Anger Management: మీకు తరచుగా కోపం వస్తుందా?.. అయితే, ఈ నాలుగు టిప్స్‌ని ట్రై చేయండి.. కోపాన్ని జయించండి..

Anger Management: ఒకప్పుడు ప్రజలు కలివిడిగా ఉండేవారు. అందరూ కలిసి గంటలు గంటలు ముచ్చటించుకునేవారు. తమ సాదకబాదకలను ఒకరితో మరొకరు పంచుకునేవారు.

Anger Management: మీకు తరచుగా కోపం వస్తుందా?.. అయితే, ఈ నాలుగు టిప్స్‌ని ట్రై చేయండి.. కోపాన్ని జయించండి..
Dipression
Follow us

|

Updated on: Sep 07, 2021 | 6:04 AM

Anger Management: ఒకప్పుడు ప్రజలు కలివిడిగా ఉండేవారు. అందరూ కలిసి గంటలు గంటలు ముచ్చటించుకునేవారు. తమ సాదకబాదకలను ఒకరితో మరొకరు పంచుకునేవారు. అలా తమలోని భారాన్ని తొలగించుకునేవారు. కానీ నేటి కంప్యూటర్‌ యుగంలో నాటి పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. సంబంధాలు మొబైల్ ఫోన్లకే పరిమితం అయ్యాయి. ఆఫీసులు, బిజినెస్‌లు అంటూ.. కుటుంబంతో కొన్ని క్షణాలు కూడా గడపడానికి సమయం దొరకడం కష్టమవుతోంది. ఎవరు కూడా పరస్పరం మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితులు నేటి కాలంలో లేవు. మానవ జీవితం బాధ్యతల వలయంలో చిక్కుకుపోయింది.

ఈ రోజుల్లో ఒత్తిడి వంటి సమస్యలు సర్వసాధారణంగా మారడానికి కారణం ఇదే. ఒత్తిడి పరిమితికి మించి పెరిగినప్పుడు, అది డిప్రెషన్‌గా మారుతుంది. డిప్రెషన్ కారణంగా, వ్యక్తి సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కూడా కోల్పోతాడు. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాడు. ఈ పరిస్థితులను నివారించడానికి, మనస్సులోని కోపాన్ని తొలగించడం చాలా ముఖ్యం. మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడేందు 4 సులభమైన మార్గాలను నిపుణులు చెబుతన్నారు. మరి ఆ నాలుగు మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలా రిలాక్స్ అవ్వండి.. రోజంతా మీకు సమయం దొరికినప్పుడు, మీరు కొంత సమయం కూర్చుని డైరీని వ్రాయండి. మీ మనస్సులోని ప్రతి మంచి, చెడులను డైరీలో రాయండి. మీకు ఇబ్బంది కలిగించే వాటి గురించి రాయండి. మీ భావోద్వేగాలను బయటకు తీయడం ద్వారా, మనస్సు చాలా తేలికగా మారుతుంది. కాబట్టి రోజూ డైరీ రాయండి.

సంగీతం వినండి.. ఒత్తిడిని తగ్గించడానికి సంగీతం ఉత్తమ చికిత్సగా పరిగణించబడుతుంది. మీరు తప్పనిసరిగా కొన్ని సంగీత కార్యకలాపాలలో మమేకం అయ్యేలా చూసుకోండి. దీని కోసం, డ్యాన్స్ క్లాస్‌లో చేరండి. మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి నృత్యం పనిచేస్తుంది. పాటలు, గిటార్, ఏదైనా ఇతర వాయిద్యం నేర్చుకోవడానికి ట్రై చేయండి. సమయం తక్కువగా ఉంటే వారానికోసారి క్లాస్ తీసుకొని ఇంటికి వచ్చి రోజూ ప్రాక్టీస్ చేయండి. దీంతో, అనవసరమైన విషయాలు మీ మనస్సులోకి రావు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మంచి అనుభూతి కలుగుతుంది.

నమ్మకమైన వ్యక్తితో మాట్లాడండి.. ఒత్తిడిని తగ్గించడంలో ఇది ఎంతో కీలకం. చాలా ప్రభావవంతమైన మార్గం. ఏదైనా మిమ్మల్ని బాధించినప్పుడు, మీ సమస్యను మీరు విశ్వసించే వారికి చెప్పండి. వారి నుంచి సలహాలు స్వీకరించండి. వారి ద్వారా సమస్యకు పరిస్కారం పొందవచ్చు. మీ మానసిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

ధ్యానం అలవాటు చేసుకోండి.. ధ్యానం మీలోని ఒత్తిడి దూరం చేస్తుంది. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మీరు ధ్యానం చేయలేకపోతే, సాయంత్రం లేదా రాత్రి మీకు తీరిక దొరికినప్పుడు కొంత సమయం పాటు ధ్యానం చేయండి. ధ్యానం చేయడం ద్వారా మీ మనస్సు స్థిరంగా ఉంటుంది. మానసిక శాంతి లభిస్తుంది. అన్ని పనులను మెరుగైన రీతిలో చేయగలరు.

Also read:

SBI Apprentice Admit Card 2021: ఎస్‌బీఐ అప్రెంటిస్ ఎగ్గామ్ హాల్ టికెట్ విడుదల.. పూర్తి వివరాలివే..

SBI Offer: మీకు ఈ విషయం తెలుసా?.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. మరో వారం రోజులే గడువు.. పూర్తి వివరాలు మీకోసం..

Agency Rains: నాన్ స్టాఫ్ వర్షాలు.. వరద బీభత్సం. నడుముల్లోతు నీటితో మన్యంలో పరిస్థితి ఆగమ్యగోచరం

Ashu Reddy: ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి.. ఇంతకీ కారణం ఏంటంటే.?

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!