Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ఇంట్లో రచ్చ.. గొడవలే గొడవలు.. ఎటాక్ చేస్తే ఒప్పుకొనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆ బ్యూటీ..

బిగ్‏బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్‏లో అతి కొద్ది మంది మాత్రమే జనాలకు తెలిసిన ముఖాలు ఉన్నాయి. దాదాపు ఎక్కువ మంది తెలియిని వారు మాత్రమే ఉన్నారు.

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ఇంట్లో రచ్చ.. గొడవలే గొడవలు.. ఎటాక్ చేస్తే ఒప్పుకొనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆ బ్యూటీ..
Bigg Bosss
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Sep 12, 2021 | 5:02 PM

బిగ్‏బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్‏లో అతి కొద్ది మంది మాత్రమే జనాలకు తెలిసిన ముఖాలు ఉన్నాయి. దాదాపు ఎక్కువ మంది తెలియిని వారు మాత్రమే ఉన్నారు. మొదటి రోజు.. పరిచయాల కార్యక్రమం.. రెండవ రోజు నామినేషన్స్ కార్యక్రమం.. ఇలా కంటిన్యూస్‏గా రెండు రోజులు మాములుగానే కొనసాగింది. ఇక మూడవ రోజు ఇంట్లో రచ్చ రంబోలా మొదలైంది. స్క్రీన్ స్పేస్ కోసం కంటెస్టెంట్స్ చేసే హడావిడి మాములుగా లేదు. ఇక ఎప్పటిలాగే గొడవలు, ఏడుపులు ఈ సీజన్‏లో కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక మూడో రోజు (సెప్టెంబర్ 7)న ప్రసారం అయిన ఎపిసోడ్‏లో ఒకరి తర్వాత ఒకరు ఏడుపులు, పెడబొబ్బలు, అరుచుకోవడంతో హాట్ హాట్‍గా సాగింది.

ఇక మూడోరోజు ఎపిసోడ్‏లో ట్రాన్స్ జెండర్ ప్రియాంక..తాను ఎందుకు అలా మారాల్సి వచ్చిందో చెప్తూ.. తాను ఎదుర్కోన్న కష్టాలను చెప్పుకొచ్చింది. ట్రాన్స్‏జెండర్‏గా మారకుండా వేరేవాళ్లని పెళ్లి చేసుకుని ఉంటే.. నన్ను నేను మోసం చేసుకోవడమే కాకుండా.. మరో అమ్మాయికి అన్యాయం చేయాల్సి వస్తుందని.. నా స్నేహితురాలు.. నిషాతో నా బాధ చెప్పుకున్నాను. దాంతో ఆమె పదవే నేను కూడా వస్తా అంటూ ఇద్దరం కలిసి ఆపరేషన్ చేయించుకున్నాం అని చెప్పింది. ఒకే ఒక్క రాత్రిలో మేం ఆ నిర్ణయం తీసుకున్నాం.. అనుకున్న వెంటనే ఫ్లైట్ ఎక్కి ఆపరేషన్ చేయించేసుకున్నాం.. కానీ ఆపరేషన్ తర్వాత బాధపడ్డాను. భరించలేని నొప్పితో నరకం చూశాను. ఒంట్లో నరాలన్నీ మిక్సీలో వేసినట్లు ఉండేది.. నరకం చూశాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత సైడ్ సైడ్ ప్లీజ్ పాటకు స్టెప్పులేశారు కంటెస్టెంట్స్. ఇక ఆ తర్వాత వంట దగ్గర హెల్ప్ చేయకుండా ఎవరికి వాళ్లు జిమ్ చేస్తున్నారంటూ.. ఉమాదేవి కాస్త సీరియస్ అయ్యింది. దీంతో అక్కడే పనిచేస్తున్న శ్వేత, సరయులు…మీరు నవ్వుతూ చెప్పకండి.. సీరియస్‏గా చెప్పండి అంటూ చెప్పారు. అలాగే కొంతమంది అసలు ఏ పని చేయడం లేదని సరయు చెప్పుకొచ్చింది.

ఇక అప్పుడే బిగ్ బాస్ ఇంట్లో రచ్చ మొదలైంది. ఒకవైపు కాజల్ లహరి మధ్య డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత లోబో, సిరి మధ్య మాటల యుద్దం సాగింది. అలాగే బిగ్ బాస్ ఇచ్చిన పవర్ రూం టాస్క్‏లో నటుడు విశ్వ గెలవగా.. ఇంట్లో ఉన్న ఇద్దరు సభ్యులు తమ ఒంటిపై ఉన్న బట్టలతో సహా అన్ని వస్తువులను స్టోర్ రూంలో పెట్టాలి అనడంతో రవి, ప్రియా పేర్లు చెప్పాడు విశ్వ. దీంతో వారు తమ వస్తువులను స్టోర్ రూంలో పెట్టి.. తమ అపోజిట్ జెండర్ బట్టలు ధరించారు.

ఇప్పటివరకు ఫన్నీగానే సాగిన ఆట.. ఒక్కసారిగా మారిపోయింది. కాజల్, లహరిల మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. కాజల్ తనను కావాలని టార్గెట్ చేస్తుందని.. కంటెంట్ కోసం తెగ ప్రయత్నిస్తుందంటూ ఫైర్ అయ్యింది లహరి. కాజల్ ఎంత పాజిటివ్‏గా మాట్లాడాలని ప్రయత్నించినా.. లహరి మాత్రం తగ్గలేదు. నీలో పాజిటివ్ వైబ్స్ లేవు… అటాకింగ్ పొజిషన్‏కి వస్తే నేను ఒప్పుకొను.. నువ్ ఇక్కడికి ఎందుకు వచ్చావో.. నేను అందుకే వచ్చా.. బిగ్ బాస్ నీకు డ్రీమ్ ఎలాగో.. నాకు.. డ్రీమ్ అంతే అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంత కాజల్ వెనక్కి తగ్గి… లహరికి సారీ చెప్పింది. నేను నిన్ను హర్ట్ చేసి ఉంటే క్షమించు అని ఎమోషనల్ అయ్యింది. నేను ఇలా ఏడ్వడం నా కూతురు చూస్తే ఏమౌతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం రవి.. మానస్‏లు ఒదార్చారు. మొత్తం మూడో రోజే ఇంట్లో రచ్చ రంబోళా చేశారు హౌస్ మేట్స్.

Also Read: Pawan Kalyan: వినాయకుడిపైనే ఆంక్షలా.. ఏపీ సర్కార్‌ తీరుపై జనసేనాని పవన్ కల్యాణ్ ఫైర్!

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ హౌజ్‌లో దమ్‌ మారో దమ్‌.. సిగిరెట్‌ తాగుతూ ముద్దుగుమ్మల రచ్చరచ్చ.!