపిల్స్‌లో ఫ్లేవనాయిడ్స్ మూడు విభిన్న సబ్ క్లాస్ ఉన్నాయి. ఫ్లేవొనోల్స్, ఫ్లేవోన్స్, ఫ్లేవనోల్స్. ఇవి సహజ పదార్ధాలతో సమృద్ధిగా ఉండి రక్తపోటు నియంత్రణకు సహాయపడతాయి.

ఆరెంజ్‌:

100 గ్రాముల నారింజలో దాదాపు 19.6 మిల్లీగ్రాముల ఫ్లేవనాయిడ్‌ల ఆగ్లైకోన్‌లు ఉంటాయి. ఒక రోజులో తాజాగా పిండిన ఆరెంజ్ తీసుకోవడం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.

స్ట్రాబెర్రీలు:

బెర్రీలు కొన్ని రకాల ఫ్లేవనాయిడ్‌లకు గొప్ప మూలంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు తినడం ద్వారా ఆంథోసైనిన్, కాటెచిన్, క్వెర్సెటిన్, కెంఫ్‌ఫెరోల్ అనే ఫ్లేవనాయిడ్లు లభిస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా సహాయపడి.. అధిక రక్తపోటు నుంచి కాపాడేందుకు ఉపయోగపడతాయి.

ఉల్లిపాయలు:

ఉల్లిపాయల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్, ప్రధానంగా ఆంథోసైనిన్స్, క్వెర్సెటిన్ వంటి ఫ్లేవనోల్స్‌లను అధిక మోతాదులో ఉంటాయి. ఇవి ఆహారానికి రుచిని ఇవ్వడంతోపాటు రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

రెడ్ క్యాబేజీ:

రెడ్‌ క్యాబేజీలో సైనైడింగ్, ఫినోలిక్స్, ఫ్లేవనాయిడ్స్ ప్రధాన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లుగా ఉపయోగపడతాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తపోటుతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

బీన్స్, పప్పులు:

బీన్స్, పప్పులలో ఫైబర్, పోటాషియం, మెగ్నీషియం, ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ బీన్స్, పప్పులు తినడం వలన రక్తపోటును తగ్గిస్తాయని అధ్యాయనాల్లో తేలింది. 8 అధ్యయనాల సమీక్షలో బీన్స్, పప్పులు ఇతర ఆహారాల కోసం మార్పులు చేసినప్పుడు రక్తపోటుతో బాధపడుతున్న ప్రజలలో సిస్టోలిక్ రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుందని కనుగొన్నారు.

ఇవీ కూడా చదవండి:

Kidney Stones: కిడ్నీలలో రాళ్లు ఉన్నవారు ఈ 4 ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు..! ఎందుకంటే

Lockdown Effect: డయాబెటిస్‌ ముప్పును పెంచిన లాక్‌డౌన్‌.. తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తల వెల్లడి

Heart Diseases: వాటికి బదులు చేపలు తింటే ఎంతో మంచిది.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి..!

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!