Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే, వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..

Weight Loss Tips: బరువు తగ్గాలనుకునేవారు ముందుగా డైటింగ్‌పై దృష్టి పెడతారు. ఆ తరువాత వ్యాయామం, ఇతర అంశాలపై దృష్టి పెడతారు. అయితే, తినే ఆహార పదార్థాల...

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే, వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..
Weight Loos
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 07, 2021 | 6:31 AM

Weight Loss Tips: బరువు తగ్గాలనుకునేవారు ముందుగా డైటింగ్‌పై దృష్టి పెడతారు. ఆ తరువాత వ్యాయామం, ఇతర అంశాలపై దృష్టి పెడతారు. అయితే, తినే ఆహార పదార్థాల పట్ల కాస్త కన్ఫ్యూజన్‌గా ఉంటారు. వాస్తవానికి మనం తినే ఆహార పదార్థాలే మనం బరువు తగ్గేందుకు ఉపకరిస్తాయి. ఏం తినాలి, ఎంత తినాలి.. ఏం తింటున్నాం అనే అంశాలు ప్రధానం. ఇక పోషకాహారానికి సంబంధించి చూసుకున్నట్లయితే.. మనం తినే పోషకాహారాలు మన జీవిత కాలాన్ని నిర్ణయిస్తాయనే చెప్పాలి. ఇక బరువు తగ్గే విషయానికి వస్తే మనం తినాల్సిన, మనం తగ్గించాల్సిన ఆహారాల గురించి కొంత వరకు మనకు అవగాహన ఉంటుంది. కానీ మనం నిర్లక్ష్యంగా భావించే, మన ఆహారం చేర్చడానికి ముఖ్యమైనవి కానిగా భావించే కొన్ని ఆహారాలు కూడా ఉంటాయి. అయితే, అటువంటి కొన్ని ఆహార పదార్థాలే బరువు తగ్గడానికి ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన బరువు తగ్గాలని భావించినట్లయితే.. కొన్ని రకాల ఫుడ్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతుంటారు. మరి ప్రజలు నిర్లక్ష్యంగా భావించే పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. బాదం బాదం పప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా వీటిని తినాలి. బాదంలో కేలరీలు అధికంగా ఉన్నప్పటికీ.. అవసరమైన మేరకు తినాలి. ఇందులో ప్రోటీన్, ఫైబర్‌తో సహా అనేక పోషకాలు ఉంటాయి. ఇది ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా ఉంటుంది. తద్వారా తక్కువ ఆహారం తినడానికి ఉపకరిస్తుంటుంది.

2. ఆపిల్ బరువు తగ్గే విషయానికి వస్తే మనం తరచుగా కొన్ని ఆహారాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాము. కానీ ప్రయోజనకరమైన ఆహారాలను మర్చిపోతాము. రోజుకు ఒక ఆపిల్ తిన్నట్లయితే.. వైద్యుడు వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదంటారు. అంతేకాదు.. యాపిల్ తినడం ద్వారా శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు. యాపిల్‌ తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. బరువు తగ్గడానికి అవసరమైన పోషకాలు యాపిల్‌లో పుష్కలంగా ఉంటాయి. అధిక ఫైబర్, జీర్ణ శక్తిని పెంపొందించే తత్వం ఇందులో ఉంటుంది.

3. చిలగడదుంప బరువు తగ్గడానికి అతి తక్కువ రేటింగ్ ఉన్న ఆహారాలలో స్వీట్ పొటాటో ఒకటి. కానీ, ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని, బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుందని చాలా మందికి తెలియదు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది, తక్కువ కేలరీలు, హైడ్రేటింగ్ లక్షణాలు ఉంటాయి. మీ ఆకలిని అరికట్టడంలో సహాయపడటమే కాకుండా, చిలగడదుంపలు శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, సి ని అందిస్తాయి.

4. పుట్టగొడుగులు పుట్టగొడుగులు మాంసాహారానికి ప్రత్యామ్నాయం. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరానికి ప్రోటీన్, ఫైబర్ అందిస్తాయి. ఇది మీ బరువు తగ్గించే ప్రయాణానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పుట్టగొడుగులను తినడం వలన కడుపు నిండినట్లుగా అనిపిస్తుంటుంది. తద్వారా ఆకలిగా అనిపించకపోవడంతో బరువు సునాయాసంగా తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.

5. ఓట్స్ ఓట్స్.. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి ఎంతగానో దోహదపడుతాయి. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఎక్కువగా తినాలనే కోరికలను అదుపు చేస్తుంది. తద్వారా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

Also read:

Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Government of India: శుభవార్త.. దీపావళికి ముందు వారి అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి.. బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి..

Childrens Immunity: అసలే కరోనా కాలం.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తిని ఇలా పెంచండి..!