Viral Video: ‘కాశ్మీరీ పులావ్’లో కాశ్మీర్ ఉంటుందా.. ప్రశ్నించిన చాహల్ భార్య..! ఎందుకో తెలుసా?
భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి ఓ సరదా వీడియోను పంచుకున్నాడు.
Viral Video: నెట్టింట్లో సెలబ్రిటీల వీడియోలు ఫుల్ వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి ఓ సరదా వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియోలో ఏముందంటే.. చాహల్ కోసం అతని భార్య ధనశ్రీ వర్మ ఆలు పరోటా తీసుకొస్తుంది. అయితే ప్లేట్‌ను చేతులోకి తీసుకున్న చాహల్.. ఆలు పరోటాలో బంగాళాదుంపలు కనిపించడం లేదంటూ సరదాగా అడుగుతాడు.
దీంతో చాహల్ భార్య కూడా ఫన్నీగా సమధానం ఇస్తుంది. ‘కాశ్మీరీ పులావ్’ లో కాశ్మీర్ ఉంటుందా ఏంటి.. అలాగే బెనారసీ చీరలో ‘బెనారస్’ ను చూస్తామా అంటూ ప్రశ్నిస్తుంది. ఆమె సమాధానంతో షాక్ తిన్న చాహల్.. కింద పడిపోతాడు.
ఈ వీడియోకు చాహల్ సహచర క్రికెటర్లు కూడా కామెంట్లు పంచుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ స్మైల్ ఎమోజీలను అందించాడు.
View this post on Instagram
Also Read: Viral Video: పిల్లితో చిరుత పోరాటం.. గెలుపెవరిదో తెలుసా..? నెట్టింట్లో సందడి చేస్తోన్న వీడియో
Wipes Shoes Video: భక్తుల బూట్లు తుడిచిన మాజీ సీఎం..! వైరల్ అవుతున్న వీడియో..