తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి ప్రతాపానికి బ్రిడ్జ్‌లు సైతం కొట్టుకుపోతున్నాయ్.. వాగులు దాటుతున్న క్రమంలో ప్రాణాలు పోతున్నాయ్..
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు.. వరద నీరు బీభత్సం సృష్టిస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లడమే కాకుండా.. బ్రిడ్జ్‌లు సైతం కొట్టుకుపోతున్నాయి.
Telugu States Rains: తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు.. వరద నీరు బీభత్సం సృష్టిస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లడమే కాకుండా.. బ్రిడ్జ్‌లు సైతం కొట్టుకుపోతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాగు దాటుతున్న క్రమంలో కొట్టుకుపోతున్నారు. ప్రాణాలు సైతం పోతున్నాయి.
వాహనాలు పంటకాలువలోకి దూసుకుపోతున్న ఉదంతాలు, డివైడర్లను ఢీకొని.. కార్లు కాలువల్లో పడిపోయిన ఘటనలు గత ఐదు రోజులుగా నిత్యకృత్యాలయ్యాయి. ఇలా కోట్టుకుపోతున్న కారులో నుండి ఇద్దరిని రక్షించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో జరిగింది.
మరో చోట.. వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం గిర్నిబావి-నాచినపల్లి మధ్య ఈదుల చెరువు మత్తడిలో వెంకట్ రెడ్డి అనే వ్యక్తి గల్లంతయ్యాడు. వరదలో కొట్టుకుపోయిన వెంకటరెట్టి మృతదేహాన్ని వెలికితీశారు గ్రామస్థులు.
ఇంకోచోట.. వాగు ఉప్పొంగి కల్వర్టుపై నుండి ఉధృతిగా ప్రవహిస్తోంది వరదనీరు. వరద ఉధృతికి బైక్‌తో సహా కొట్టుకుపోయాడు నరేష్ అనే వ్యక్తి.. కొంత దూరం కొట్టుకపోయిన తర్వాత గమనించిన స్థానికులు. తాడు సహాయంతో ఓడ్డుకు చేర్చి ప్రాణాలు దక్కించారు.
Read also: Jayalalitha: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఎస్టేట్‌లో దోపిడీ, హత్య కేసులో మళ్లీ సంచలన విషయాలు