Sidharth Shukla Death Mystery: నమ్మలేని నిజం..! సిద్ధార్థ్ డెత్ మిస్టరీ.. అసులు విషయం బట్టబయలు..(వీడియో).
హిందీ బిగ్‌బాస్ 13 విన్నర్, నటుడు సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మరణం బాలీవుడ్‌ను విషాదంలోకి నెట్టింది. ఆయన ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరం అయిపోవడాన్ని సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 40 ఏళ్ల వయసులో అంత ఫిట్‌గా ఉన్న వ్యక్తి గుండెపోటుతో మరణించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు....
హిందీ బిగ్‌బాస్ 13 విన్నర్, నటుడు సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మరణం బాలీవుడ్‌ను విషాదంలోకి నెట్టింది. ఆయన ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరం అయిపోవడాన్ని సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 40 ఏళ్ల వయసులో అంత ఫిట్‌గా ఉన్న వ్యక్తి గుండెపోటుతో మరణించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్నారు.. కూపర్ హాస్పిటల్ సిబ్బంది.
మొదట పంచనామా నిర్వహించిన వైద్యలు ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని కార్డియాక్ అరెస్ట్ తోనే సిద్ధార్థ్ మరణించినట్లు ప్రకటించారు. కాని సిద్ధార్థ మరణంపై బయట వెళ్లువెత్తున్న నిరసనలతో మరో సారి ఈ హీరో డెత్ మిస్టరీ పై ఫోకస్ పెట్టారు వైద్యులు. మరి, సిద్ధార్థ్ శుక్లా డెత్ మిస్టరీ గుట్టు వీడేదెలా? మరో మార్గం లేదా అంటే… అందుకు కూడా ఓ మార్గం వుందంటున్నారు వీరు.హిస్టోపథాలజీతో గుట్టు విప్పొచ్చంటున్నారు. ఇంతకీ, హిస్టోపథాలజీ అంటే ఏమిటి? ఇదొక కెమికల్ అనాలసిస్. కీలక ఆర్గాన్స్ ను కెమికల్ అనాలసిస్ చేస్తే సిద్ధార్థ్ డెత్ మిస్టరీ వీడిపోనుంది. అందుకే, సిద్ధార్థ్ శుక్లా ఆర్గాన్స్ ను కెమికల్స్ లో భద్రత పర్చినట్లు కూపర్ హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి. మరి ఈ టెస్ట్ తోనైనా… అసలు నిజం తెలుస్తుందో లేదో చూడాలి మరి!
మరిన్ని ఇక్కడ చూడండి: Triangle Love Story: వాట్ ఏ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. లాటరీ పద్ధతిలో పెళ్లి వైరల్ అవుతున్న వీడియో..
గుంతల రోడ్డుపై క్యాట్ వాక్..! వైరల్‌గా మారిన వీడియో..: Cat walk on pothole road video
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

