Karthik Deepam: నిజాలు తవ్వే పనిలో రోషిణి.. కార్తీక్‌తో పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేసిన మోనిత!

ఒక్కోసారి జీవితం ఎటునుంచి ఎటు మారుతుందో చెప్పడం చాలా కష్టం. మంచికి చెడుకూ మధ్య ఉండే సన్నని తేడాను గుర్తించకపోతే వచ్చే అనర్ధాలు పూలపాన్పు లాంటి జీవితాన్ని ముళ్లబాటలో పడేస్తాయి.

Karthik Deepam: నిజాలు తవ్వే పనిలో రోషిణి.. కార్తీక్‌తో పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేసిన మోనిత!
Karthika Deepam Episode 1137

Karthik Deepam: ఒక్కోసారి జీవితం ఎటునుంచి ఎటు మారుతుందో చెప్పడం చాలా కష్టం. మంచికి చెడుకూ మధ్య ఉండే సన్నని తేడాను గుర్తించకపోతే వచ్చే అనర్ధాలు పూలపాన్పు లాంటి జీవితాన్ని ముళ్లబాటలో పడేస్తాయి. ఈ విషయాన్ని చక్కని కథనంతో కళ్ళకు కటినట్టు చూపిస్తోంది కార్తీకదీపం సీరియల్. తెలుగు టీవీ సీరియళ్ళ చరిత్రలో రికార్డులను తిరగరాసిన కుటుంబ కథా ధారావాహిక కార్తీకదీపం. ఆప్యాయతలు.. అనుబంధాలు.. ప్రేమ.. పెళ్లి.. చదువు.. సంస్కారం ఇలా ప్రతి అంశాన్ని సీరియల్ లోని పాత్రల ద్వారా చూపిస్తూ ఇంటిల్లిపాదినీ అలరిస్తోంది కార్తీకదీపం. ఈరోజు కార్తీకదీపం 1137వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. ఇప్పటివరకూ ఏం జరిగింది.. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది తెలుసుకుందాం.

ఎపిసోడ్ 1136లో జరిగింది ఇదీ..

తాను బ్రతికే ఉండి.. కార్తీక్ తనను చంపినట్లు నాటకం ఆడి అతన్ని లాకప్ పాలు చేసింది మోనిత. తరువాత కార్తీక్ కు కడుపునొప్పి వచ్చే మందు టీ లో కలిపి ఇచ్చి.. ఆసుపత్రికి చేరేలా చేసింది. అక్కడ కార్తీక్ దగ్గరకు డాక్టర్ రేణులా వెళ్లి ట్రీట్మెంట్ చేయడం మొదలు పెట్టింది. కార్తీక్ ను తనను పెళ్ళిచేసుకోమని బెదిరింపులు ప్రారంభించింది. కార్తీక్ పెళ్లి చేసుకోకపోతే, అతని కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తూ వస్తోంది. దీంతో కార్తీక్ టెన్షన్ పడుతుంటాడు. దీప కార్తీక్ ఎందుకు టెన్షన్ పడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు పిల్లలు కార్తీక్ ఎప్పుడు ఇంటికి వస్తారు అంటూ గొడవ చేస్తుంటారు. ఈలోపు మోనిత కార్తీక్ ను బెదిరించి, భయపెట్టడం కోసం కార్తీక్ తమ్ముడు ఆదిత్య బైక్ మీద వస్తుంటే, ఎక్సిడెంట్ జరిగేలా చూస్తుంది. దీంతో ఆదిత్యకు గట్టిగ దెబ్బలు తగులుతాయి. ఈ విషయం కార్తీక్ కు ఫోన్ చేసి చెప్పిన మోనిత ఈసారి దెబ్బలతో సరిపెట్టాను. నువ్వు నన్ను పెళ్లిచేసుకోవడానికి ఒప్పుకోకపోతే, ఆదిత్యను చంపేస్తాను అని బెదిరిస్తుంది. ఆ ఫోన్ మాట్లాడుతున్నపుడు చూసిన దీప కార్తీక్ మానసిక స్థితి బాలేదని బాధపడుతుంది.
ఇంటికి వచ్చిన దీపకు ఆదిత్య దెబ్బలతో ఉండడం కనిపిస్తుంది. కంగారు పడుతుంది. ఈలోపు పిల్లలు ఏడుస్తూ దీపను చుట్టేసి బాబాయ్ కి ఎలా దెబ్బలు తగిలాయో అని బాధపడతారు. హెల్మెట్ ఉండడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది అనీ, చిన్న దెబ్బలే అనీ శ్రావ్య చెబుతుంది. ఆనందరావు ”లాయర్ గారు బెయిల్ గురించి ఏమన్నారు?” అంటూ ఆదిత్యను ప్రశ్నిస్తాడు. అయితే, అక్కడ పిల్లలు ఉండడంతో తాను తరువాత చెబుతాను అని చెబుతాడు ఆదిత్య. ఇదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్ 1136 కథనం. ఈరోజు (ఎపిసోడ్ 1137లో) ఏం జరగబోతోందో తెలుసుకుందాం.

