AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashu Reddy: ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి.. ఇంతకీ కారణం ఏంటంటే.?

Ashu Reddy: జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకుని సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది ముద్దుగుమ్మ ఆషు రెడ్డి. ఈ క్రేజ్‌తోనే బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో...

Ashu Reddy: ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి.. ఇంతకీ కారణం ఏంటంటే.?
Narender Vaitla
|

Updated on: Sep 06, 2021 | 9:47 PM

Share

Ashu Reddy: జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకుని సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది ముద్దుగుమ్మ ఆషు రెడ్డి. ఈ క్రేజ్‌తోనే బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో పాల్గొనే లక్కీ ఛాన్స్‌ కొట్టేసిందీ బ్యూటీ. బిగ్‌బాస్‌ హౌజ్‌లో తనదైన అల్లరి పనులు, అందంతో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుందీ చిన్నది. రాహుల్‌ సిప్లిగంజ్‌తో ఆషురెడ్డి రిలేషన్‌లో ఉందని అప్పట్లో వార్తలు హల్చల్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రామ్‌గోపాల్‌ వర్మ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొని మరోసారి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఇక ఈ ఇంటర్వ్యూ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల కానుంది.

ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఆషు రెడ్డి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ చేసింది. జోష్‌ యాప్‌ కోసం నిర్వహించిన ఓ కార్యక్రమంలో నటుడు సోనూసూద్‌తో కలిసి పాల్గొన్న ఆషు ఆ విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ సందర్భంగా సోనూసూద్‌తో ఉన్న వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘మంచి మనసున్న వ్యక్తితో షూటింగ్‌లో పాల్గొన్నాను. ఈ అవకాశం కల్పించిన జోష్‌ యాప్‌ తెలుగుకు ధన్యవాదాలు’ అంటూ క్యాప్షన్‌ జోడించింది. ఇంతకీ ఆషురెడ్డి సోనూతో పాల్గొన్న కార్యక్రమం ఏంటో తెలియాల్సి ఉంది. అయితే ఆషు రెడ్డి సోనూసూద్‌తో షూట్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన కొద్ది సేపటికే డిలీట్‌ చేయడం గమనార్హం.

Ashu Reddy

Also Read: Viral Video:ముఖ్యమైన ఇంటర్వ్యూలో ఉన్న ఎడిటర్..అకస్మాత్తుగా ఫ్రేమ్ లోకి వచ్చిన బుడతడు.. తరువాత ఏమి జరిగిందంటే..

Land Grabbing: విశాఖలో భారీ భూ కుంభకోణం.. 100 కోట్ల విలువైన భూముని 19 కోట్లకు కొనేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే

Viral Video: ఈ దిల్‌ ఖుష్‌ దోశను చూస్తేనే మది ఖుషీ అయిపోతుంది.. ఇంతకీ దీన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా.?