Online Marriage Viral Video: అమెరికా పెళ్లికి..ఆంధ్రాలో ఆశీస్సులు.. ట్రేండింగ్ లో ఆన్లైన్ పెళ్లిళ్లు వీడియో వైరల్..
ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే.. ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంత పీట వేసి.. అంటూ వర్ణించేవారు. పెళ్లిని ఎంత అట్టహాసంగా, వైభవంగా జరపాలో చెప్పడమే ఈ వర్ణన ఉద్దేశం. కానీ కరోనా పుణ్యమా అని.. కేవలం తల్లిదండ్రులు, అత్యంత ఆత్మీయుల సమక్షంలోనే బోలెడంత మంది పెళ్లిళ్లు చేసుకున్నారు.
ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే.. ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంత పీట వేసి.. అంటూ వర్ణించేవారు. పెళ్లిని ఎంత అట్టహాసంగా, వైభవంగా జరపాలో చెప్పడమే ఈ వర్ణన ఉద్దేశం. కానీ కరోనా పుణ్యమా అని.. కేవలం తల్లిదండ్రులు, అత్యంత ఆత్మీయుల సమక్షంలోనే బోలెడంత మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. చివరకు వధూవరులు ఇద్దరే పెళ్లి చేసుకున్న సందర్భాలూ లేకపోలేదు. కానీ మీరు ఇప్పుడు చూస్తున్నది ఆ వివాహాలన్నింటికెల్లా భిన్నమైన వర్చువల్ మ్యారేజ్. సప్తసముద్రల అవతల వివాహ వేదిక..బంధుమిత్రులందరూ ఆంధ్రలో..
గుంటూరు జిల్లా వినుకొండ కు చెందిన వరుడు ఒంగోలు కు చెందిన వధువు వృత్తి రీత్యా అమెరికాలో నివాసం ఉంటున్నారు. వారి వివాహం అమెరికాలో జరగ్గా కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆంధ్రా నుంచి ఆశీస్సులు అందించారు. ఊరంతా వీరి పెళ్లి పోస్టర్లను కూడా అంటించి ఇళ్లంతా బంధువులు, చుట్టాలతో పెళ్లి సందడంతా అట్టహాసంగా జరిపించారు. గుంటూరు జిల్లా వినుకొండ కు చెందిన గ్రీష్మంత్ కు ప్రకాశం జిల్లా ఒంగోలు కు చెందిన అనుజ్ఞ కు వివాహం నిశ్చయించారు.. రెండేళ్ల క్రితమే..వీరికి నిశ్చితార్థం కూడా జరిపించారు. అయితే వారిరువురు వృత్తి రీత్యా అమెరికా లో ఉంటున్నారు. వివాహం చేసుకోవాలని రెండు సంవత్సరాలనుంచి చూస్తున్నా,… కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేశారు.
థర్డ్ వేవ్ కరోనా నేపథ్యంలో అమెరికా లోని డల్లాస్ లో జరుగుతున్న వివాహనికి హజరు కాలేని కుటుంబ సభ్యులు, బంధువులు విన్నూత తరహాలో పెళ్లి వేడుకలను తిలకించేందుకు పట్టణంలోని జయకృష్ణ అపార్ట్ మెంట్ లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి వివాహ వేడుకలు తిలకించి నూతన వధూవరులకు ఆశీస్సులు అందజేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Nipah Virus Vs Coronavirus Video: క్లిష్ట పరిస్థితుల్లో దేశం.. కరోనాకు నిఫాతోడు.. ముంచుకొస్తున్న ముప్పు లైవ్ వీడియో..
BCCI shock to indian team: అంతా సేఫేనా..?ఆట ప్రారంభానికి ముందు.. టీమిండియాకు భారీ షాక్.. (వీడియో ).
Leopard Caught Deer: చిరుత వేగాన్ని పట్టుకోగలమా..? క్షణంలో జింకను పట్టేసిన చిరుత.. వీడియో చూస్తే..!