మేము ఏ స్కూలుకూ వెళ్ళం 

ఆదిత్యను పరామర్శిస్తున్న దీప.. ఆనందరావును అత్తయ్య ఫోన్ చేశారా అని అడుగుతుంది. ”ఫోన్ చేసింది అమ్మా.. అక్కడ పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్ లో చేర్చడానికి వీలైన ఏర్పాట్లు చేస్తోంది. రేపు వచ్చేస్తానని చెప్పింది.” అని ఆనందరావు చెబుతాడు. దీంతో పిల్లలు ఇద్దరూ ఒక్కసారిగా ”మేము ఏ స్కూలుకు వెళ్ళం” అని అరుస్తారు. మా డాడీ గురించి మాకేమీ తెలియకూడదని మమ్మల్ని రెసిడెన్షియల్ స్కూల్ కు పంపించేద్దామని చూస్తున్నారు. మేము ఎక్కడికీ వెళ్ళం ఇక్కడే ఉంటాం అంటూ గొడవ చేస్తారు. దీంతో దీప వాళ్ళను కేకలు వేస్తుంది.

పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ 

కార్తీక్ మోనిత విషయం ఆలోచిస్తూ ఉంటాడు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా అని అనుకుంటూ ఉంటాడు. ఈలోపు ఎస్ఐ వచ్చి కార్తీక్ కు ఫోన్ ఇవ్వబోతాడు. ఎవరు అని కార్తీక్ అడుగుతాడు. డాక్టర్ రేణు అని చెబుతాడు ఎస్ఐ. తానూ నిద్రపోతున్నానని చెప్పమంటాడు కార్తీక్. డాక్టర్ ఫోన్ చేస్తే కంగారు పడతారెందుకు? మాట్లాడండి అని చెబుతాడు ఎస్ఐ. దీంతో ఫోన్ తీసుకుంటాడు కార్తీక్. అటునుంచి మోనిత ”ఏమిటి కార్తీక్ ఫోన్ మాట్లాడమంటే అంత కంగారు పడుతున్నావు? ఎస్ఐ కి అనుమానం రాదూ.” అని అడుగుతుంది. తరువాత, ”కార్తీక్ ఒక శుభవార్త చెబుదామని ఫోన్ చేశాను. నేను పంతులుగారితో మాట్లాడను. ఆయన రేపు ఉదయం 11:50 కి మంచి ముహూర్తం ఉందన్నారు మన పెళ్ళికి. ఈ ముహూర్తం మిస్ అయితే, మీ కుటుంబంలో ఒక్కరూ మిగలరని చెప్పారు.” అంటుంది. దానితో కార్తీక్ షాక్ అవుతాడు. అప్పుడు మోనిత ”కంగారు పడకు కార్తీక్.. చివరి మాట నాది.” అంటుంది.

ఇన్నిరోజులు ఆసుపత్రిలో ఎందుకు?

దీప పిల్లల పక్కన పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది. డాక్టర్ బాబు ఎందుకు అంత కంగారుగా ఉన్నారు? ఎప్పుడూ అలా ఉండరు. అయినా..ఆయనకు కడుపునొప్పి మొన్ననే తగ్గిపోయింది ఇప్పటివరకూ ఎందుకు డిశ్చార్జ్ చేయలేదు? అని అనుకుంటుంది. ఈ విషయం రేపు ఉదయమే వెళ్లి రోషిణి మేడంతో మాట్లాడాలని అనుకుంటుంది.

బెయిల్ దొరకదు 

సౌందర్య ఇంటికి వస్తుంది. లోపలకు బెరుకుగా చూసుకుంటూ అడుగుపెడుతుంది. అక్కడ సోఫాలోనే ఆనందరావు నిద్రపోతూ కనిపిస్తాడు. ఆమె అతన్ని నిద్ర లేపుతుంది. ”ఏమిటండీ ఇక్కడే పడుకున్నారు?” అని ప్రశ్నిస్తుంది. రాత్రి నిద్ర పట్టలేదు. 12 గంటల వరకూ ఆదిత్య కూడా ఇక్కడే ఉన్నాడు. ఇక అలా పడుకున్నాను అని ఆనందరావు చెబుతాడు. ఆదిత్య ప్రమాదం గురించి బాధపడిన సౌందర్య.. కార్తీక్ గురించి లాయర్ ఏమన్నారు అని అడుగుతుంది. అతనికి బెయిల్ రావడం కష్టం అని చెప్పారని ఆనందరావు చెబుతాడు. దీంతో ఇద్దరూ కార్తీక్ గురించి బాధపడతారు. ఏమి చేయాలో అని అనుకుంటారు.

