Mahesh Babu: త్రివిక్రమ్ సినిమాకోసం మహేష్ మాస్టర్ ప్లాన్.. మూవీ మొదలైయేది అప్పుడేనా. .?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా కీర్తిసురేష్ నటిస్తుంది

Mahesh Babu: త్రివిక్రమ్ సినిమాకోసం మహేష్ మాస్టర్ ప్లాన్.. మూవీ మొదలైయేది అప్పుడేనా. .?
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 08, 2021 | 9:43 AM

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా కీర్తిసురేష్ నటిస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మునపటి సినిమాలతో పోల్చుకుంటే మహేష్ ఈ మూవీలో మరింత స్టైలిష్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రీలుక్ సినిమా పై అంచనాలు పెంచేస్తే.. ఇటీవల మహేష్ బర్త్ డేకు వచ్చిన బ్లాక్ బస్టర్ టీజర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ప్రస్తుతం గోవా షడ్యూల్‌ను పూర్తి చేసుకున్న టీమ్ ఇటీవలే హైదరాబాద్‌కు చేరుకుందని తెలుస్తుంది. ఇక హైదరాబాద్‌లో నాన్ స్టాప్‌గా షూటింగ్ జరపాలని చూస్తున్నారు చిత్రయూనిట్. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని టాక్ మొదటి నుంచి వినిపిస్తుంది. సర్కారు వారి పాటలో హై యాక్షన్ ఎపిసోడ్స్‌తోపాటు అదిరిపోయే కామెడీ కూడా ఉండనుందని తెలుస్తుంది.

ఈ సినిమా తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్‌‌తో ముచ్చట మూడో సినిమా చేస్తున్నాడు గురూజీ. ఈ సినిమా గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలంటే డిఫరెంట్‌గా ఉండనుందని తెలుస్తుంది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానుందని టాక్. ఇక ఈ సినిమా విషయంలో మహేష్ చాలా ప్లాన్డ్‌గా ఉన్నాడట. ముందుగా సర్కారు వారి పాట సినిమా షూటింగ్ చేస్తూనే త్రివిక్రమ్ సినిమాను డా మొదలుపెట్టాలని అనుకున్నారట. అయితే ఇప్పటికే సర్కారువారి పాట సినిమా ఆలస్యం అవడంతో.. మహేష్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని తెలుస్తుంది. ముందు శరవేగంగా సర్కారు వారిపాట సినిమాను పూర్తి చేసి.. ఆతర్వాత త్రివిక్రమ్ సినిమా పైన ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాడట. గురూజీతో చేయనున్న సినిమాను దసరా పండుగ రోజున లాంఛనంగా ప్రారంభించి.. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా పూజాహెగ్డే, నభా నటేష్ నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral video : పిల్లను కాపాడుకోవడానికి తల్లి కుక్క తాపత్రయం.. మనసుకు హత్తుకుంటున్న వీడియో

Ichata Vahanamulu Niluparadu: ఆహాలో మరో హిట్ మూవీ.. ఇచ్చట వాహనములు నిలుపరాదు విడుదల ఎప్పుడంటే..

Tollywood Drug Case: టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న డ్రగ్స్.. సెలబ్రిటీలకు ఈడీ వేడి.. ఈరోజు ఈడీ ముందుకు రానా దగ్గుబాటి.. ముమైత్ ఖాన్..

Bigg Boss 5 Telugu: సీన్ రివర్స్.. బోరు బోరున ఏడ్చేస్తున్న అబ్బాయిలు.. తట్టుకోలేకపోయానంటున్న ఆ కంటెస్టెంట్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!