ఆ స్టార్‌ హీరోకు నో చెప్పిన తమన్‌..! అసలు మేటర్ ఏంటంటే(వీడియో): Music Director Thaman Video.

బ్యాగ్‌ రౌండ్ మ్యూజిక్‌తో టాలీవుడ్ స్టార్స్‌కు ఏ రేజంలో హైప్‌ క్రియేట్ చేస్తున్న తమన్.. తాజాగా ఓ యంగ్ స్టార్‌ హీరోకు నో చెప్పారట. నేను ఫుల్ బిజీ సారీ అంటూ.. సైడ్ అయిపోయారంట. ఇంతకీ ఆ స్టార్‌ హీరో ఎవరాని ఆలోచిస్తున్నారా... అయితే ఈ స్టోరీ చూడండి..!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో తమన్ ఒకరు. తక్కువ సమయంలోనే ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న తమన్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని సినిమాకు నో చెప్పారట. ముందు కమిట్ అయినప్పటికీ డేట్స్ అడ్జెస్ట్ కాకవడంతో సినిమా నుంచి తప్పుకున్నారట.అక్కినేని అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘ఎంజెంట్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పై థ్రిల్లర్‌గా రానుందట. అలాగే ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారు అఖిల్. అయితే ఈ సినిమానుంచి తమన్ తప్పుకున్నాడని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్లే ఈ మూవీని వదులుకున్నారట తమన్.

తమన్‌ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో.. ఈ మూవీ టీం ‘హిప్ హాప్ తమిజా’ను ఫైనల్ చేశారట. ఫైనల్ చేయడమే కాదు.. అప్పుడే మ్యూజిక్ సిట్టింగ్స్‌ కూడా చేపిస్తున్నారట. ఇక గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ధృవ సినిమాకు హిప్ హాప్ తమిజా సంగీతం అందించిన విషయం తెలిసిందే.


మరిన్ని ఇక్కడ చూడండి: భారత్ లో అనూహ్యంగా పెరుగుతున్న కిడ్నీ సమస్య..! సమస్యను గుర్తించడం ఎలా..?(వీడియో): Kidney Problem

 Minister Bit Ribbon Video:షాపు ఓపెనింగ్‌కు వచ్చి.. రిబ్బన్‌ కొరికి పారేసిన మంత్రి..!వైరల్ అవుతున్న వీడియో.

News Watch: ముసురు వీడలేదు | కేసీఆర్ ఢిల్లీ టూర్ సక్సెస్ | టీమిండియా గొప్ప విజయం.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

Heavy Rains Updates Video: భారీ నుండి అతి భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. లైవ్ వీడియో.

Click on your DTH Provider to Add TV9 Telugu