AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరగడుపున కలబంద జ్యూస్‌ తాగితే ఎన్నో ప్రయోజనాలు..! ఈ 5 సమస్యలకు చక్కటి పరిష్కారం..

Aloe Vera Juice Benefits: కలబంద ఎన్నో ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం. ఔష‌ధాల తయారీలో కూడా వాడుతారు. కాలిన గాయాలకు కలబందను ఉపయోగిస్తారు.

పరగడుపున కలబంద జ్యూస్‌ తాగితే ఎన్నో ప్రయోజనాలు..! ఈ 5 సమస్యలకు చక్కటి పరిష్కారం..
Aloe Vera Juice
uppula Raju
|

Updated on: Sep 08, 2021 | 9:52 AM

Share

Aloe Vera Juice Benefits: కలబంద ఎన్నో ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం. ఔష‌ధాల తయారీలో కూడా వాడుతారు. కాలిన గాయాలకు కలబందను ఉపయోగిస్తారు. సనాతన ఆయుర్వేదంలో కలబందను ప్రాచీన కాలంనుంచి ఉపయోగిస్తున్నారు. అయితే పరగడుపున ఒక గ్లాస్‌ కలబంద జ్యూస్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 5 సమస్యలకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.

1.తలనొప్పి: ఆధునిక యుగంలో చాలామంది తలనొప్పితో బాధపడుతున్నారు. వీరికి కలబంద రసం దివ్య ఔషధం. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కలబంద రసం తాగితే చాలా రకాల తలనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. మలబద్దకం: కడుపు శుభ్రంగా లేకపోతే శరీరం అనేక సమస్యలకు గురికావల్సి ఉంటుంది. మీరు పరగడుపున కలబంద జ్యూస్‌ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

3. టాక్సిన్ల తొలగింపు: కలబంద రసం శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. ఆరోగ్య సమస్యలు కలిగించే అనేక విషపూరిత పదార్థాలు శరీరంలో ఉంటాయి. కలబంద రసం తీసుకోవడం వల్ల ఇవి తొలగిపోతాయి. దీనివల్ల ఆస్పత్రికి వెళ్లే అవసరం ఉండదు.

4. షుగ‌ర్ వ్యాధి గ్రస్థలు: షుగ‌ర్ వ్యాధి గ్రస్తుల‌కు క‌ల‌బంద రసం దివ్యౌష‌ధంలా ప‌ని చేస్తుంది. దీనివ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. దంతాలు, చిగుళ్ల స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్న వారు క‌ల‌బంద‌ను నిత్యం తీసుకుంటే మంచి ఫలితం ల‌భిస్తుంది.

5. కీళ్ల సమస్యలు: క‌ల‌బంద రసం తాగితే కీళ్లు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పలు త‌గ్గుతాయి. శ‌రీరానికి కావాల్సిన విట‌మిన్లు పుష్కలంగా ల‌భిస్తాయి.

6. ఇంకా క‌ల‌బంద గాయ‌లు, పుండ్లను త‌గ్గించ‌డంలోనూ కీల‌క పాత్ర పోషిస్తాయి. గుజ్జును గాయాలపై రాస్తే త్వర‌గా తగ్గుతాయి. త‌ర‌చూ విరేచ‌నాల సమ‌స్యతో బాధ‌డేవారు క్రమం త‌ప్పకుండా క‌ల‌బంద గుజ్జును తీసుకుంట‌నే మంచి ఫ‌లితం ల‌భిస్తుంది.

Satellite Internet: ఇకపై ఇంటర్నెట్ వేగం రాకెట్ స్పీడ్.. మారుమూల పల్లెల్లోనూ పరుగులు తీయనున్న నెట్ సేవలు.. ఎలా అంటే..

Mahesh Babu: త్రివిక్రమ్ సినిమాకోసం మహేష్ మాస్టర్ ప్లాన్.. మూవీ మొదలైయేది అప్పుడేనా. .?

Himachal Pradesh video: కొండ చరియలు విరిగి పడటం ఎప్పుడైనా చూసారా..? ప్రత్యక్ష వీడియో వైరల్..