AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Bit Ribbon Video:షాపు ఓపెనింగ్‌కు వచ్చి.. రిబ్బన్‌ కొరికి పారేసిన మంత్రి..!వైరల్ అవుతున్న వీడియో.

Minister Bit Ribbon Video:షాపు ఓపెనింగ్‌కు వచ్చి.. రిబ్బన్‌ కొరికి పారేసిన మంత్రి..!వైరల్ అవుతున్న వీడియో.

Anil kumar poka
|

Updated on: Sep 07, 2021 | 9:19 AM

Share

ఓ కొత్త షాపు ప్రారంభోత్సవానికి వెళ్లిన మంత్రిగారికి కోపం వచ్చింది. దాంతో రిబ్బన్‌ కట్‌ చేయకుండా పళ్లతో కొరికి పారేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రిగారి తీరుపై నెజన్లు సెటైర్లు మీద సెటైర్లు వేస్తున్నారు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జరిగింది ఈ సంఘటన.

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో కొత్త‌గా నిర్మించిన ఓ దుకాణాన్ని ప్రారంభించడానికి పాక్ మంత్రి ఫయాజ్ ఉల్ హసన్ చౌహాన్ వెళ్లారు. దుకాణ ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద మంత్రి గారు కట్‌ చేయడానికి రిబ్బన్‌ కూడా ఏర్పాటు చేశారు. అంతా బాగానే ఉంది. మంత్రిగారు షాపు ఓపెనింగ్‌కు రెడీ అయ్యారు. రిబ్బన్‌ కట్‌ చేయడానికి కత్తెర తీసుకొని అతిథుల చప్పట్ల మధ్య రిబ్బన్‌ కట్‌చేసారు. అయితే, ఆ క‌త్తెర‌కు పదును లేకపోవడంతో ఎంత‌ ట్రై చేసినా అది క‌ట్ కాలేదు. దీంతో ఆ మంత్రికి చిర్రెత్తుకొచ్చింది. షాపు యజమానిని తిట్టుకుంటూ ప‌ళ్ల‌తోనే రిబ్బ‌న్ ను పరపరా క‌ట్ చేసిపారేశారు. అది చూసి, అక్క‌డున్న వారు మాత్రం న‌వ్వు ఆపుకోలేక‌పోయారు. మరోపక్క, ఆయ‌న తీరుపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పడు ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఆ మధ్య తెలంగాణలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు ప్రారంభోత్సవానికి వెళ్లి… రిబ్బన్‌ కట్‌ కాకపోవడంతో రిబ్బన్‌ చేత్తో పీకి అవతల పారేశారు. ఈ మధ్య తరచూ కత్తెరలు ఇలా మొరాయిస్తుండటంతో పాపం.. మంత్రులు చేతులకు, పళ్లకు పని చెప్పాల్సి వస్తోంది. 
మరిన్ని ఇక్కడ చూడండి: News Watch: ముసురు వీడలేదు | కేసీఆర్ ఢిల్లీ టూర్ సక్సెస్ | టీమిండియా గొప్ప విజయం.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

Heavy Rains Updates Video: భారీ నుండి అతి భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. లైవ్ వీడియో.

Nirmal: వరదలో అంతిమ యాత్ర.. ఆఖరి మజిలీకి తిప్పలు… వీడియో వైరల్..

Wipes Shoes Video: భక్తుల బూట్లు తుడిచిన మాజీ సీఎం..! వైరల్ అవుతున్న వీడియో..