Saira Banu: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీనియర్ నటి సైరాబాను.. ఆనందం వ్యక్తం చేస్తున్న అభిమానులు..
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సైరా బాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ ఫైజల్ ఫారూఖీ అతని ట్విటర్ అకౌంట్ ద్వారా
Saira Banu: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సైరా బాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ ఫైజల్ ఫారూఖీ అతని ట్విటర్ అకౌంట్ ద్వారా ఆమె అభిమానులతో పంచుకున్నాడు. కాగా 77 ఏళ్ల నటి సైరా బాను ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఆగస్టు 28న ముంబైలోని హిందుజ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన మూడు రోజుల తర్వాత ఊపిరితిత్తుల సమస్య తీవ్రంగా ఉండడంతో ఆమెను ఐసీయూలోకి మార్చారు. తాజాగా ఆమె ఆరోగ్యం కుదుటపడడంతో డిశ్చార్జి చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఫారుఖీ ఈ విషయం గురించి తెలుపుతూ.. “సైరా బానుజీ ఇంటికి వచ్చేశారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. విశ్రాంతి తీసుకుంటున్నారు. మీ ప్రేమ, ప్రార్థన వల్లే ఆమె కోలుకున్నారు” అని నటి అభిమానులను ఉద్దేశించి ఫైజల్ ఫారూఖీ పోస్ట్‌లో హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు సైరా బాను గుండె జబ్బుతో తీవ్రమైన కరోనరీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు, నిర్ధారణ తర్వాత కరోనరీ ఆంజియోగ్రామ్ చేయించుకోమని సూచించగా నటి నిరాకరించినట్లు ఆసుపత్రి వైద్యుడు ఒకరు మీడియా ఏజెన్సీకి తెలిపాడు.
సైరాబాను భర్త, బాలీవుడ్ స్టార్ దీలిప్ కుమార్ 98 ఏళ్ల వయసులో మరణించిన విషయం అందరికి తెలిసిందే. ఆయన కూడా ఊపిరి అందక అదే హిందుజా హిస్పిటల్‌లో చేరి, అనంతరం జూలై 7న తుదిశ్వాస విడిచారు. ఈ రియల్ లైఫ్ కపుల్ సగిన, గోపి, బైరాగ్, దునియా వంటి హిట్ సినిమాల్లో కలిసి నటించారు. కాగా, ఆమె దివంగత బాలీవుడ్ నటుడు షామ్మీ కపూర్ హీరోగా నటించిన జంగ్లీ సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యారు. అనంతరం ఆమె పదోసన్, హేరా పేరి, దివానా.
మరిన్ని ఇక్కడ చదవండి :
Jr. NTR: తారక్ అన్ని కార్లపై 9 నంబర్లే ఉండటానికి గల కారణం తెలుసా..
Bigg Boss 5 telugu: వెండితెరపై మెరిసిన ముద్దుగుమ్మ.. ఈ గేమ్ షోలో ఆకట్టుకోగలదా ?..