Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ దిల్‌ ఖుష్‌ దోశను చూస్తేనే మది ఖుషీ అయిపోతుంది.. ఇంతకీ దీన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా.?

Viral Video: రుచికరమైన ఆహారానికి అందరూ ఫ్యాన్స్‌ ఉంటారు. రకరకాల రుచులను టేస్ట్‌ చేయడం కొందరికి హాబీ. ముఖ్యంగా రోడ్డు పక్కన బండ్లపై లభించే స్ట్రీట్‌ ఫుడ్‌..

Viral Video: ఈ దిల్‌ ఖుష్‌ దోశను చూస్తేనే మది ఖుషీ అయిపోతుంది.. ఇంతకీ దీన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా.?
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 06, 2021 | 8:47 PM

Viral Video: రుచికరమైన ఆహారానికి అందరూ ఫ్యాన్స్‌ ఉంటారు. రకరకాల రుచులను టేస్ట్‌ చేయడం కొందరికి హాబీ. ముఖ్యంగా రోడ్డు పక్కన బండ్లపై లభించే స్ట్రీట్‌ ఫుడ్‌ చాలా టేస్టీగా ఉంటాయి. వినియోగదారులను ఆకర్షించే క్రమంలో వంటకాలను కొత్తగా ట్రై చేస్తుంటారు. ఇందుకోసం కొత్త కొత్త రెసిపీలను తయారు చేస్తారు. కొన్నిసార్లు ఈ వంటకాలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వంటకం తయారీ నెట్టింట వైరల్‌గా మారుతోంది. దిల్‌ ఖుష్‌ దోశ పేరుతో తయారు చేసిన ఈ వీడియో తయారీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంతకీ ఈ దిల్‌ ఖుష్‌ దోశను ఎలా తయారు చేస్తారంటే.. ముందుగా దోశకు అవసరమైన పిండిని తీసుకొని పెనంపై వేయాలి అనంతరం సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, మిర్చి, క్యాబేజీ, కొబ్బరితో చేసిన చట్నీ, తురిమిన పన్నీర్‌ను వేయాలి. ఇక తర్వాత కిస్‌మిస్‌, జీడిపప్పు, జీరా పౌడర్‌, గరం మసాలా పౌడర్‌ వేసిన మొత్తాన్ని బాగా కలపాలి. తర్వాత పేస్ట్‌లా మారిన దానిపై ఓ ప్లేట్‌ను కాసేపు పెట్టి.. అనంతరం ఆ పేస్ట్‌ను దోశ మొత్తం రుద్దేయాలి.

చివరిగా  పై నుంచి తురిమిన చీజ్‌, చెర్రీలను వేయాలి. అంతే ఎంతో రుచికరమైన దుల్‌ ఖుష్‌ దోశ రడీ అయినట్లే. ఇన్ని రకాల రుచికరమైన పదార్థాలు వేసిన తర్వాత ఈ దోశ మాములు రుచి ఉంటుందా చెప్పండి.. నిజంగానే టేస్ట్‌ చూసే మది ఖుషీ కావాల్సిందే. మరి దిల్‌ ఖుష్‌ దోశ తయారీ విధానాన్ని ఓసారి చూసేయండి.

Also Read: Ganesh Chaturthi: సంచలన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. గణేష్ ఉత్సవాలతో సహా అన్ని వేడుకలపై ఆంక్షలు

EPF: మీరు ఉద్యోగం మారారా? మీ పీఎఫ్ ఎకౌంట్ ను ఆన్‌లైన్‌లో బదిలీ చేయవచ్చు.. ఎలాగంటే..

Ramgopal Varma: ఆషు రెడ్డితో వర్మ చెంపదెబ్బ తినడానికి కారణమేంటో తెలుసా.? ఆర్జీవీ చెప్పిన సమాధానం వింటే..