Katrina Kaif: చెమటలు పట్టిస్తున్న కత్రినా..! రిహార్సల్‌ చూస్తే ఫిదా కావాల్సిందే.. వీడియో మామూలుగా లేదుగా..

uppula Raju

uppula Raju |

Updated on: Sep 06, 2021 | 12:26 PM

Katrina Kaif: ప్రస్తుతం కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్‌తో కలిసి టైగర్ 3 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. టర్కీలో షూటింగ్ నడుస్తోంది. ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన

Katrina Kaif: చెమటలు పట్టిస్తున్న కత్రినా..! రిహార్సల్‌ చూస్తే ఫిదా కావాల్సిందే.. వీడియో మామూలుగా లేదుగా..
Katrina Tiger 3

Katrina Kaif: ప్రస్తుతం కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్‌తో కలిసి టైగర్ 3 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. టర్కీలో షూటింగ్ నడుస్తోంది. ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా కత్రినా కైఫ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో కొరియోగ్రాఫర్‌తో కలిసి కొన్ని స్టెప్పులు వేసింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కత్రినా తెల్లని టాప్, బ్లాక్ లోయర్ ధరించి కొరియోగ్రాఫర్స్‌తో డ్యాన్స్ చేస్తుంది.

ఈ సమయంలో ఆమె చాలా ఎంజాయ్‌ చేయడం మనం గమనించవచ్చు. వీడియోను షేర్ చేస్తూ కత్రినా టర్కీ కూడా నృత్యానికి చోటు కల్పించిందని క్యాప్షన్ రాసింది. కత్రినా, సల్మాన్ ఇటీవల టర్కీ మంత్రిని కూడా కలవడం విశేషం. అతడితో కలిసి ఫొటోలు దిగారు. ఈ సినిమాలో సల్మాన్ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు, కత్రినా ఐఎస్ఐ ఏజెంట్ జోయా పాత్రలో నటించనుంది. మనీష్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రాన్ని యష్ రాజ్ నిర్మాణ సంస్థ కింద నిర్మిస్తున్నారు.

దీనికి ముందు ఈ ఫ్రాంచైజీ మొదటి చిత్రం ఏక్ థా టైగర్. ఈ సినిమా 2012 లో విడుదలైంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది.2017 లో అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన టైగర్ జిందా హై విడుదలైంది. ఫ్రాంఛైజీ మూడు సినిమాలకు వేర్వేరు దర్శకులు దర్శకత్వం వహించారు. టైగర్ 3 మూవీలో కత్రినా, సల్మాన్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ దీనిగురించి ఇమ్రాన్ ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. కానీ త్వరలోనే ఇమ్రాన్ ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అనే విషయం తేలిపోతుంది.

Kriti Sanon: మీడియా‌పై మండిపడ్డ బాలీవుడ్ బ్యూటీ.. అమ్మడి కోపానికి కారణం ఏంటో తెలుసా..

Heart Attack: గుండెపోటు రాకుండా ఉండాలంటే కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోండి..! లేదంటే చాలా కష్టం..

Bigg Boss 5 Telugu: అప్పుడే బిగ్‏బాస్ హౌస్‏లో డ్రీమ్ గళ్‏ను వెతుక్కునే పనిలో సన్నీ.. ఆ ఇద్దరితో..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu