RC 15 : రామ్ చరణ్- శంకర్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.. అదేంటంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే జక్కన ప్రాస్టిజియస్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్‌ను పూర్తి చేసి రిలాక్స్ అవుతున్నాడు.

RC 15 : రామ్ చరణ్- శంకర్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.. అదేంటంటే..
Ram Charan
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 08, 2021 | 11:43 AM

RC 15 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే జక్కన ప్రాస్టిజియస్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్‌ను పూర్తి చేసి రిలాక్స్ అవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. చరణ్-తారక్‌లకు సంబందించిన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసి.. మిగిలిన గ్రాఫిక్స్, వీఎఫ్స్ పనులు చూసుకుంటున్నాడు రాజమౌళి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు తమ నెక్స్ట్ సినిమాలపైన ఫోకస్ పెడుతున్నారు. చరణ్ టాప్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేస్తుంటే.. తారక్ కొరటాలతో సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో శంకర్ చరణ్ కోసం ఓ సాలిడ్ స్టోరీ రెడీ చేసి పెట్టుకున్నాడట. ఇప్పటికే ఈ సినిమా పనులను మొదలు కూడా పెట్టేశాడు శంకర్. సినిమా కోసం లొకేషన్లను కూడా వెతికేశాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్‌లతోపాటు మరికొంతమంది నటులను కూడా సెలక్ట్ చేసుకొని సిద్ధంగా ఉన్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మేము సిద్ధంగా ఉన్నాం.. వచేస్తున్నాం అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో సినిమా టీమ్ అంతా బ్లాక్ సూట్‌లు ధరించి చేతిలో ఫైల్స్ , బ్యాగ్‌లతో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్లో సినిమాలో నటించే నటీనటులతోపాటు దర్శకుడు శంకర్ అలాగే నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ అంజలి, సునీల్, జై రామ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారని పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది. చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుంది. ఈ సినిమా చరణ్‌కు 15వ మూవీ కాగా దిల్ రాజు బ్యానర్‌కు 50 సినిమా కావడం విశేషం. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

Charan

మరిన్ని ఇక్కడ చదవండి : 

Virata Parvam: రానా సినిమాలపై వీడని సందేహాలు.. విరాటపర్వం కూడా అదే దారిలోనా ?..

Mahesh Babu: త్రివిక్రమ్ సినిమాకోసం మహేష్ మాస్టర్ ప్లాన్.. మూవీ మొదలైయేది అప్పుడేనా. .?

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ఇంట్లో రచ్చ.. గొడవలే గొడవలు.. ఎటాక్ చేస్తే ఒప్పుకొనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆ బ్యూటీ..