Mani Ratnam: మణిరత్నంకు గుర్రం తెచ్చిన కష్టాలు..! గుర్రాన్ని చంపాడు.. బుకాయించబోయి పట్టుబడ్డాడు(వీడియో)
పొన్నియిన్ సెల్వన్ సినిమాతో వండర్స్ ఏమోగాని.. చిక్కుల్లో మాత్రం పడేలా ఉన్నారు స్టార్ డైరెక్టర్ మణిరత్నం. తన టేకింగ్తో.. విజన్‌తో సినిమాకు ఓ యూనిక్ టచ్ ఇచ్చే రత్నం.. అనుకోకుండా ఓ గుర్రం కారణంగా చిక్కుల్లో పడ్డారు. చిక్కుల్లో పడడమే కాదు ఏకంగా జైలుకు ఊచలు లెక్కబెట్టే వరకు వెళ్లేలా ఉన్నారు.
సినిమా షూటింగ్‌ల సమయంలో మూగజీవాలను వాడితే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. జంతువులకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేకర్స్‌పైనే ఉంటుంది. అందుకే చాలా వరకు జంతువుల సన్నివేశాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే తాజాగా మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న పొన్నియిన్ సెల్వన్ సెట్‌లో ఓ గుర్రం మరణించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో జరుగుతోంది. ఈ సినిమాలో వచ్చే భారీ యుద్ధ సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ నగరానికి చెంది 50 గుర్రాలను ఉపయోగించుకుంటోంది. ఈ క్రమంలోనే గత నెల 11వ తేదీని ఓ గుర్రం డీహైడ్రేషన్ కారణంగా షూటింగ్ స్పాట్‌లోనే మరణించింది.
దీంతో చిత్ర యూనిట్ చేసేదేంలేక గుంత తీసి గుర్రాన్ని పూడ్చేసింది. అయితే షూటింగ్‌లో పాల్గొన్న కొందరు ఈ విషయాన్ని ‘పెటా’ ప్రతినిధులకు తెలిపారు. దీంతో పెటా సభ్యులు గత నెల 18న అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్‌కు వెళ్లి పిటిషన్ ఇచ్చారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ హౌజ్ పై, గుర్రం యజమానిపై సెక్షన్ 429, సెక్షన్ 11 pca యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఆ స్టార్ హీరోకు నో చెప్పిన తమన్..! అసలు మేటర్ ఏంటంటే(వీడియో): Music Director Thaman Video.
భారత్ లో అనూహ్యంగా పెరుగుతున్న కిడ్నీ సమస్య..! సమస్యను గుర్తించడం ఎలా..?(వీడియో): Kidney Problem