Childrens Immunity: అసలే కరోనా కాలం.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తిని ఇలా పెంచండి..!

Childrens Immunity: థర్డ్ వేవ్‌ రూపంలో కరోనా మహమ్మారి పిల్లలపై విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచాల్సిన అవసరం ఉంది. బలమైన రోగ నిరోధక శక్తి పిల్లల్లో..

Childrens Immunity: అసలే కరోనా కాలం.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తిని ఇలా పెంచండి..!
Immunity
Follow us

|

Updated on: Sep 07, 2021 | 6:09 AM

Childrens Immunity: థర్డ్ వేవ్‌ రూపంలో కరోనా మహమ్మారి పిల్లలపై విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచాల్సిన అవసరం ఉంది. బలమైన రోగ నిరోధక శక్తి పిల్లల్లో కరోనా వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి వారికి తినిపించే ఆహారంలో అనేక పోషకాలను చేర్చవచ్చు. పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎలాంటి పదార్థాలు ఆహారంలో చేర్చాలో ఇప్పుడు తెలుసుకుందాం..

తులసి.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు, చికిత్సా లక్షణాలకు ప్రసిద్ధి చెందింది తులసి. దీనిని ‘మూలికల రాణి’గా పిలుస్తారు. ఇందులో విటమిన్లు ఎ, సి, కె పుష్కలంగా ఉంటాయి. ఈ తులసి పిల్లల్లో జ్వరాన్ని తగ్గిస్తుంది. జలుబు, దగ్గును అరికడుతుంది. అలాగే.. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. తులసి ఆకులను పాలలో కలిపి తీసుకుంటే జ్వరం నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

పసుపు.. ప్రతి భారతీయ ఇంటిలో ప్రధానమైనది పసుపు. ఈ పసుపులో వ్యాధి నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇది ఆహార రుచిని పెంచుతుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి పసుపు పొడిని పాలలో కలపవచ్చు. ఇది జలుబు, దగ్గు, జ్వరం కోసం కూడా పసుపు పాలను తాగడం ఉత్తమం.

దాల్చిన చెక్క.. ఇది మనిషుల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. దాల్చిన చెక్క పొడిని చాక్లెట్ పాలలో కలపవచ్చు.

అల్లం-వెల్లుల్లి.. జలుబు, ఫ్లూకి కారణమయ్యే వైరస్‌లను నియంత్రిస్తుంది. అల్లం పాలు పిల్లలతో తాగిస్తే చాలా మంచిది. జలుబు, దగ్గు విషయంలో అర టీస్పూన్ అల్లం పొడి, జీలకర్ర పొడిని తేనెలో కలిపి సేవించండి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీరు దీనిని ముడి రూపంలో కూడా తినవచ్చు.

అశ్వగంధ.. ఈ పురాతన ఔషధ మూలిక శారీరక సమస్యలను నయం చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అశ్వగంధ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కండరాలకు బలాన్ని ఇస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. పిల్లలు మరింత అలసటతో బాధపడుతుంటే, అశ్వగంధ పొడిని పాలలో కలిపి తాగించొచ్చు.

జీలకర్ర.. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. జీలకర్రను వేయించి మెత్తగా చేసి, అందులో తేనె మిక్స్ చేసి తాగితే దగ్గు, గొంతు నొప్పి సమస్య తీరుతుంది. జీలకర్రను బియ్యం, ఇతర వంటకాలలో కూడా కలుపుకోవచ్చు.

లవంగం.. ఈ మసాలా దినుసులను కూరగాయలకు చేర్చడం వల్ల పిల్లలు సులభంగా తింటారు. కేకులు, బ్రెడ్‌లకు లవంగాల పొడిని కూడా కలుపుకోవచ్చు.

Also read:

Anger Management: మీకు తరచుగా కోపం వస్తుందా?.. అయితే, ఈ నాలుగు టిప్స్‌ని ట్రై చేయండి.. కోపాన్ని జయించండి..

SBI Apprentice Admit Card 2021: ఎస్‌బీఐ అప్రెంటిస్ ఎగ్గామ్ హాల్ టికెట్ విడుదల.. పూర్తి వివరాలివే..

SBI Offer: మీకు ఈ విషయం తెలుసా?.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. మరో వారం రోజులే గడువు.. పూర్తి వివరాలు మీకోసం..

బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!