భారత్ లో అనూహ్యంగా పెరుగుతున్న కిడ్నీ సమస్య..! సమస్యను గుర్తించడం ఎలా..?(వీడియో): Kidney Problem

భారత్ లో అనూహ్యంగా పెరుగుతున్న కిడ్నీ సమస్య..! సమస్యను గుర్తించడం ఎలా..?(వీడియో): Kidney Problem

Anil kumar poka

|

Updated on: Sep 07, 2021 | 9:31 AM

ప్రస్తుత పరిస్థితుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తినే ఆహారం, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల మానవుడు రోగాల బారిన పడుతున్నాడు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా కిడ్నీ సమస్య.

ప్రస్తుత పరిస్థితుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తినే ఆహారం, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల మానవుడు రోగాల బారిన పడుతున్నాడు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా కిడ్నీ సమస్య. ఇండియాలో ప్రతి సంవత్సరంలో రెండున్నర లక్షల మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ప్రతి ఏటా మూడున్నరకోట్ల మందికి డయాలసిస్‌ చేయాల్సి వస్తోందని తెలుస్తోంది.

భారతదేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ‘ది లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌’ నివేదిక ప్రకారం.. మన దేశ జనాభాలో 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారని తెలుస్తోంది. వీటన్నింటికి కారణం మనం కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోకపోవడమే అంటున్నారు. మహిళలైతే పని ధ్యాసలో పడి కిడ్నీల విషయాన్ని మర్చిపోతున్నారు. జీర్ణ వ్యవస్థ నుంచి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్‌ స్థాయిలను నియంత్రిస్తాయి. ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎములకు భరోసా ఇస్తాయి. ఇంతటి కీలకమైన కిడ్నీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కిడ్నీ సమస్యను గుర్తించడానికి కొన్ని లక్షణాలు సూచిస్తున్నారు నిపుణులు. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా, కాళ్లవాపు బాగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లే గుర్తించాలని చెబుతున్నారు. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం రావడం, వాంతులు చేసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. కిడ్నీల పనితీరు తగ్గితే ఎర్రరక్తకణాల ఉత్పత్తి మీద ఎఫెక్ట్‌ పడుతుంది. అలసట, మెదడు సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని వెల్లడిస్తున్నారు. కిడ్నీలు ఉండే భాగంలో నొప్పి రావడం, కిడ్నీలో ఇన్‌ఫెక్షన్లు, రాళ్లకు కూడా కారణమవుతుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూడా చల్లగా ఉన్న ఫీలింగ్‌ ఉంటుంది. ఇది కిడ్నీలు సరిగా పని చేయడం లేదనడానికి సంకేతంగా భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.


మరిన్ని ఇక్కడ చూడండి:  Minister Bit Ribbon Video:షాపు ఓపెనింగ్‌కు వచ్చి.. రిబ్బన్‌ కొరికి పారేసిన మంత్రి..!వైరల్ అవుతున్న వీడియో.

News Watch: ముసురు వీడలేదు | కేసీఆర్ ఢిల్లీ టూర్ సక్సెస్ | టీమిండియా గొప్ప విజయం.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

Heavy Rains Updates Video: భారీ నుండి అతి భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. లైవ్ వీడియో.

Nirmal: వరదలో అంతిమ యాత్ర.. ఆఖరి మజిలీకి తిప్పలు… వీడియో వైరల్..