ముద్దాయి బంధువులతో మాట్లాడను 

దీప ఏసీపీ రోషిణి వద్దకు వెళుతుంది. అక్కడ ఆమె ”ముద్దాయిని కోర్టుకు తీసుకువెళ్ళేముందు నేను ముద్దాయి తరుపు వారితో మాట్లాడను” అంటుంది. దీంతో దీప ముద్దాయి అని మీరే ముద్ర వేసేస్తున్నారు అని అంటుంది. నేరం ఆయన చేయలేదు అని చెబుతుంది. అది కోర్టు తేలుస్తుంది అని రోషిణి అంటుంది. మేడం.. మోనిత బ్రతికే ఉంది అని చెబుతుంది దీప. ”అది నీ అనుమానమా?” అని అడుగుతుంది రోషిణి. ”కాదు నమ్మకం” అని చెబుతుంది దీప. రోషిణి దీప మాటలు పట్టించుకోకుండా ఏమి చేయాలో నాకు తెలుసు నేను కార్తీక్ ను అరెస్ట్ చేసి ఖాళీగా కూచున్నాను అనుకున్నావా? నా ఎంక్వైరీ నేను చేస్తున్నాను అని చెబుతుంది.

మోనిత కచ్చితంగా బ్రతికే ఉంది 

ఏమి చేస్తున్నారు మేడం ఏమి తేలింది. అవన్నీ పక్కన పెట్టండి మేడం. నాకు ఒక్క విషయం చెప్పండి. కార్తీక్ ఆసుపత్రికి వెళ్ళిన రోజునే ఒక్క ఇంజక్షన్ తో ఆయనకు కడుపు నొప్పి తగ్గిపోయింది. కానీ, మూడు రోజులుగా ఆసుపత్రిలోనే ఉంచారు ఎందుకు? అని అడుగుతుంది. దీంతో కోపం వచ్చిన రోషిణి ”ఫుడ్ పాయిజన్ జరిగినపుడు కడుపులో విషం తగ్గడానికి ఆసుపత్రిలో ఉంచి ట్రీట్మెంట్ చేస్తారు.” అని చెబుతుంది. నువ్వు..మీ అత్తగారు లా పాయింట్స్ తీసి మాట్లాడటం బాగానే నేర్చుకున్నారు అంటుంది రోషిణి. దానికి దీప ”మేడం..నేను ఒక డాక్టర్ భార్యను. ఫుడ్ పాయిజన్ అయితే, ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని నాకు తెలుసు. కానీ, డాక్టర్ బాబుకు ఆరోజు పెట్టిన భోజనం నేను.. పిల్లలు.. మా ఇంట్లో అందరం తిన్నాము. మాకెవరికీ కాని పాయిజన్ ఆయనకు ఎందుకు అయింది. అలాగే, ట్రీట్మెంట్ చేస్తున్నపుడు ఎవరో ఒకరు వచ్చి ఆయనను చూడాలి కదా. మందులు ఇవ్వాలి కదా. ఇప్పటివరకూ ఒక్కరు కూడా ఎందుకు మందులు ఇవ్వడానికి అటువైపు తొంగి చూడలేదు?” అని ప్రశ్నిస్తుంది. దీంతో రోషిణి ఆలోచనలో పడుతుంది. ”మేడం మోనిత బ్రతికే ఉంది. ఆమె బ్రతికి ఉండగానే చనిపోయిందని మీరు కార్తీక్ ను జైలు పాలు చేస్తున్నారు. మీరు న్యాయం ఆలోచించండి. ఒక్కసారి ఆ కోణంలో ఆలోచించండి. ఎందుకంటే, డాక్టర్ బాబు ఆసుపత్రికి వెళ్ళినరోజు టీ పట్టుకుని బసవయ్య కూతురు మూగమ్మాయిగా మోనిత వచ్చింది. మీరు సరిగ్గా ఈ కోణంలో ఆలోచిస్తే మీకు నిజాలు తెలుస్తాయి.” అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీంతో రోషిణి దీర్ఘంగా ఆలోచిస్తుంది.

మా మావయ్య పేరు 

మరోవైపు మోనిత తన పెళ్ళికోసం సింగారించుకుంటూ ఉంటుంది. తన కడుపులోని బిడ్డకు ఆనంద్ అని పేరు పెట్టి పిలుస్తుంది. ఇది మా మావయ్య పేరు. దీప తన కూతురుకు అత్తయ్య పేరు పెట్టుకుని అత్తమ్మా అని పిలుస్తుంది. అలా నేను కూడా నీకు మా మావయ్య పేరు పెట్టుకుని మావయ్యా అని పిలుస్తాను అని అంటుంది.

కార్తీక్ ఎటువంటి వాడు రామ సీతా?

దీప వెళ్లిపోయాకా రోషిణి తీవ్రంగా ఆలోచిస్తుంది. రామసీతను పిలిపిస్తుంది. రామసీత వచ్చి మేడం పిలిచారట అని అడుగుతుంది. రా రామసీతా.. మన స్టేషన్ లో ఏం జరుగుతోంది?” అని అడుగుతుంది. దీంతో కంగారు పడిన రామసీత ఏమీ లేదు మేడం అంటుంది. అవునూ..నువ్వు చనిపోయిన మనిషి తిరిగి రావడం ఎప్పుడైనా చూశావా? అని అడుగుతుంది రోషిణి. లేదు మేడం అని చెబుతుంది రామసీత. దానికి రోషిణి మరి అతను అలా చెబుతాడు ఏమిటి? అంటుంది. ఎవరు మేడం అని రామ సీత ప్రశ్నిస్తుంది. అతనే కార్తీక్. మోనిత బ్రతికే ఉంది. నాకు టీ తెచ్చి ఇచ్చింది. నేను చూశాను అని చెబుతున్నాడు. అది సరే కార్తీక్ కు బసవయ్య కూతురు టీ పట్టుకొచ్చి ఇచ్చిందట నిజమేనా అని ప్రశ్నిస్తుంది రోషిణి. ఏమో మేడం అప్పుడు నేను స్టేషన్ లో లేను. మీతో మోనిత ఆసుపత్రి వద్దకు వచ్చాను. మీరు నన్ను బయటే ఉండమని చెప్పారు. అందుకే నేను జీపు వద్దే ఉండిపోయాను అని చెబుతుంది రామసీత. అలాగా.. అది సరే..కార్తీక్ మంచివాడా? చెడ్డవాడా అని ప్రశ్నిస్తుంది రోషిణి. మంచివాడే మేడం అని సమాధానం చెబుతుంది రామసీత. మరి మంచివాడైతే అబద్ధం ఎందుకు చెబుతాడు. అని అంటుంది. రామసీత తో మాట్లాడుతూ సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తుంది రోషిణి. అందులో ఒకరోజు ఫుటేజ్ కనిపించదు. ఇదేవిషయాన్ని ఆమె రామసీతను అడుగుతుంది. దానికి ఆమె ఆరోజు సీసీ కెమెరాలు అన్నీ ఆపారు మేడం సర్వీసు కోసం అని అంటుంది. ఆరోజే కార్తీక్ కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరాడు కదూ అని ప్రశ్నిస్తుంది రోషిణి. దీంతో రామసీత షాక్ అవుతుంది.

ఇదీ ఈరోజు ఎపిసోడ్ (1137)లో జరిగింది. మోనిత పెళ్లి ముహూర్తం ఏమైంది? రోషిణి నిజం తెలుసుకుందా? దీపకు మోనిత దొరికిందా? రామసీత నిజం చెబుతుందా? ఇవన్నీ తెలియాలంటే.. రేపు ప్రసారం అయ్యే ఎపిసోడ్ 1138 వరకూ వేచి చూడాల్సిందే.

మరిన్ని ‘కార్తీకదీపం’ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Karthik Deepam: వామ్మో మోనిత.. ఇంత క్రూరంగానా.. కార్తీకదీపంలో కొత్త ట్విస్ట్!

Karthika Deepam: మోనితను గుర్తుపట్టిన కార్తీక్..ఎలాగైనా కార్తీక్‌ను విడిపించాలనే ప్రయత్నంలో దీప!

Karthika Deepam: కార్తీకదీపంలో కొత్తమలుపు.. మరో పథకం వేసిన మోనిత.. దీపను నిలదీసిన పిల్లలు.. 

Karthika Depam: సూపర్ ట్విస్ట్.. మోనిత బ్రతికే ఉందని తెలుసుకున్న దీప.. నమ్మని కుటుంబం!

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీపను తుపాకీతో కాల్చిన మోనిత.. గుడిలో కుప్పకూలిన వంటలక్క!

Click on your DTH Provider to Add TV9 Telugu