Childhood Photo: రజనీకాంత్ , శ్రీదేవిలతో నటించిన ఈ బాలుడు ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా

Surya Kala

Surya Kala |

Updated on: Sep 06, 2021 | 5:53 PM

Childhood Photo: బాల్యం ఎవరికైనా మధురమే.. చిన్నతనాన్ని.. బాల్యంలోని తీపి గుర్తులు.. అప్పటి ఫోటోలు ఎవరికైనా అపురూపమే.. దీంతో సామాన్యులైనా, సెలబ్రెటీలైనా చిన్నతనంలో ఫోటోలను..

Childhood Photo: రజనీకాంత్ , శ్రీదేవిలతో నటించిన ఈ బాలుడు ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా
Childhood Pic

Childhood Photo: బాల్యం ఎవరికైనా మధురమే.. చిన్నతనాన్ని.. బాల్యంలోని తీపి గుర్తులు.. అప్పటి ఫోటోలు ఎవరికైనా అపురూపమే.. దీంతో సామాన్యులైనా, సెలబ్రెటీలైనా చిన్నతనంలో ఫోటోలను చూసినప్పుడు.. అవి తీసిన సమయంలో జరిగిన సంఘటనలను ఎంతో ఇష్టంగా అందరితోనూ పంచుకుంటారు. ఆ ఫోటోలను చూస్తూ.. అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. చిన్నతనంలోని ఫోటోలను ఎంతో ఇష్టంగా దాచుకుంటారు. అయితే కొంతమంది బాలనటులుగా వెండి తెరపై అడుగు పెట్టి.. కాలక్రమంలో హీరోలు, హీరోయిన్లుగా అలరిస్తుంటారు. ఒకొక్కసారి సెలబ్రెటీల చిన్నతనంలో ఫోటోలే కాదు.. వారు నటించిన బాల్యంలోని ఫోటోలు బయటకు వస్తే చాలు.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. వీరి ఎవరో గుర్తు పట్టారా అంటూ మన బుర్రకు పదును పెట్టేలా ప్రశ్నలు వేస్తుంటారు. అటువంటి ఫోటో ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఉన్న ఒక బాలుడు. ఈ బాలుడు ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరో గుర్తు పట్టారా అంటూ సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. అవును మరి సిని యాక్టర్స్ కు ఉండే క్రేజ్ అలాంటిదిమరి..

సూపర్ స్టార్ రజనీకాంత్ సామాన్యుడిగా వెండి తెరపై అడుగు పెట్టి.. స్వయంకృషితో చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ.. తనదైన మ్యానరిజంతో స్టార్ హీరోగా అభిమానులను అలరిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, ఇంగ్లిష్ ఇలా అనేక భాషల్లో నటించిన ఈ భాషా హిందీ సినిమాల్లో డైరెక్ట్ హీరోగా కూడా నటించారు. అలా రజని కాంత్ హీరో హిందీ లో నటించిన సినిమా భగవాన్ దాదా. 1986 లో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత రాకేష్ రోషన్ నటించి నిర్మించారు. ఈ సినిమాలో రజనీకాంత్ దత్తత కుమారుడుగా 12 ఏళ్ల కుర్రాడు నటించాడు. ఆ బాలుడు ఎవరో కాదు రాకేష్ రోషన్ తనయుడు క్రిష్ సినిమా హీరో హృతిక్ రోషన్. శ్రీదేవి, టీనా తదితరులు నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది.

Rajani Movie

Rajani Movie

Also Read: Nipah Virus: కేరళలో నిఫా వైరస్.. అప్రమత్తమైన తమిళనాడు సర్కార్.. సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu