Viral Video:ముఖ్యమైన ఇంటర్వ్యూలో ఉన్న ఎడిటర్..అకస్మాత్తుగా ఫ్రేమ్ లోకి వచ్చిన బుడతడు.. తరువాత ఏమి జరిగిందంటే..

KVD Varma

KVD Varma |

Updated on: Sep 06, 2021 | 9:12 PM

కరోనా దెబ్బకు చాలా ఆఫీసులు మూత పడ్డాయి. అంటే.. ఆఫీసులకు తాళాలు వేసి.. ఇళ్ళ దగ్గర పని చేసే విధానం మొదలైంది. ఇక ఈ వర్క్ ఫ్రం హోం అలవాటు పడటానికి ఉద్యోగస్తులు పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కాదు.

Viral Video:ముఖ్యమైన ఇంటర్వ్యూలో ఉన్న ఎడిటర్..అకస్మాత్తుగా ఫ్రేమ్ లోకి వచ్చిన బుడతడు.. తరువాత ఏమి జరిగిందంటే..
Viral Video

Viral News: కరోనా దెబ్బకు చాలా ఆఫీసులు మూత పడ్డాయి. అంటే.. ఆఫీసులకు తాళాలు వేసి.. ఇళ్ళ దగ్గర పని చేసే విధానం మొదలైంది. ఇక ఈ వర్క్ ఫ్రం హోం అలవాటు పడటానికి ఉద్యోగస్తులు పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. మొదట సరదాగా అనిపించినా.. మెల్లగా ఇంటి దగ్గర నుంచి పనిచేయడం చాలా కష్టం సుమా అనిపించేలా పరిస్థితులు మారిపోయాయి. ఇక ఇంటి వద్ద నుంచి పనిచేస్తుంటే అధికారులు తమ సిబ్బందికి ఇచ్చే సూచనలు.. ఉద్యోగులు ఒకరితో ఒకరు పని విషయాలు మాట్లాడుకోవడం.. పనికి సంబంధించిన విషయాలను పంచుకోవడం వంటివి చేయాలంటే.. జూమ్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు. జూమ్ యాప్ తో వీడియో కాల్స్ చేసి.. ఆఫీస్ లో ఉన్నట్టే తమ పనులు పూర్తి చేసుకున్నారు. అయితే, ఈ జూమ్ కాల్స్ చేసిన సందడి అంతా ఇంతాకాదు. దీనిని అలవాటు పడే క్రమంలో ఎన్నో వింతలు చోటు చేసుకున్నాయి. జూమ్ మీటింగ్ ఇంటి నుంచి హాజరు అయినప్పుడు అకస్మాత్తుగా కుటుంబ సభ్యులు వీడియోలో వచ్చేయడం.. ఒక్కోసారి అనుకోని సంఘటనలు జూమ్ మీటింగ్ వీడియో ఫ్రేం లోకి వచ్చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటువంటి వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. కొన్ని వీడియోలు వైరల్ గా మారిపోయి అందరినీ వినోద పరిచాయి. క్రమేపీ అందరూ ఈ మీటింగ్స్ కి అలవాటు పడ్డారు.

మీటింగ్ సమయంలో తామున్న గదిని లాక్ చేసుకోవడం.. ఇంటి సభ్యులను హెచ్చరించడం వంటి పనులు చేసి ఇటువంటి విషయాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టారు. కానీ, ఒక్కోసారి అనుకోకుండా ఈ జాగ్రత్తలు మిస్ అవుతారు కొందరు. అటువంటి పరిస్థితిలో వీడియో ఫ్రేం లోకి ఇంటి సభ్యులు వచ్చేస్తే ఎలా ఉంటుంది. ఇదిగో అలాంటి సంఘటనే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం.

ఇటీవల, స్కై న్యూస్ విదేశీ వ్యవహారాల ఎడిటర్ డెబోరా హేన్స్ అతి ముఖ్యమైన ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఆమె చిన్నారి కుమారుడు ఆమెను ఆకస్మికంగా చూడాలని నిర్ణయించుకున్నాడు. హేన్స్ మార్క్ ఆస్టిన్‌తో ఆమె సంభాషణ మధ్యలో ఉన్నప్పుడు ఆ బుడతడు గదిలోకి దూసుకెళ్లి బిస్కెట్లు డిమాండ్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆమె తప్పనిసరి పరిస్థితిలో ”ఓహ్, నన్ను క్షమించండి, నా కొడుకు వచ్చాడు, నిజంగా సిగ్గుపదుతున్నాను, క్షమించండి.” అని చెప్పింది. ఆమె వెనుక ఉన్న తలుపు తెరుచుకుని లోపలి వచ్చిన ఈ బుడతడు.. నాకు రెండు బిస్కట్లు ఇవ్వవచ్చు కదా? అని అడుగుతున్నాడు. దీంతో మార్క్ ఆస్టిన్ కెమెరాను తిరిగి స్టూడియోకి కనెక్ట్ చ్సింది. ”మేము డెబొరా హేన్స్ ని అక్కడే వదిలేస్తున్నాము. కొన్ని కుతుంబ విధుల ప్రవాహంలో ఆమె ఉన్నారు.” అని చెప్పారు. ఆ వీడియో మీరిక్కడ చూడొచ్చు..

గత వారం, న్యూజిలాండ్ సాంఘిక అభివృద్ధి మంత్రి కార్మెల్ సెపులోనీ, రేడియో సమోవాతో లైవ్ జూమ్ ఇంటర్వ్యూ మధ్యలో ఉండగా, ఆమె కుమారుడు గదిలోకి వచ్చి, బ్యాక్‌గ్రౌండ్‌లో వింత ఆకారంలో ఉన్న క్యారెట్‌ను ఊపడం ప్రారంభించాడు.ఈ వీడియో కూడా వైరల్ అయింది.

Also Read: Viral Video: వాహనం కింద పడబోయిన బాలుడు.. రక్షించిన పారిశుధ్య కార్మికుడు.. వీడియో సోషల్ మీడియాలో వైరల్

Viral Video: ‘కాశ్మీరీ పులావ్’లో కాశ్మీర్ ఉంటుందా.. ప్రశ్నించిన చాహల్‌ భార్య..! ఎందుకో తెలుసా?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu