Thieves Viral Video: గన్స్‌తో షాపులోకి దొంగలు ఎంట్రీ..!కట్ చేస్తే సీన్ అదుర్స్.. వైరల్ అవుతున్న వీడియో..
దేశ రాజధాని ఢిల్లీలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు తుపాకీలతో షాపులోకి ప్రవేశించిన దొంగలు.. యజమానిని బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ షాకింగ్ సంఘటన ఢిల్లీలోని ఖేరా ఖుర్ద్ హౌస్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ఖేరా ఖుర్ద్ హౌస్ ప్రాంతంలో ఓ హర్డ్‌వేర్ దుకాణంలోకి ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి తుపాకీలతో కొచ్చారు. ఇద్దరు హెల్మెట్లను ధరించి రాగా.. మరొకరు ముఖానికి కర్చిఫ్ కట్టుకుని వచ్చారు. ఈ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాక దుకాణ యజమాని బిక్కుబిక్కుమంటూ నిల్చుండిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుండగులు దుకాణంలోకి ప్రవేశించి, షాపులో ఉన్న ఓ వ్యక్తిని బయటకు పంపించేశారు. అనంతరం నగదు కౌంటర్ వద్ద ఉన్న యజమానికి గన్ షాట్ పెట్టి పక్కకు నెట్టారు. ఆ తర్వాత కౌంటర్ తెరచి నగదు తీసుకుని, అక్కడి నుంచి జంప్ అయ్యారు. ఈ రోబరీకి సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Malladi Vishnu on BJP: బీజేపీపై మల్లాది విసుర్లు.. మామూలుగా లేవుగా..!వీడియో వైరల్..
Nipah Virus Video: శరవేగంగా నిఫా.. కేరళలో నిఫా వైరస్ కలకలం.. 12 ఏళ్ల బాలుడు మృతి!(వీడియో)
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

