Karthika Deepam: మోనితను గుర్తుపట్టిన కార్తీక్..ఎలాగైనా కార్తీక్‌ను విడిపించాలనే ప్రయత్నంలో దీప!

ఆత్మీయ బంధాలు..హద్దులు దాటిన స్నేహం..మితిమీరిన అనుమానం..ప్రేమ పిచ్చిగా మరితే వచ్చే అనర్ధం.. అన్నిటినీ కలబోసి ప్రేక్షకులను రంజింప చేస్తున్న సీరియల్ కార్తీకదీపం.

Karthika Deepam: మోనితను గుర్తుపట్టిన కార్తీక్..ఎలాగైనా కార్తీక్‌ను విడిపించాలనే ప్రయత్నంలో దీప!
Karthika Deepam Episode 1121
Follow us
KVD Varma

|

Updated on: Aug 26, 2021 | 8:00 AM

Karthika Deepam: ఆత్మీయ బంధాలు..హద్దులు దాటిన స్నేహం..మితిమీరిన అనుమానం..ప్రేమ పిచ్చిగా మరితే వచ్చే అనర్ధం.. అన్నిటినీ కలబోసి ప్రేక్షకులను రంజింప చేస్తున్న సీరియల్ కార్తీకదీపం. ప్రతిరోజూ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ మరో ఆసక్తికర ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. కార్తీక్ ను పెళ్ళిచేసుకోవాలని పిచ్చి ప్రయత్నాలతో అందరి జీవితాలతోనూ ఆడుకుంటున్న మోనిత ఒకవైపు.. చేయని నేరానికి కటకటాల వెనుకకు చేరిన కార్తీక్ ను విడిపించాలని దీప చేస్తున్న ప్రయత్నాలు మరోవైపు.. కార్తీక్ మోనితను హత్య చేసి శవాన్ని మాయం చేశాడని బలంగా నమ్ముతున్న ఏసీపీ రోషిణి ఇంకోవైపు.. అసలేం జరుగుతుంది అనే ఉత్కంఠను బుల్లితెర ప్రేక్షకుల్లో ప్రతిరోజో రేకెత్తిస్తూ సాగిపోతోంది కార్తీకదీపం. ఈరోజు 1128వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతున్న కార్తీకదీపంలో ఏం జరగబోతోందో తెలుసుకునే ముందు నిన్నటి ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాం.

నిన్నటి ఎపిసోడ్ (1127)లో ఏమైందంటే..

కార్తీక్ ను పెళ్లిచేసుకోవాలంటే దీపను చంపడం ఒకటే మార్గం అని నిర్ణయించుకున్న మోనిత ఎలాగైనా ఆ పని చేయాలని నిర్ణయించుకుంటుంది. సోది చెప్పే ఆమె వేషంలో వెళ్లి రివాల్వర్ తో దీపను కాల్చి చంపాలని ప్రయత్నించి చివరి క్షణాల్లో దీప ముందు బయటపడిపోతుంది. దీంతో అక్కడ నుంచి పారిపోతుంది. దీప ఇంటికి వెళ్లి ఎవరికీ ఈ విషయం చెప్పినా నమ్మరు. మరోవైపు పిల్లలు దీపను తండ్రి కోసం నిలదీస్తారు. ఎవరూ తమ తండ్రి పోలీస్ స్టేషన్ లో ఉంటే పట్టించుకోవడం లేదని అంటారు. దీంతో దీప బాధపడుతుంది. ఇక మోనిత ఇంటిలో కూచుని ఆలోచిస్తుంది. తాను దీపను డైరెక్ట్ గా చంపి దొరికిపోతే.. జైలు తప్పదు. అప్పుడు కార్తీక్ బయటకు వస్తాడు.. తాను జైలులో ఉంటుంది. మరి ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఎలా కుదురుతుంది? అని తనని తాను ప్రశ్నిచుకుంటుంది. దీపను చంపడానికి రెండో ప్లాన్ వేస్తుంది. అందులో భాగంగా కానిస్టేబుల్ రామసీతకు ఫోన్ చేసి ఏం చేయాలో చెబుతుంది. ఆమె రిస్క్ అని చెప్పినా పట్టించుకోకుండా ఇలా చేయాల్సిందే అని చెబుతుంది మోనిత. దీంతో రామసీత కార్తీక్ దగ్గరకు వెళ్లి తాను ఇంటికి వెళుతున్నానని చెబుతుంది. టీ కొట్టులో టీ చెప్పి వెళతాననీ.. టీ కొట్టు అతని కూతురు వచ్చి టీ ఇస్తుందని చెబుతుంది. అంతేకాదు.. టీ తెచ్చే ఆమె మూగది అని కూడా చెప్పి వెళ్ళిపోతుంది. ఇదీ నిన్నటి ఎపిసోడ్ లో జరిగింది. మరి ఈరోజు (ఎపిసోడ్ 1128) ఏమి జరుగుతుందో తెలుసుకుందాం..

దీప మాటలు నమ్మని కార్తీక్ 

పోలీస్ స్టేషన్ వద్దకు మోనిత టీ పట్టుకుని వస్తుంది. గుమ్మంలోనే నుంచిని లాకప్ లో ఉన్న కార్తీక్ ను చూస్తుంది. కార్తీక్ తనతో ఉన్నరోజులను గుర్తుచేసుకుంటుంది. ఈలోపు అక్కడికి దీప వస్తుంది గుమ్మానికి అడ్డంగా ఉన్న మోనితను పక్కకు తప్పుకోమని అంటుంది. దీపను చూసిన మోనిత ”ఏం పతిభక్తే నీది. సరిగ్గా సమయానికి వచ్చేశావ్” అని కసిగా అనుకుంటుంది. టీ తీసుకుని స్టేషన్ లోకి వెళ్లిన మోనిత కార్తీక్ తో దీప ఏమి మాట్లాడుతుందో వింటూ ఉంటుంది. దీప కార్తీక్ కి తనను మోనిత చంపడానికి ప్రయత్నించిందనీ.. ఆమె బ్రతికే ఉందనీ చెబుతుంది. దానికి కార్తీక్ అది కరెక్ట్ కాదు. నువ్వు నన్ను రక్షించాలని ప్రయత్నిస్తూ భ్రమ పడుతున్నావు అంటాడు. దానికి దీప ”అంటే మీరూ నమ్మటం లేదా?” అని అడుగుతుంది. ఇంటిలో ఎవరూ నమ్మలేదు అంటే..వారికీ నీ మానసిక స్థితి తెలిసిఉంటుంది కదా. అందుకని పిచ్చి ఆలోచనలు మానెయ్యి. నీకు ఏదైనా జరిగితే పిల్లలు ఏమైపోతారు అంటాడు కార్తీక్. ”కాదు..మోనిత బ్రతికే ఉంది. తనను ఎలాగైనా సరే పట్టుకుంటాను.” అని దీప కచ్చితంగా చెబుతుంది.

నేనేదైనా చేయగలనని గుర్తించావు 

దీంతో కార్తీక్ దీపను వారిస్తాడు. ”నువ్వు ఒకసారి ఇలా చెప్పా పెట్టకుండా సూర్యాపేట ఒంటరిగా వెళ్లవు. అక్కడ అంజిని మోనిత తుపాకీతో బెదిరించడం చూశావు. అదంతా వీడియో తీశావు. ఆ వీడియో దేనికైనా ఉపయోగపడిందా? నువ్వు ఇటువంటి సాహసాలు చేసి నీకేదైనా అయితే పిల్లలు తల్లీ తండ్రీ ఇద్దరూ లేకపోతే ఎలా ఉంటారు?” అని చెబుతాడు. ఇది విన్న మోనిత ”సరిగ్గా చెప్పావు కార్తీక్. ఇప్పుడు నీకు బాగా అర్ధం అయివుంటుంది. మోనిత తలచుకుంటే ఏదైనా చేస్తుందని నీకు తెలిసింది” అని క్రూరంగా నవ్వుకుంటుంది. టీ తీసుకుని వెళ్లి కార్తీక్ కు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. రామసీత చెప్పింది నీ గురించేనా అని అడుగుతాడు కార్తీక్. అవునన్నట్టు తల ఊపుతుంది మోనిత. తనకు టీ ఇవ్వబోతున్న మోనితను ముందు మేడమ్ కు ఇవ్వు అంటాడు. దాంతో చేతిలో టీ గ్లాస్ కింద వదిలేస్తుంది మోనిత. ఈలోపు అక్కడకు ఎస్ఐ వస్తాడు. ఏయ్.. ఇక్కడ ఏం జరుగుతోంది? నువ్వు ఎవరు అని మోనితను అడుగుతాడు బసవయ్య కదా టీ తెస్తాడు నువ్వు తెచ్చావేమిటి? అంటాడు. ఆమె కంగారు పడుతుంది. దీంతో కార్తీక్ ”ఆమె  బసవయ్య కూతురు. తనకి మాటలు రావు” అని చెబుతాడు. లాకప్ లో ఉన్న నీకే అన్నీ తెల్సిపోతున్నాయి అని ఎస్ఐ కార్తీక్ ను ఎగతాళిగా అంటాడు. నాకు రామసీత చెప్పింది అని చెబుతాడు కార్తీక్. ”ఈ రామసీత ఒకటి.. లాకప్ లో ఉన్నవాడికి సేవలు చేస్తోంది.. ఇద్దరి మధ్యా ఏముందో ఏమిటో అనుకుంటూ వెళ్ళిపోయి.. మోనితను తనకూ టీ ఇమ్మంటాడు.

మోనితను గుర్తుపట్టిన కార్తీక్ 

మోనిత కార్తీక్ కు టీ ఇస్తుంది. ఆ సమయంలో ఆమె వేళ్ళు అతనికి తగులుతాయి. తరువాత మోనిత వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లోపు పగిలిన గ్లాసు పెంకు మోనితకు గుచ్చుకుంటుంది. దీంతో అబ్బా అంటుంది మోనిత. దీంతో కార్తీక్ కు అనుమానం వస్తుంది. మూగ అమ్మాయి అబ్బా అందేమిటి? నీకు వినబడిందా అని దీపను అడుగుతాడు. కానీ, తాను వినలేదని చెబుతుంది దీప. కార్తీక్ వెళుతున్న మోనితను పరీక్షగా చూస్తాడు. ఆమె మోనిత అని గ్రహించేస్తాడు. ఆ స్పర్శ.. నడక.. అంతా మోనితదే అనుకుంటాడు. దీపకు చెప్పాలని అనుకుని మళ్ళీ ఆగిపోతాడు. దీపకు చెబితే ఆమె వెనుక పడి ప్రమాదం తెచ్చుకుంటుందేమో అని అనుకుంటాడు. ఈ విషయాన్ని ఏసీపీ రోషిణికి చెప్పాలని అనుకుంటాడు.

కార్తీక్ మంచివాడు కాదు 

ఏసీపీ రోషిణి మోనిత ఆసుపత్రి వద్దకు వెళుతుంది. అక్కడ మంథా ఫొటోకు దండ వేసి ఉండటం చూసి ఎమోషన్ అవుతుంది. అక్కడ ఉన్న డాక్టర్ తో మాట్లాడుతుంది. ఆమె తాను.. కార్తీక్, మోనిత కలిసి చదువుకున్నాం అని చెబుతుంది. ముగ్గురం కలిసి మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ పెట్టాలని మోనిత అనుకునేది. అని చెబుతుంది. కార్తీక్ గురించి చాలా చీప్ గా మాట్లాడుతుంది. మోనిత తప్పు లేదని చెబుతుంది. అక్కడే ఉన్న స్వీపర్ ను కూడా అడుగుతుంది రోషిణి. ఆమె కూడా మోనిత గురించి మంచిగా చెడుతుంది. రోషిణి మోనిత ఫోటోను ఫోటో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

పోలీస్ స్టేషన్ నుంచి వెళుతూ దీప  ఎలాగైనా మోనితను పట్టుకోవాలని అనుకుంటుంది.

ఇదీ ఈరోజు కార్తీకదీపం కథ. మరి దీప తాను అనుకున్నది సాధిస్తుందా? మోనిత ఏమి చేయబోతోంది? రోషిణి కార్తీక్ చెప్పిన మాటలు వింటారు. ప్రశ్నలకు సమాధానం కోసం రేపటి (ఎపిసోడ్ 1129) వరకూ ఆగాల్సిందే.

మరిన్ని కార్తీకదీపం కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Karthika Deepam: కార్తీకదీపంలో కొత్తమలుపు.. మరో పథకం వేసిన మోనిత.. దీపను నిలదీసిన పిల్లలు.. 

Karthika Depam: సూపర్ ట్విస్ట్.. మోనిత బ్రతికే ఉందని తెలుసుకున్న దీప.. నమ్మని కుటుంబం!

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీపను తుపాకీతో కాల్చిన మోనిత.. గుడిలో కుప్పకూలిన వంటలక్క!

Karthika Deepam: మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాను..సౌందర్యకు షాకిచ్చిన ఏసీపీ రోషిణి!

Karthika Deepam: దీపను కొండెక్కేలా చేస్తాను అంటూ రోడ్డెక్కిన మోనిత!

పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!