Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: ప్లీజ్‌ ట్రోల్స్‌ చేయండి.. ఫేక్ న్యూస్‌ రాయండి..Mr.షన్ను షాకింగ్‌ రిక్వెస్ట్..(వీడియో).

Bigg Boss 5 Telugu: ప్లీజ్‌ ట్రోల్స్‌ చేయండి.. ఫేక్ న్యూస్‌ రాయండి..Mr.షన్ను షాకింగ్‌ రిక్వెస్ట్..(వీడియో).

Anil kumar poka

|

Updated on: Sep 08, 2021 | 9:46 AM

షణ్ముఖ్ జశ్వంత్.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సాఫ్ట్‏వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‏తో పాపులర్ అయ్యాడు షణ్ముఖ్ జశ్వంత్. ఆ తర్వాత సూర్య వెబ్ సిరీస్‏తో ప్రేక్షకులను అలరించాడు మిస్టర్ షన్ను. అయితే షన్ను తాజాగా బిగ్‏బాస్ సీజన్ 5 లో ఎంట్రీ ఇచ్చారు. అలా ఎంట్రీ ఇచ్చారో లేదో...

షణ్ముఖ్ జశ్వంత్.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సాఫ్ట్‏వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‏తో పాపులర్ అయ్యాడు షణ్ముఖ్ జశ్వంత్. ఆ తర్వాత సూర్య వెబ్ సిరీస్‏తో ప్రేక్షకులను అలరించాడు మిస్టర్ షన్ను. అయితే షన్ను తాజాగా బిగ్‏బాస్ సీజన్ 5 లో ఎంట్రీ ఇచ్చారు. అలా ఎంట్రీ ఇచ్చారో లేదో… అప్పుడే ఓ వీడియోతో నెట్టింట వైరల్ అవుతున్నాడు.

బిగ్‏బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ పాల్గొంటున్నట్లుగా గత కొద్ది రోజుల నుంచే వార్తలు వచ్చాయి. ఇక అంతా అనుకున్నట్టుగానే షన్ను బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు షన్నూకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో చూస్తుంటే.. అతను క్యారంటైన్‏లో ఉన్నప్పుడు చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.

‘ఈ వీడియో మీరు చూసే సమయానికి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఓ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను అని. మీ సపోర్ట్, మీ ఓపిక కూడా కోరుకుంటున్నాను. నా గురించి నాకే సరిగ్గా తెలియదు.. అది తెలుసుకోవడానికే వెళ్తున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు .. చాలా తక్కువ మంది సపోర్ట్ చేశారు. అది గుర్తుపెట్టుకుని నా మీద ట్రోల్స్ కానీ ఫేక్ న్యూస్ గానీ వేయండి. నా వీడియోలు బాగా లేకపోతే కామెంట్ చేశారు.. అది చూసి నేను ఇంకా నేర్చుకున్నాను. ఎక్కువగా జడ్జ్ చేయకుండా నార్మల్‌గా చూస్తారని అనుకుంటున్నాను. నేను పెద్ద సెలెబ్రిటీని కాదు.. అస్సలు కాదు.. నాకు అంత లేదు.. ఈ జర్నీలో పార్ట్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.. బయటకు వచ్చాక అందరితో మాట్లాడాతను.. ఐ లవ్యూ ఆల్” అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు ఈ స్టార్ యూట్యూబర్‌.
మరిన్ని ఇక్కడ చూడండి: Himachal Pradesh video: కొండ చరియలు విరిగి పడటం ఎప్పుడైనా చూసారా..? ప్రత్యక్ష వీడియో వైరల్..

John Cena to Sidharth Shukla: సిద్ధార్థకు స్టార్‌ రెజ్లర్‌ సైతం సానుభూతి.. ఇంటర్నేషనల్ స్టార్ ‘జాన్ సెనా’ నివాళి..!(వీడియో).

Sidharth Shukla Death Mystery: నమ్మలేని నిజం..! సిద్ధార్థ్‌ డెత్‌ మిస్టరీ.. అసులు విషయం బట్టబయలు..(వీడియో).

Triangle Love Story: వాట్ ఏ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. లాటరీ పద్ధతిలో పెళ్లి వైరల్ అవుతున్న వీడియో..