Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gupta Nidhulu: గుప్త నిధులు తవ్వుతాం.. మీ జాతకం మార్చేస్తాం.. తవ్వి తీసిన నాణాలు ఇవిగో.. అంటే నమ్మేయకండే..

గుప్త నిధులు ఎక్కడ ఉంటాయి. ఎంత లోతు తవ్వితే ఉంటాయి. నిధుల జాడ తెలిసేదెలా..! ష్‌.. అదో పరమ రహస్యం. అది వాళ్లకు మాత్రమే తెల్సు..

Gupta Nidhulu: గుప్త నిధులు తవ్వుతాం.. మీ జాతకం మార్చేస్తాం.. తవ్వి తీసిన నాణాలు ఇవిగో.. అంటే నమ్మేయకండే..
Gupta Nidhulu
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 07, 2021 | 11:44 AM

గుప్త నిధులు ఎక్కడ ఉంటాయి. ఎంత లోతు తవ్వితే ఉంటాయి. నిధుల జాడ తెలిసేదెలా..! ష్‌.. అదో పరమ రహస్యం. అది వాళ్లకు మాత్రమే తెల్సు.. ! కావాలంటే తవ్వి తీసిన నాణాలు వారి వద్ద చాలా ఉన్నాయి.. ! వాటిని చూస్తే వారు ఎంత ఘనులో మీకే అర్థమవుతుంది. స్వచ్ఛమైన 24 క్యారెట్స్‌తో చేసిన బంగారు నాణాలు. ఇది శాంపిల్ మాత్రమే. జస్ట్ ప్రూఫ్ మాత్రమే. ఒకవేళ అడిగినంతా సొమ్మిస్తే.. అసలు నిధి ఎక్కడుందో తీసు పెడతాం అంటూ చెప్పడం.. వారి మాటలకు పడితే దోచేయడం వీరి స్టైల్. కళ్లు జిగేల్‌మనే ఆ నాణాలను చూసిన తర్వాత ఎవరు ఆగుతారు చెప్పండి. అందుకే.. చిత్తూరు జిల్లా చాంద్‌బీ 70వేలు ఇచ్చింది. పోతే పోయాయి 70వేలు. వచ్చేది 70లక్షల సంపదో, 70కోట్ల సంపదో అనుకుంది.

డీల్ సెట్ అయ్యాక.. పనిమొదలైంది. నీవా నది సమీపంలో ఉన్న ఆమె ఇంట్లో గుంత తవ్వడం మొదలు పెట్టారు. మొదట 20వేలు తీసుకున్నారు. కొంత తవ్విన తర్వాత ఇదిగో బంగారు నిధి అంటూ చూపించారు. చాంద్‌బీ కళ్లు మెరిసిపోయాయి. ఆ తర్వాత 50వేలు వసూలు చేశారు. వారం రోజుల నుంచీ తవ్వుతూనే ఉన్నారు. ఎప్పుడైతే 50వేలు వసూలు చేశారో.. ఇక చాంద్‌బీ అంతకుమించి ఇవ్వలేదు అనుకున్నారో.. తవ్వకాలకు రావడం మానేశారు. అప్పటి వరకూ మెరిసిపోయిన చాంద్‌బీ కళ్లు.. ఆ తర్వాత కన్నీటి పర్యంతమయ్యాయి.. కారణం నిధీ లేదు.. నిక్షేపం లేదని తెలిసిపోయింది.

ఈ స్టోరీలో అసలు జరిగింది ఏంటీ అంటే.. ఆ మోసగాళ్లు విక్రమార్కుడి సినిమా స్టయిల్లో ఇంటింటికీ గుప్త నిధుల చూపిస్తామంటూ తిరుగుతున్నారు. బలహీనత ఉన్న వాళ్లను టార్గెట్ చేసి డబ్బు గుంజుతున్నారు. మరి నిధి చూపిస్తున్నారుగా అంటే.. వాళ్లతో పాటు తెచ్చుకున్న కొన్ని నకిలీ నాణాలను ఆ గుంతలో వేస్తారు. అవే దొరికాయంటూ నమ్మిస్తారు. డబ్బులు ఇవ్వగానే వంచిస్తారు.. ముంచేస్తారు.

తాజాగా ఈ గ్యాంగ్ చిత్తూరు జిల్లాలో ఊరూరా తిరుగుతోంది. ఈ గ్యాంగ్‌పై అటు పోలీసులకు.. రెవిన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. వాళ్లు పట్టుకుంటారో లేదోగానీ.. మీ ఇంటిదాకా అలాంటి ఖతర్నాక్‌లు వస్తే.. మురిసిపోకండి.. పోలీసులకు మాత్రం పట్టించండి.

ఇవి కూడా చదవండి: వీరిది సహాపంక్తి భోజనం.. తినడానికి పొంగలి.. రుచికరమైన వంటకాలు.. కానీ ప్లేట్లు.. విస్తరాకుల్లో కాదు.. మరీ ఎలా తింటారో తెలుసా..

Acharya Chanakya: నీరు.. డబ్బు.. ఒకటే.. సంపాదించిన సంపదను ఏం చేయాలో చెప్పిన చాణక్యుడు..