AP Corona Cases: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎంతమందికి వైరస్ సోకిందంటే..?
ఏపీలో కరోనా కేసులు గడిచిన 24గంటల వ్యవధిలో గణనీయంగా తగ్గాయి. రాష్ట్రం లో గత 24 గం టల్లో 43,594 సాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 739 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.
Andhra Pradesh Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గడిచిన 24గంటల వ్యవధిలో గణనీయంగా తగ్గాయి. రాష్ట్రం లో గత 24 గం టల్లో 43,594 సాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 739 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్దారణ అయ్యినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాక వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 2,0,22,064 కు చేరుకుంది. అయితే, ఒక్కరోజు వ్యవధిలో మరో 14 మంది కరోనా బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. కాగా, గత 24 గంటల్లో వైరస్ నుంచి 1,333 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,93,589 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
ఇక, రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 13,925కు చేరింది. నేటి వరకు రాష్ట్రం లో 2,69,82,681 సాంపిల్స్‌ను పరీక్షించడం జరిగింది. ఈమేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం రోజున విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..
Read Also…
CM KCR: కేంద్రమంత్రితో సీఎం కేసీఆర్ కీలక భేటీ.. హైవేల విస్తరణ.. కొత్త లైన్ల మంజూరుపై ప్రతిపాదనలు
Childhood Photo: రజనీకాంత్ , శ్రీదేవిలతో నటించిన ఈ బాలుడు ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా