Karthik Deepam: వామ్మో మోనిత.. ఇంత క్రూరంగానా.. కార్తీకదీపంలో కొత్త ట్విస్ట్!

ఆత్మీయ కుటుంబ కథనాన్ని మోనిత పిచ్చి ప్రేమ రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా మార్చేస్తోంది. ఇప్పటికే కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలని తాను చచ్చినట్లు.. కార్తీక్ తనని చంపినట్టు.. నాటకం ఆడుతున్న మోనిత మరో కుట్రకు తెరతీసింది.

Karthik Deepam: వామ్మో మోనిత.. ఇంత క్రూరంగానా.. కార్తీకదీపంలో కొత్త ట్విస్ట్!
Karthika Deepam Episode 1132
Follow us

|

Updated on: Aug 31, 2021 | 9:25 AM

Karthik Deepam: ఆత్మీయ కుటుంబ కథనాన్ని మోనిత పిచ్చి ప్రేమ రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా మార్చేస్తోంది. ఇప్పటికే కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలని తాను చచ్చినట్లు.. కార్తీక్ తనని చంపినట్టు.. నాటకం ఆడుతున్న మోనిత మరో కుట్రకు తెరతీసింది. కార్తీక్ కు ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేసి.. అతనిని ఆసుపత్రి పాలు చేసింది. ఆసుపత్రిలో కార్తీక్ ను పరీక్షించే డాక్టర్ గా ప్రత్యక్షం అయిన మోనిత.. కార్తీక్ ను కాళ్ళూ చేతులు కట్టేసి.. ట్రీట్మెంట్ ప్రారంభించింది. ఇదీ నిన్న (ఎపిసోడ్ 1131) జరిగిన కథ. మరి ఈరోజు మోనిత ఏమి చేయబోతోందో తెలుసుకుందాం.

ఆసుపత్రిలో కార్తీక్ ను కట్టేసి ఉంచి మోనిత మాట్లాడటం మొదలు పెట్టింది. తనలోని రాక్షసత్వాన్ని పూర్తిగా ఆవిష్కరించింది. కార్తీక్ ను బెదిరించింది. ఇప్పుడు నన్ను చంపేయాలన్నంత కోపం నీకు ఉందని నాకు తెలుసు కార్తీక్. కానీ, నేను నీ మీద ప్రేమతోనే ఇదంతా చేస్తున్నాను. నీ పిచ్చితోనే ఇలా చేస్తున్నాను. పదహారేళ్ళుగా నిన్ను ప్రేమించి.. నువ్వు దీపను పెళ్ళిచేసుకుంటే నేను పరాయిదానిలా మిగిలిపోవాలా? నాది నిజమైన ప్రేమ కార్తీక్. అందుకే, నేను నిన్ను ఎలాగైనా స్వంతం చేసుకుంటాను. ఇప్పడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. అని అంటుంది.

ఈలోపు దీప ఆసుపత్రి వద్దకు వస్తుంది. అక్కడి ఎస్ఐ ఆమెను అడ్డుకుంటాడు. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది వెళ్ళడానికి వీలు లేదని అంటాడు. అక్కడే ఉన్న రామసీత దీప దగ్గరకు వచ్చి.. దీపగారూ మీరు ఇప్పుడు వెళ్ళడం కుదరదు. ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతోంది. మీరు వెళ్ళడానికి రూల్స్ ఒప్పుకోవు అంటుంది. కానీ, దీప ఆమెను బ్రతిమిలాడుతుంది. అయితే, రామసీత..”దీప గారు.. నేను మీకు అన్నివిధాలా సహాయంగా ఉన్నాను. మీరు ఇలా చేయడం ఏమీ బాగాలేదు.” అని కటువుగా మాట్లాడుతుంది. కానీ, లోపల లోపల భయపడుతూ ఉంటుంది. మోనిత కార్తీక్ ను ఏమి చేస్తుందో.. ఒకవేళ దీప మొనితను చూసి గుర్తు పడుతుందేమో అనే ఆలోచనలతో రామసీత కంగారు పడుతూ ఉంటుంది.

ఇక లోపల ట్రీట్మెంట్ చేస్తున్న నెపంతో కార్తీక్ ను బంధించిన మోనిత కార్తీక్ ను మాట్లాదనీయని స్థితిలో పెట్టి తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుంది. ”కార్తీక్ నీకు నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను. నేను పోలీసులకు లొంగిపోతాను. నిన్ను బయటకు తీసుకువస్తాను. ఎందుకంటే, ఇప్పుడు నిన్ను రక్షించగలిగే దానిని నేను మాత్రమే. కానీ, నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. దీప.. నువ్వు.. నీ కవల పిల్లలు.. నేను.. మన బాబు.. అందరమూ కలిసి సంతోషంగా ఉండాలి. దానికి నువ్వు ఒప్పుకోవాలి.” అని అంటుంది.

కార్తీక్ నిస్సహాయంగా.. కోపంగా చూస్తూ ఉంటాడు. ”ఇప్పుడు ఈ విషయం ఏసీపీ రోషిణికి చెప్పవనుకో.. నీ కోసం గార్డెన్ లో కూచుని ఆలోచిస్తున్న మీ అమ్మా..నాన్నలను ఒక అపరిచితుడు లేపెస్తాడు. అలా లోపల హాలులో సోఫాలో కూచుని ఏడుస్తున్న నీ భార్య దీపను మరో అపరిచితుడు చంపేస్తాడు. ఇక నీ పిల్లలని మరో.. అంటూ ఆగుతుంది.” కొద్దిగా ఆగి, ”అందుకని నన్ను పెళ్ళిచేసుకో కార్తీక్. నా మెడలో మూడుముళ్ళూ వేయి.” అని అంటుంది. కోపంగా చూస్తున్న కార్తీక్ తో నాకు తెలుసు నీకు నామీద కోపం వస్తుందని.. కానీ, నేను మాత్రం ఏమి చేయను. ఇంతకంటే మంచి మార్గం నాకు కనిపించలేదు. అని చెబుతుంది.

చివరగా బయటకు వెళ్ళడానికి సిద్ధం అవుతూ మోనిత” కార్తీక్ ఇప్పుడు నీ కట్లు విప్పుతాను. నువ్వు నన్ను ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే.. అంటూ హ్యాండ్ బాగ్ లోంచి పిస్టల్ తీస్తుంది. నేను మీ అమ్మదగ్గర నుంచి రెండు బులెట్లు దొంగిలించాను. వాటిలో ఒకటి పోలీసులకు దొరికింది. రెండోది నా శరీరంలో ఉందని అనుకుంటున్నారు. ఇప్పుడు నేను దీనితో కాల్చుకుని చచ్చిపోతాను. అప్పుడు నువ్వు శాస్వతంగా లోపల ఉండిపోతావు. నేను ఇప్పుడు చచ్చినా.. పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం అప్పుడు చచ్చిపోయినట్టే ఉంటుంది. వద్దు కార్తీక్ పిచ్చి పనులు చేయకు. నువ్వు జైల్లో ఉంటె నా ఆత్మశాంతించదు అంటుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. అందరూ సంతోషంగా ఉండాలి..అందులో నేనూ మన బాబూ ఉండాలి అంటూ క్రూరంగా హెచ్చరించి కట్లు విప్పి వెళ్ళిపోతుంది. బయటకు వస్తున్న మోనిత వద్దకు దీప పరుగున వెళుతుంది. ఆయనకు ఎలా ఉంది అని అడుగుతుంది. నువ్వు ఎవరు ఆయన భార్యవా. బాగేనే ఉంది. ఫుడ్ పాయిజన్ అయింది. సరైన ఫుడ్ పెట్టాలని తెలీదా అని అంటుంది మోనిత. వాష్ చేశాను. ఇప్పుడు ఫర్వాలేదు. నేను రేపు వచ్చి చూస్తాను అని అంటుంది. దీప నేను వెళ్లి ఆయన్ని చూడొచ్చా అని అడుగుతుంది. వెళ్ళు అని చెబుతుంది మోనిత. కానీ, రామసీత కుదరదు వెళ్లొద్దు అంటుంది. అయితే, మోనిత ఏమీ ఫర్వాలేదు. భర్తను చూడటానికి భార్యను అడ్డుపెడతారా? వెళ్ళనీయండి అని చెప్పి వెళ్ళిపోతుంది.

దీప కార్తీక్ దగ్గరకు వస్తుంది. కార్తీక్ దీపను చూసి నువ్వు వచ్చావా.. అంటూ ఆమె మీద వాలిపోతాడు నిస్సహాయంగా. దీప ఏమైందండీ అని అడుగుతుంది. కార్తీక్ చెప్పాలని ప్రయత్నిస్తాడు. కానీ, మోనిత వార్నింగ్ గుర్తు వచ్చి ఆగిపోతాడు. ఏమీ లేదు అంటాడు. దీప చేతిని పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు. దీప మనసులో ఈయన మానసికంగా బాధపడుతున్నారు అని అనుకుంటుంది. ఇదీ ఈరోజు ఎపిసోడ్ (1132) లో జరిగింది. ఇప్పుడు కార్తీక్ ఏం చేస్తాడు. మోనిత కుట్రకు అడ్డుకట్ట పడుతుందా? దీప మొనితను పట్టుకోగాలుగుతుందా? ఇవన్నీ తెలియాలంటే.. రేపు ప్రసారం అయ్యే (1133) ఎపిసోడ్ లో చూడాల్సిందే.

మరిన్ని ‘కార్తీకదీపం’ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Karthika Deepam: మోనితను గుర్తుపట్టిన కార్తీక్..ఎలాగైనా కార్తీక్‌ను విడిపించాలనే ప్రయత్నంలో దీప!

Karthika Deepam: కార్తీకదీపంలో కొత్తమలుపు.. మరో పథకం వేసిన మోనిత.. దీపను నిలదీసిన పిల్లలు.. 

Karthika Depam: సూపర్ ట్విస్ట్.. మోనిత బ్రతికే ఉందని తెలుసుకున్న దీప.. నమ్మని కుటుంబం!

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీపను తుపాకీతో కాల్చిన మోనిత.. గుడిలో కుప్పకూలిన వంటలక్క!

Karthika Deepam: మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాను..సౌందర్యకు షాకిచ్చిన ఏసీపీ రోషిణి!

Latest Articles
ఓటమికి కారణం అదే.. అందుకే మాకు ఓటు వేయలేదు: వైఎస్ షర్మిల..
ఓటమికి కారణం అదే.. అందుకే మాకు ఓటు వేయలేదు: వైఎస్ షర్మిల..
ఈ హీరోయిన్ ఇప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత..
ఈ హీరోయిన్ ఇప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత..
పరగడుపున పాలు తాగితే ఏం జరుగుతుంది?
పరగడుపున పాలు తాగితే ఏం జరుగుతుంది?
చరిత్ర సృష్టించిన మంధాన.. కట్‌చేస్తే.. లేడీ సచిన్ రికార్డ్ బ్రేక్
చరిత్ర సృష్టించిన మంధాన.. కట్‌చేస్తే.. లేడీ సచిన్ రికార్డ్ బ్రేక్
ఇది సూపర్ ఫుడ్..ఈ పండు తింటే ఇమ్యూనిటీ పెరగడమే కాదు..గుండెకు కూడా
ఇది సూపర్ ఫుడ్..ఈ పండు తింటే ఇమ్యూనిటీ పెరగడమే కాదు..గుండెకు కూడా
పూరీ విగ్రహాలు మార్చడాన్ని నవకళేబర అని ఎందుకు అంటారో తెలుసా..
పూరీ విగ్రహాలు మార్చడాన్ని నవకళేబర అని ఎందుకు అంటారో తెలుసా..
మగమహారాజులకు అలర్ట్.. ఆ సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే యమడేంజర్
మగమహారాజులకు అలర్ట్.. ఆ సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే యమడేంజర్
కాకినాడ సముద్ర తీరంలో భారీ చేప లభ్యం.. కొమ్ముకోనెం ధర ఎంతంటే..
కాకినాడ సముద్ర తీరంలో భారీ చేప లభ్యం.. కొమ్ముకోనెం ధర ఎంతంటే..
‘జట్టులో సీనియర్లున్నారు..’: గంభీర్‌ను అడిగిన ప్రశ్నలివే..
‘జట్టులో సీనియర్లున్నారు..’: గంభీర్‌ను అడిగిన ప్రశ్నలివే..
జెర్సీ రైల్వేస్టేషన్ సీన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
జెర్సీ రైల్వేస్టేషన్ సీన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
'నా వల్ల చెడ్డ పేరు వస్తుందంటే టీడీపీకి గుడ్ బై చెప్తా'.. జేసీ
'నా వల్ల చెడ్డ పేరు వస్తుందంటే టీడీపీకి గుడ్ బై చెప్తా'.. జేసీ
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో