AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరిది సహాపంక్తి భోజనం.. తినడానికి పొంగలి.. రుచికరమైన వంటకాలు.. కానీ ప్లేట్లు.. విస్తరాకుల్లో కాదు.. మరీ ఎలా తింటారో తెలుసా..

Meals on Rock: అది సహాపంక్తి భోజనం. తినడానికి పొంగలి, రుచికరమైన భోజనం పెడతారు. కానీ ప్లేట్లు, విస్తరాకుల్లో వడ్డించరు. మరీ వాళ్లంతా ఎలా తింటారో తెలుసా..?

వీరిది సహాపంక్తి భోజనం.. తినడానికి పొంగలి.. రుచికరమైన వంటకాలు.. కానీ ప్లేట్లు.. విస్తరాకుల్లో కాదు.. మరీ ఎలా తింటారో తెలుసా..
Meals Without Plates
Sanjay Kasula
|

Updated on: Sep 07, 2021 | 8:54 AM

Share

ఎక్కడైనా సహాపంక్తి భోజనం అంటే టెంట్‌ కింద, లేదంటే తోటలో అంతా దర్జాగా కూర్చొని టేబుళ్లపై ప్లేట్లు.. లేదంటే విస్తరాకుల్లో వండ్డించిన వంటకాలను ఒక్కొక్కటిగా అడిగి మరీ వేయించుకొని తినడం చూస్తాం. కానీ మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వెంకంపల్లి గ్రామంలో ఇందుకు పూర్తిగా రివర్స్‌లో జరుగుతుంది. ఇదిగో ఇక్కడకు ఎవరొచ్చినా ఇలా ప్లేట్లు, విస్తరాకులు లేకుండా బండరాయిపై పెట్టిన భోజనాన్నే మహాప్రసాదంగా తింటారు. ఈ వంటలన్ని కూడా ఇక్కడే బండరాయిపైనే వండుతారు.

ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసా. ఇక్కడికి దగ్గర్లో శ్రీకురుమూర్తిస్వామి దేవస్థానం ఉంది. ఆ స్వామివారు కిలోమీటర్ దూరంలో ఉన్న తొక్కుడుబండపై కాలు మోపారనే పూర్వకాలం నుంచి వినిపిస్తున్న మాట. అందుకే ప్రతి శ్రావణమాసంలో స్వామి వారి పాదాలకు పూజలు చేస్తారు గ్రామస్తులు.

స్వామివారికి నైవేద్యంగా వంటలు చేసి ఆయన వడ్డించిన తర్వాత ఊరి జనమంతా ఓ కుటుంబ సభ్యుల్లా కలిసి తొక్కుడుబండపై కూర్చొని విస్తరాకులు, ప్లేట్లు లేకుండా బండరాయిపైనే భోజనాలు చేస్తారు. ఇందుకోసం అయ్యే ఖర్చును కూడా గ్రామస్తులంతా చందాలు వేసుకొని సేకరిస్తారు.

దేవుడు కాలుమోపిన బండపై ఎలాంటి ఇస్తరాకులు, ప్లేట్లు లేకుండా బండపైనే పరమాన్నం, పచ్చిపులుసుతో భోజనం చేస్తే పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఊరు చల్లగా ఉండాలి. పాడి పంటలు బాగా పండాలి.పిల్ల,పాపలతో అంతా సంతోషంగా గడపాలని శ్రీకురుమూర్తిస్వామిని వేడుకుంటారు గ్రామస్తులు.

ఇవి కూడా చదవండి: Beauty Tips: గుడ్డు పెంకును పారేస్తున్నారా?.. దాని ప్రయోజనాలు తెలిస్తే ఇకపై అలా చేయరు..!

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే, వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..