Bigg Boss 5 telugu: వెండితెరపై మెరిసిన ముద్దుగుమ్మ.. ఈ గేమ్ షోలో ఆకట్టుకోగలదా ?..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 06, 2021 | 9:38 AM

బిగ్‏బాస్ సీజన్ 5 గ్రాండ్‏గా ప్రారంభమైంది. ఫుల్ జోష్‏తో తనయుడి పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. ఆ తర్వాత

Bigg Boss 5 telugu: వెండితెరపై మెరిసిన ముద్దుగుమ్మ.. ఈ గేమ్ షోలో ఆకట్టుకోగలదా ?..
7 కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది నటి ప్రియా. ప్రియా పలు సినిమాలు, సీరియల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బిగ్‏బాస్ సీజన్ 5 గ్రాండ్‏గా ప్రారంభమైంది. ఫుల్ జోష్‏తో తనయుడి పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. ఆ తర్వాత బిగ్‏బాస్ కోరిక మేరకు మాస్ స్టెప్పులను కూడా వేశారు నాగార్జున. మాసు మరణం అంటూ దుమ్ములేపారు. పంచేంద్రియాలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు అంటూ బిగ్ బాస్ ఐదో సీజన్ గురించి బాగానే ప్రమోషన్ చేశారు నాగ్. ఇంద్రుడికి వెయ్యి కళ్లు.. బిగ్ బాస్ 70కి కళ్లు, కెమెరాలున్నాయని నాగ్ అన్నారు. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపే పనిలో పడిపోయారు. సిరి, సన్నీ, నటి లహరి, శ్రీరామ చంద్ర, యానీ మాస్టర్, లోబో గ్రాండ్‏గా ఎంట్రీ ఇచ్చారు. ఇక అంతా అనుకున్నట్లుగానే ఏడో కంటెస్టెంట్‏గా నటి ప్రియ ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే నత జీవితం గురించి పరోక్షంగా చెప్పేశారు. ఒంటరి జీవితం, తన సంతానం గురించి ఇలాప్రతీ ఒక్క విషయం గురించి చెప్పి ఎమోషనల్‌గా టచ్ చేశారు. ఇక బిగ్ బాస్ ఎంట్రీ అనేది తనకు సెకండ్ ఇన్నింగ్స్ అవ్వాలని ప్రియా కోరుకున్నారు.

నటి ప్రియకు సోషల్ మీడియాలో ఇప్పుడే మద్దతు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆమెకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తు.. తమ మద్దతు ఈమెకే అన్నట్లుగా పరోక్షంగా హింట్ ఇస్తున్నారు. బుల్లితెరపై బుల్లితెరపై లేడీ డిటెక్టివ్, కొత్త బంగారం, మానస, చిన్న కోడలు, శశిరేఖ పరిణయం, నెంబర్ వన్ కోడలు వంటి సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియ. అలాగే వెండితెరపై ఎన్నో చిత్రాల్లో నటించారు. 1998లో వచ్చిన మాస్టర్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది ప్రియ. ఈమె అసలు పేరు మామిళ్ల శైలజ ప్రియ. కెరీర్ మొదట్లో లీడ్ రోల్స్ చేసిన ప్రియ.. దాదాపు 60 సినిమాల్లో నటించింది. దాదాపు 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. 2002లో కిషోర్‌ను పెళ్లాడిన ఆమెకు నిశ్చయ్‌ అనే కుమారుడున్నాడు. అటు వెండితెరపై, బుల్లితెరపై నటిగా సక్సెస్ అందుకున్న ప్రియ.. ఈ రియాల్టీ షోలో జనాలను ఆకట్టుకుంటుందో ? లేదో ? చూడాలి.

Also Read: Bigg Boss 5 Telugu: హుషారైన మాటలతో.. చలాకీ తనంతో హౌస్‌లో హడావిడి చేసేస్తున్న భామ..

Kangana Ranaut : నాకు తమిళం గురించి కానీ.. ఇక్కడి రాజకీయాల గురించి కానీ ఏం తెలియదు.. ఆసక్తికర కామెట్స్ చేసిన కంగన

Aditi Shankar: హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ డైరెక్టర్ కూతురు.. కార్తీకి జోడిగా అదితి శంకర్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu