Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nipah Virus Video: శరవేగంగా నిఫా.. కేరళలో నిఫా వైరస్ కలకలం.. 12 ఏళ్ల బాలుడు మృతి!(వీడియో)

Nipah Virus Video: శరవేగంగా నిఫా.. కేరళలో నిఫా వైరస్ కలకలం.. 12 ఏళ్ల బాలుడు మృతి!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Sep 07, 2021 | 9:59 AM

కేరళలో ఓ వైపు కరోనావైరస్ కేసులు పెరుగుతుండగా .. మరోవైపు నిఫా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. తాజాగా కోళికోడ్ జిల్లాలో నిఫా వైరస్‌ బారిన పడి 12 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ప్రకటించారు.

కేరళలో ఓ వైపు కరోనావైరస్ కేసులు విజృంభిస్తుండగా .. మరోవైపు నిఫా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. తాజాగా కోళికోడ్ జిల్లాలో నిఫా వైరస్‌ బారిన పడి 12 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ప్రకటించారు. నిఫాతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయాడు.బాలుడి నమూనాలను ముందే పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కి పంపగా నిఫా వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. అయితే.. బాలుడితో కాంటాక్ట్‌ ఉన్న వారందరినీ గుర్తించే ప్రక్రియను గత రాత్రే ప్రారంభించారు. వారందరినీ ఐసోలేషన్‌లోకి పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అధికారులు. 30 మందిని ఇప్పటివరకు అబ్జర్వేషన్‌లో ఉంచారు.

ఇదిలాఉంటే.. నిఫా వైరస్‌ కలకలంతో కేంద్ర ప్రభుత్వంఅప్రమత్తమైంది. కేరళ ఆరోగ్య శాఖకు సహకారంగా కేంద్రం తరఫున ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపింది. కాగా.. కేరళలో 2018 జూన్‌లో తొలిసారిగా నిఫా వైరస్‌ వెలుగులోకి వచ్చింది. మొత్తం 23 కేసులను నిర్ధారించారు. వీరిలో కేవలం ఇద్దరు మాత్రమే కోలుకున్నారు. 
మరిన్ని ఇక్కడ చూడండి: ఎలక్ట్రికల్ రంగంలో అద్భుతం.. 200 మైళ్ల వేగంతో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ..!(వీడియో): Electric Air Taxi Video.

Mani Ratnam: మణిరత్నంకు గుర్రం తెచ్చిన కష్టాలు..! గుర్రాన్ని చంపాడు.. బుకాయించబోయి పట్టుబడ్డాడు(వీడియో)

ఆ స్టార్‌ హీరోకు నో చెప్పిన తమన్‌..! అసలు మేటర్ ఏంటంటే(వీడియో): Music Director Thaman Video.

భారత్ లో అనూహ్యంగా పెరుగుతున్న కిడ్నీ సమస్య..! సమస్యను గుర్తించడం ఎలా..?(వీడియో): Kidney Problem

Published on: Sep 07, 2021 09:58 AM