Kidney Stones: కిడ్నీలలో రాళ్లు ఉన్నవారు ఈ 4 ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు..! ఎందుకంటే

Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉంటే ఆ నొప్పి భరించడం చాలా కష్టం. ఈ ఆధునిక యుగంలో వయసుతో పనిలేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్యతో

Kidney Stones: కిడ్నీలలో రాళ్లు ఉన్నవారు ఈ 4 ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు..! ఎందుకంటే
Kidney Stones
Follow us
uppula Raju

|

Updated on: Sep 08, 2021 | 9:55 AM

Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉంటే ఆ నొప్పి భరించడం చాలా కష్టం. ఈ ఆధునిక యుగంలో వయసుతో పనిలేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కిడ్నీ స్టోన్స్ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. పొత్తికడుపులో నిరంతర నొప్పి, పొత్తికడుపులో ఒక భాగంలో అకస్మాత్తుగా భరించలేని నొప్పి, మూత్ర విసర్జన చేసేటప్పుడు కొద్దిగా నొప్పి, తరచుగా మూత్ర విసర్జన, వికారం,బలహీనత, మైకం, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఈ 4 ఆహారాలను అస్సలు తినకూడదు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. ఉప్పు తగ్గించాలి కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఆహారంలో ఉప్పును తగ్గించాలి. జంక్ ఫుడ్ తినడం మానుకోండి. ఇది కాకుండా చైనీస్, మెక్సికన్ ఫుడ్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఆహారాల జోలికి పోకండి.

2. మాంసం తీసుకోవడం తగ్గించండి కిడ్నీ స్టోన్ రోగులు నాన్ వెజ్‌ ఆహారాలు తినడం మానుకోవాలి. నాన్-వెజ్ డైట్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నాన్-వెజిటేరియన్ డైట్‌లో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది ఇది స్టోన్ పరిమాణం పెరిగే అవకాశాలను పెంచుతుంది.

3. చాక్లెట్లు బంద్‌ కిడ్నీలో రాళ్లు ఉన్నవారు చాక్లెట్లు తినకూడదు. కొంతకాలం మానేయండి. చాక్లెట్‌లో ఆక్సలేట్ ఉంటుంది దీనివల్ల కిడ్నీ స్టోన్స్ పెరుగుతాయి. అందుకే వీటిని తినడం ప్రమాదం.

4. విటమిన్ సి కిడ్నీలో రాళ్లు ఉన్నవారు విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలను పరిమితం చేయాలి. విటమిన్ సి లో ఉండే ఆక్సలేట్ కాల్షియంను నిల్వ చేస్తుంది. అలాగే పాలకూర, తృణధాన్యాలు, చాక్లెట్, టమోటాలలో ఆక్సలేట్‌లో పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని తినడం మానుకోవాలి.

పరగడుపున కలబంద జ్యూస్‌ తాగితే ఎన్నో ప్రయోజనాలు..! ఈ 5 సమస్యలకు చక్కటి పరిష్కారం..

Satellite Internet: ఇకపై ఇంటర్నెట్ వేగం రాకెట్ స్పీడ్.. మారుమూల పల్లెల్లోనూ పరుగులు తీయనున్న నెట్ సేవలు.. ఎలా అంటే..

Bigg Boss 5 Telugu: ప్లీజ్‌ ట్రోల్స్‌ చేయండి.. ఫేక్ న్యూస్‌ రాయండి..Mr.షన్ను షాకింగ్‌ రిక్వెస్ట్..(వీడియో).