Aditi Shankar: హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ డైరెక్టర్ కూతురు.. కార్తీకి జోడిగా అదితి శంకర్..

స్టార్ హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూతుర్లు సినీ రంగ ప్రవేశం చేసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు.

Aditi Shankar: హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ డైరెక్టర్ కూతురు.. కార్తీకి జోడిగా అదితి శంకర్..
Aditi Shankar
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 06, 2021 | 9:02 AM

స్టార్ హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూతుర్లు సినీ రంగ ప్రవేశం చేసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. శ్రుతి హాసన్, నిహారిక వంటి వారు హీరోయిన్స్‏గా నటించి ప్రశంసలు అందుకున్నారు. అందం, అభినయంతో… ఫిల్మ్ ఇండస్ట్రీలో తమకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్చుకున్నారు. ఇక ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల కూడా ప్రొడ్యూసర్‏గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టార్ డైరెక్టర్ కూతురు హీరోయిన్‏గా మారబోతుంది. తమిళ్ స్టార్ హీరో కార్తి ప్రధాన పాత్రలో డైరెక్టర్ ముత్తయ్య దర్శకత్వంలో విరుమన్‌ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై హీరో సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇందులో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్‎గా నటిస్తోంది. ఈ విషయాన్ని సూర్య అధికారికంగా ప్రకటించారు.

అదితి శంకర్‏కు స్వాగతం. ప్రతి ఒక్కరి హృదయాలను నువ్వు గెలుచుకుంటావు అంటూ ట్వీట్ చేశారు సూర్య. ఈ మూవీలోని అదితీ లుక్‏ను రివీల్ చేశారు చిత్రయూనిట్. అందులో అదితి పసుపు, ఆకుపచ్చ పరికిణిలో నవ్వుతూ వస్తూ కనిపిస్తున్న లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 18న ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. అలాగే ఈ సినిమాల కార్తీతో పాటు రాజ్ కిరణ్ కూడా కనిపించబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో కొంబన్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కాబోతుండడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

ట్వీట్..

Also Read: Karthik Deepam: నిజాలు తవ్వే పనిలో రోషిణి.. కార్తీక్ తో పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేసిన మోనిత!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ వేదిక పై మెరిసిన అందం.. ముద్దుగుమ్మ సిరి గురించి మీకు తెలుసా..?

Viral Video: 90 నిమిషాల పోరాటం.. ముళ్ల పందిని వేటాడబోయిన చిరుత.. కట్ చేస్తే.!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!