Kriti Sanon: మీడియా‌పై మండిపడ్డ బాలీవుడ్ బ్యూటీ.. అమ్మడి కోపానికి కారణం ఏంటో తెలుసా..

Rajeev Rayala

Rajeev Rayala | Edited By: Team Veegam

Updated on: Sep 06, 2021 | 12:37 PM

కొంతమంది సినిమాతారలు కెమెరా కనిపించగానే అందమైన ఫోజులు ఇస్తూ కనిపిస్తారు. ఇక మీడియా కూడా సెలబ్రెటీలు కనిపించగానే కెమెరాలతో క్లిక్ మనిపించాలని..

Kriti Sanon: మీడియా‌పై మండిపడ్డ బాలీవుడ్ బ్యూటీ.. అమ్మడి కోపానికి కారణం ఏంటో తెలుసా..
Kriti Sanon

Follow us on

Kriti Sanon: కొంతమంది సినిమాతారలు కెమెరా కనిపించగానే అందమైన ఫోజులు ఇస్తూ కనిపిస్తారు. ఇక మీడియా కూడా సెలబ్రెటీలు కనిపించగానే కెమెరాలతో క్లిక్ మనిపించాలని ప్రయత్నిస్తుంటారు. అయితే కొంతమంది చేసే ఓవర్ యాక్షన్ కారణంగా అప్పుడప్పుడు అసహనాన్ని వ్యక్తం చేస్తుంటారు సినిమా తారలు. తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీ కూడా మీడియా పై విరుచుకుపడింది. తనని ఫోటోలు తీస్తున్న వారి పై హీరోయిన్ ఫైర్ అయ్యింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..

అందం అభినయం తో కుర్రకారుని కట్టిపడేసే అందాల భామ కృతిసనన్ కు కోపం వచ్చింది. చిర్రెత్తుకొచ్చి మీడియా పై చిర్రుబుర్రులాడింది. ఇటీవల బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ సిద్దార్థ్ శుక్లా అకస్మాత్తుగా కన్నుమూసిన విషయం తెలిసిందే. 40 ఏళ్ల సిద్దార్థ్ శుక్లా హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. ఆయన మరణవార్త విని బాలీవూడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. సినిమా తారలంతా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా సిద్దార్థ్ శుక్లా అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు బాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. వారితోపాటు కృతిసనన్ కూడా అక్కడకు వెళ్లారు.

అయితే కృతి సనన్ వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న మీడియా ఆమె పై ఒక్కసారిగా ఫోటోల వర్షం కురిపించారు. మైకులతో మీద పడ్డారట. దాంతో కృతిసనన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చావు వద్దకు వెళ్లిన సమయంలో మీడియా  అత్యుత్సాహం చూపించడం కరెక్ట్ కాదు అని అంది. ఆ విషయమై కృతి స్పందిస్తూ.. మీడియా హద్దుల్లో ఉండాలి. తమకు తాము హద్దులు పెట్టుకుని ఉండాలి. అంత్యక్రియలు వార్త కాదు.. వినోదం అంతకంటే కాదు. దయచేసి అలాంటివి కవర్ చేసేందుకు ప్రయత్నించడం మానుకోండి. బాధల్లో ఉన్న వారి మొహాల్లో కెమెరా ఫ్లాష్ పెట్టి ఫోటోలు తీయడం.. మాట్లాడించేందుకు ప్రయత్నించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదంటూ అసహనం వ్యక్తం చేసింది కృతి సనన్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jr. NTR: తారక్ అన్ని కార్లపై 9 నంబర్లే ఉండటానికి గల కారణం తెలుసా..

Bigg Boss 5 telugu: వెండితెరపై మెరిసిన ముద్దుగుమ్మ.. ఈ గేమ్ షోలో ఆకట్టుకోగలదా ?..

Ajith: సరిహద్దులు దాటిన ప్రేమ.. స్టార్ హీరో‏పై వీరాభిమానం.. బహుమతులను చూస్తే షాకవ్వాల్సిందే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu