Siri Hanmanth: బిగ్ బాస్ హౌస్‌లో సిరి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

Janardhan Veluru

Janardhan Veluru |

Updated on: Sep 07, 2021 | 12:07 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 టైటిల్ రేసులో ముందున్న వారిలో సిరి కూడా ఒకరు. తన అందమైన రూపం, ముఖంపై నిత్యం చెరగని చిరునవ్వుతో బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేస్తోందీ అమ్మడు.

Siri Hanmanth: బిగ్ బాస్ హౌస్‌లో సిరి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
Siri

Bigg Boss 5 Telugu: అట్టహాసంగా మొదలైన బిగ్ బాస్ 5 రియాల్టీ షో టైటిల్ రేసులో ముందున్న వారిలో సిరి కూడా ఒకరు. గ్లామర్‌కు తోడు అందమైన రూపం, ముఖంపై నిత్యం చెరగని చిరునవ్వుతో బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేస్తోందీ అమ్మడు. బిగ్ బాస్ షో మొదటి రోజున కెమెరా కళ్లను ఎక్కువ చేపు తనవైపే నిలుపుకోవడంలో సిరి సక్సెస్ సాధించింది. సిరికి సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త బెటర్‌గానే ఉంది. ఆమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేందుకు పీఆర్ టీమ్స్ ఇప్పటికే పనిమొదలుపెట్టేశాయి. సోషల్ మీడియా వేదికలపై సిరికి మద్ధతు కూడకట్టేందుకు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

తెలుగులో బిగ్ బాస్ టైటిల్ ఇప్పటి వరకు మహిళలకు దక్కలేదు. బిగ్ బాస్ 3 ఫైనల్‌కు చేరిన అందాల యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా సరిపెట్టుకున్నారు. ఈ సారైనా ఓ మహిళ టైటిల్ గెలుచుకుని చాలా రోజులుగా ఉన్న వెలితిని తీర్చాలని బిగ్ బాస్ మహిళాభిమానులు, నెటిజన్స్ బలంగా కోరుకుంటున్నారు. ప్రస్తుత షోలో.. సిరి రూపంలో ఓ స్ట్రాంగ్ మహిళా కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నట్లు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. నామినేషన్ సమయంలో సిరి చాలా పరిపక్వతను ప్రదర్శించిందని చెబుతున్నారు. సిరి జోరును చూస్తే ఆమె టాప్-4లో ఆమె కచ్చితంగా నిలుస్తుందని.. గేమ్ బాగా ఆడితే టైటిల్ గెలుచుకోవడం ఖాయమని సోషల్ మీడియా వేదికలపై నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

సిరి తరఫున పీఆర్ టీమ్ చేసిన ఇన్‌స్టా పోస్ట్..

అదే సమయంలో సిరి జోరును జీర్ణించుకోలేని కొందరు నెటిజన్స్ మాత్రం ఆమెపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ మొదలుపెట్టేశారు. హౌస్‌లో సిరి ఓవర్ యాక్షన్‌ను చూడలేకపోతున్నట్లు మండిపడుతున్నారు. ఆమెను వీలైనంత త్వరగా హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు.

సిరి తరఫున పీఆర్ టీమ్ చేసిన ఇన్‌స్టా పోస్ట్..

Also Read..

Crime News: దారుణం.. ఒంటరిగా ఉన్న బాలికపై ఆటో డ్రైవర్ల కన్ను.. కిడ్నాప్‌ చేసి సిటీ అంతా తిప్పుతూ..

Gupta Nidhulu: గుప్త నిధులు తవ్వుతాం.. మీ జాతకం మార్చేస్తాం.. తవ్వి తీసిన నాణాలు ఇవిగో.. అంటే నమ్మేయకండే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu