Karthika Deepam: కార్తీకదీపంలో కొత్తమలుపు.. మరో పథకం వేసిన మోనిత.. దీపను నిలదీసిన పిల్లలు.. 

కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ సీరియల్ గా విజయవంతంగా సాగుతున్న కార్తీకదీపం సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam: కార్తీకదీపంలో కొత్తమలుపు.. మరో పథకం వేసిన మోనిత.. దీపను నిలదీసిన పిల్లలు.. 
Karthika Deepam
Follow us
KVD Varma

|

Updated on: Aug 25, 2021 | 7:54 AM

Karthika Deepam: కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ సీరియల్ గా విజయవంతంగా సాగుతున్న కార్తీకదీపం సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ అపోహలతో విడిపోయిన భార్యాభర్తలు అపార్ధాలు తొలిగిపోయి తిరిగి కలుసుకునే సరికి.. కొత్త ఇబ్బంది ప్రారంభం అయింది. దీప కష్టాలు తీరకపోగా.. మరింత పెద్దగా మారాయి. కార్తీక్ ను పెళ్ళిచేసుకోవాలనే పిచ్చి కోరికతో ఇటు కార్తీక్.. అటు దీప జీవితంతో ఆడుకుంటున్న కార్తీక్ స్నేహితురాలు మోనిత వాళ్ళిద్దరినీ ఎలాగైనా విడదీయాలనే ప్రయత్నం చేస్తోంది. అందుకోసం తానూ చచ్చినట్టుగా.. కార్తీక్ తనను చంపినట్టుగా నాటకం ఆడి.. కార్తీక్ ను కటకటాల వెనుక నిలబెట్టింది. మరోవైపు దీపను చంపి అడ్డు తొలగిచుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీపను చంపాలని మోనిత చేస్తున్న ప్రయత్నాలు.. కార్తీక్ ను విడిపించాలని దీప చేస్తున్న యత్నాలు ఏమవుతాయనే ఉత్కంఠతో ప్రతిరోజూ కొత్త మలుపులతో ముందుకు సాగుతోంది కార్తీకదీపం సీరియల్. నిన్నటితో 1126 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న కార్తీకదీపం.. ఈరోజు 1127వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. ఈరోజు ఏమి జరగనుందో తెలుసుకుందాం.

నిన్న (ఎపిసోడ్ 1126) ఏమైందంటే..

దీప గుడికి పూజ కోసం వెళితే అక్కడ సోది చెప్పే వేషంలో మోనిత దీపను చంపడానికి ప్రయత్నిస్తుంది. దీనికోసం ఆమె దీపకు సోది చెప్పే నెపం మీద విజయవాడ దుర్గమ్మ దగ్గరకు కాలినడకన వెళ్ళమని చెబుతుంది. తరువాత ఆమెను కళ్ళుమూసుకోమని చెప్పి రివాల్వర్ తో  కాల్చి చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ, ఆ ప్రయత్నం విఫలం అవడమే కాకుండా దీపకు మోనిత సోదమ్మ వేషంలో వచ్చిందనే అనుమానం కలుగుతుంది. తన ప్రయత్నం విఫలం కావడంతో మోనిత అక్కడ నుంచి పారిపోతుంది. దీప ఈ విషయాన్ని అంజి, దుర్గలకు చెబుతుంది కానీ, వాళ్ళు నమ్మరు. గుడి నుంచి ఇంటికి చేరిన దీప ఇంట్లో అందరికీ మోనిత బ్రతికే ఉందని చెబుతుంది. కానీ.. ఆమె మాటలను అందరూ కొట్టిపారేస్తారు. కార్తీక్ ను రక్షించుకోవాలనే ధ్యాసలో.. మోనిత బ్రతికి ఉన్నట్టు భ్రమ పడుతున్నావని అందరూ చెబుతారు. అంతేకాకుండా ఆమె మానసిక స్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు అందరూ అనుకుంటారు. ఇదీ నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన కథ.. మరి ఈరోజు (ఎపిసోడ్ 1127)లో ఏం జరగబోతోందో చూద్దాం.

చేతికి మట్టి అంటకూడదు 

దీపను చంపాలనుకున్న తన ప్లాన్ విఫలం కావడంతో.. తీవ్ర నిరాశకు గురవుతుంది మోనిత. ఇంటికి చేరిన మోనిత కొద్దిలో ఎంత ప్రమాదం తప్పింది అనుకుంటుంది. మళ్ళీ ఆలోచనలో పడుతుంది. అసలు తాను తొందరపడ్డానని భావిస్తుంది. దీపను చంపడానికి వెళ్లి తాను  బయటపడిపోతే.. తానూ.. కార్తీక్ దగ్గరవడం సాధ్యం కాదని భావిస్తుంది. ఎలాగైనా దీపను తన చేతికి మట్టి అంటకుండా చంపాలని నిర్ణయం తీసుకుంది.

అమ్మను నిలదీసిన పిల్లలు 

మరోవైపు కార్తీక్ పిల్లలు సౌర్య..హిమ నానమ్మ సౌందర్యంతో వాదనకు దిగుతారు. తమ తండ్రి ఏ నేరం చేశాడని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు అని అడుగుతారు? ఈ విషయాన్ని మాకు చెప్పాల్సిందే అని పట్టుపడతారు. అదే సమయంలో దీప అక్కడకు వస్తూ ఉంటుంది. దీంతో సౌందర్య మీ అమ్మను అడగండి అని చెబుతుంది. సౌర్య..”అమ్మా నాన్నను ఎందుకు పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్లారు? చెప్పు.” అని అడుగుతుంది. దానికి దీప సౌర్య పై కోప్పడుతుంది. ”నీ కెందుకు చెప్పాలి?” అని ప్రశ్నిస్తుంది. ”మాకు చెప్పి తీరాలి.. ఎందుకంటే, ఆయన మా నాన్న కాబట్టి” అని సౌర్య గట్టిగా అంటుంది. వీరి మాటలకూ ఇంటిలో అందరూ అక్కడకు వస్తారు. మీరంతా ఎదో చేస్తున్నారు. అక్కడ మా నాన్న ఏసీ లేకుండా.. బెడ్ లేకుండా నెల పడుకుని ఉంటె.. ఇక్కడ మీరు హాయిగా కూర్చుని మీ పని మీరు చూసుకుంటున్నారు. అసలు మీరు మాకెందుకు విషయం చెప్పరు అంటూ పిల్లలిద్దరూ గట్టిగా మాట్లాడి గొడవ చేస్తారు.

మోనిత మరో ప్లాన్ 

మోనిత మళ్ళీ తన రాక్షస బుర్రకు పని చెబుతుంది. బాగా ఆలోచిస్తుంది. ఈసారి ప్లాన్ బీ అమలు చేద్దాం అని అనుకుంటుంది. అసలు కార్తీక్ ను దీపను ముందు దూరం చేయాలి. తరువాత దీపను చంపాలి. అంతేకానీ, దీపను చంపేస్తే.. ఆ నేరం తాను చేసినట్టు తెలిసిపోతుంది. అప్పుడు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కార్తీక్ బయటకు వస్తాడు. నేను జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అందుకే దీపను కార్తీక్ ను దూరం చేయాలి ముందు అనుకుంటుంది మోనిత. కానిస్టేబుల్ రామసీతకు ఫోన్ చేస్తుంది. తానేం చేయాలనుకుంటుందో చెబుతుంది. దీనికి రామసీత అది కష్టం అని అంటే.. అన్నీ నేను చూసుకుంటాను.. చెప్పినట్టు చేయి అని చెబుతుంది. ఆమెతో ఫోన్ లో మాట్లాడాకా కార్తీక్ ఫోటో చూస్తూ.. ”సారీరా బంగారం.. ఇదంతా నీకోసమే చేస్తున్నాను” అని చెబుతూ ఫోటోను గుండెలకు హత్తుకుంటుంది.

పోలీసులు లాఠీలతో..

పోలీస్ స్టేషన్ లో కార్తీక్ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇది చూసిన రామసీత ”డాక్టర్ సార్ ఏమిటి ఆలోచిస్తున్నారు” అని అడుగుతుంది. ఏమీలేదు కానీ..రామసీత మీ ఆయన ఎలా ఉన్నాడు. టైముకు మందులు వేసుకుంటున్నాడా? ఒకవేళ ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటె చెప్పు.. నేను అన్నీ చూసుకుంటాను. నేను కస్టడీలో ఉన్నానని ఆలోచించకు. అని చెబుతాడు కార్తీక్. దీంతో రామసీత మీరు ఇంత మంచి వారు కదా మర్డర్ ఎలా చేశారు డాక్టర్ సార్ అని అడుగుతుంది. నేను మర్డర్ చేయలేదు రామసీతా.. ప్రాణం పోయడమే కాదు.. ప్రాణం తీయడం నాకు తెలియదు అని చెబుతాడు కార్తీక్ ఆ మాటకు రామసీత ”నాకు తెలుసు సార్. మోనిత మేడం బ్రతికి ఉందని ఆమెకు.. నాకు మాత్రమే తెలుసు. ఈ విషయం చెబితే మోనిత మేడం నన్ను చంపేస్తుంది.” అని మనసులో అనుకుంటుంది. ”చూసావా..నువ్వే నమ్మలేదు..” అని చెబుతాడు కార్తీక్. దీంతో రామసీత ”డాక్టర్ సార్ కాసేపటిలో మా మేడం మిమ్మల్ని పిలుస్తుంది. ఆమె ఈసారి మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తుంది. ఇదివరకులా ఇంటరాగేషన్ ఉండదు. థర్డ్ డిగ్రీ ఉండకపోవచ్చు కానీ, కానిస్టేబుల్స్ లాఠీలతో..” అని ఆగిపోతుంది. ఆతరువాత.. డాక్టర్ బాబూ నేను ఇంటికి వెళ్ళిపోతాను.. వెళ్ళేటప్పుడు బయట టీ కొట్టులో టీ చెప్పి వెళతాను. ఆ షాపు ఆయన కూతురు మూగది. ఆమె తీసుకువస్తుంది మీకు టీ” అని చెబుతుంది.

బయటకు వస్తాడా?

అక్కడ దీప ఇంటిలో ఒక్కతే కూచుని ఆలోచిస్తుంటుంది. ఇంతలో అక్కడికి ఆనందరావు వస్తాడు. ఏమిటమ్మా దీపా ఒక్కదానివే ఏమి ఆలోచిస్తున్నావు? అంటాడు. ఏమీలేదు మావయ్యా అని జవాబిస్తుంది దీప. నాకు తెలుసు నువ్వు కార్తీక్ గురించి ఆలోచిస్తున్నావు. నేనూ ప్రయత్నం చేస్తున్నాను. లాయర్లతో మాట్లాడాను. అని చెబుతాడు. ”కాదు మావయ్యా..రోషిణి మేడం చాలా కఠినంగా ఉంది. ఇప్పుడు నిజం చెప్పమని ఆయన్ని పోలీసులు కొడతారేమో అని భయం వేస్తోంది” అంటుంది. ఏమీ అవదు దీప. కార్తీక్ బయటపడతాడు. ఎందుకంటే.. మోనిత గర్భానికి కారణం కార్తీక్ కాదు అని నువ్వు మొదటి నుంచీ చెప్పావు. అదే నిజం అయింది. మోనితే స్వయంగా అలా చెప్పింది. ఇప్పుడు కార్తీక్ నిర్దోషి అంటున్నావు. కచ్చితంగా బయటపడతాడు అని ధైర్యం చెబుతాడు.

ఇదీ ఈరోజు కార్తీకదీపం కథ. మరి కార్తీక్ పై రోషిణి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందా? టీ తీసుకువచ్చే అమ్మాయి ఎవరు? దీప ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం రేపటి (ఎపిసోడ్ 1128) వరకూ ఆగాల్సిందే.

మరిన్ని కార్తీకదీపం కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Karthika Depam: సూపర్ ట్విస్ట్.. మోనిత బ్రతికే ఉందని తెలుసుకున్న దీప.. నమ్మని కుటుంబం!

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీపను తుపాకీతో కాల్చిన మోనిత.. గుడిలో కుప్పకూలిన వంటలక్క!

Karthika Deepam: మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాను..సౌందర్యకు షాకిచ్చిన ఏసీపీ రోషిణి!

Karthika Deepam: దీపను కొండెక్కేలా చేస్తాను అంటూ రోడ్డెక్కిన మోనిత!

Karthika Deepam: దీపను చంపేస్తాను..కార్తీకదీపంలో మోనిత ఆట మళ్ళీ మొదలైంది..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!