Ramgopal Varma: ఆషు రెడ్డితో వర్మ చెంపదెబ్బ తినడానికి కారణమేంటో తెలుసా.? ఆర్జీవీ చెప్పిన సమాధానం వింటే..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Sep 06, 2021 | 9:03 PM

Ramgopal Varma: రామ్‌గోపాల్‌ వర్మ.. సంచలనాలకు కేంద్ర బిందువు. నిత్యం కాంట్రవర్సీలతో సావాసం చేసే వర్మ వార్తలో నిలిచేలా చూసుకుంటారు. మొన్నటి వరకు...

Ramgopal Varma: ఆషు రెడ్డితో వర్మ చెంపదెబ్బ తినడానికి కారణమేంటో తెలుసా.? ఆర్జీవీ చెప్పిన సమాధానం వింటే..

Ramgopal Varma: రామ్‌గోపాల్‌ వర్మ.. సంచలనాలకు కేంద్ర బిందువు. నిత్యం కాంట్రవర్సీలతో సావాసం చేసే వర్మ వార్తలో నిలిచేలా చూసుకుంటారు. మొన్నటి వరకు సినిమాలతో సంచలనాలు సృష్టించిన వర్మ ఇప్పుడు ఇంటర్వ్యూలతో రచ్చ చేస్తున్నాడు. ఇటీవల బిగ్‌బాస్‌ ఫేమ్‌ అరియానాతో మొదలైన వర్మ ఇంటర్వ్యూ సిరీస్‌ ఇప్పుడు మరో బిగ్‌బాస్‌ ఫేమ్‌ నటి ఆషు రెడ్డికి చేరింది. వర్మ ఇటీవల ఆషు రెడ్డితో ఓ ఇంటర్వ్యూను ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూను ప్రమోట్‌ చేసుకునే క్రమంలో వర్మ వేసిన స్కెచ్‌ నెట్టింట రచ్చకు దారి తీసింది. కాఫీ షాపులో కూర్చున్న ఆషురెడ్డిని ఓ కామెంట్‌ చేయగానే ఆషు రెడ్డి వర్మ చెంప చెల్లుమనిపించింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే వర్మ – ఆషు రెడ్డిల పూర్తి ఇంటర్వ్యూ మంగళవారం నుంచి ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే వర్మ తాజాగా మరో ప్రమోషనల్‌ వీడియోను రిలీజ్‌ చేశాడు. తనను అనకూడని మాట అనడంతో రియాక్ట్‌ అయిన ఆషు రెడ్డి.. ఒక అమ్మాయితో అలా ఎలా మాట్లాడుతారు? అంటుంది.. దీనికి వర్మ స్పందిస్తూ.. ‘మీ చేతి స్పర్శ తగాలాలనే నా కోరిక నెరవేరింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ప్రోమోను వర్మ ట్వీట్ చేయడంతో నెటిజన్లు స్పందిస్తూ.. ‘వర్మ పిచ్చికి హద్దులు లేవు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Jeevita Rajasekhar: ఎక్కడ ఏమి జరిగినా చిరు-రాజశేఖర్‌లు అంటారు.. అదంతా గతం అంటున్న జీవితారాజశేఖర్

తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి ప్రతాపానికి బ్రిడ్జ్‌లు సైతం కొట్టుకుపోతున్నాయ్.. వాగులు దాటుతున్న క్రమంలో ప్రాణాలు పోతున్నాయ్..

Viral Video: ‘కాశ్మీరీ పులావ్’లో కాశ్మీర్ ఉంటుందా.. ప్రశ్నించిన చాహల్‌ భార్య..! ఎందుకో తెలుసా?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu