AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్‏లో కీలక మార్పులు.. కొత్తగా మరో ముగ్గురు..  

ఇప్పటికే బుల్లితెరపై బిగ్‏బాస్ సందడి మొదలైంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్‏లో కీలక మార్పులు.. కొత్తగా మరో ముగ్గురు..  
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Aug 31, 2021 | 9:18 AM

Share

ఇప్పటికే బుల్లితెరపై బిగ్‏బాస్ సందడి మొదలైంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. రూమర్స్, గాసిప్స్, అప్డేట్స్‏తో నెట్టింట్లో సందడి కొనసాగుతోంది. ఇక బిగ్‏బాస్ షో కోసం బుల్లితెర ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షో గురించి మొదటి నుంచి భిన్నరకాలుగా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. అనుకున్నట్లుగానే ఈ షోను సెప్టెంబర్ 5 నుంచి ప్రసారం చేయనున్నట్లుగా నిర్వహకులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అవుతున్నాయి. ఇప్పటివరకు లోబో, ఇషా చావ్లా, సీరియల్ హీరో మానస్, సిరి హన్మంత్, యాంకర్ రవి, మోడల్ జశ్వంత్, షన్ముఖ్ జశ్వంత్, ఆర్జే కాజల్, నటి శ్వేత, సీరియల్ నటి ప్రియ, జబర్దస్త్ ఫేమ్ ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్, వర్షిణి, సీరియల్ హీరో వీజే సన్నీ, యానీ మాస్టర్, కార్తీకదీపం భాగ్య (ఉమా), లహరి రాబోతోన్నట్టు ఓ లిస్ట్ వచ్చింది. పైగా ప్రియాంక, నవ్యస్వామి, యూట్యూబర్ నిఖిల్, ఆట సందీప్ భార్య జ్యోతి వంటి వారు రాబోతున్నట్లుగా టాక్ నడిచింది.

తాజా సమాచారం ప్రకారం.. ఇప్పుడు బిగ్‏బాస్ షోలోకి రాబోయే కంటెస్టెంట్స్ మారిపోయినట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో వర్షిణి, ఇషాచావ్లా, నవ్వస్వామి పేర్లు వినిపించడం లేదు. వీరికి బదులుగా మరిన్ని కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. అందులో నటుడు విశ్వ, యూట్యూబర్ సరయు, డ్యాన్స్ మాస్టర్ నటరాజ్, సింగర్ రామచంద్ర వంటి వారి పేర్లు కొత్తగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరంతా క్యారంటైన్‏లో ఉన్నారని.. మూడో తేదీ వరకు వీరి మొబైల్స్ తమ దగ్గరే పెట్టుకుంటారని.. ఆ తర్వాత నిర్వహకులకు అప్పగిస్తారని.. 4న వీరంతా బిగ్‏బాస్ హౌస్‏కు వెళ్తారని.. 5న షో ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. ఇక కంటెస్టెంట్లను పరిచయం లేస్తూ.. నాగార్జున.. పవర్ కళ్యాణ్ ఆరడుగుల బుల్లెట్టు పాటకు డ్యాన్స్ వేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇటీవల ఈ షోకు సంబంధించిన ప్రోమోను నిర్వహకులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ బజ్ ప్రోగ్రాంకు అరియానా హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటికే క్వారంటైన్‏లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ కరోనా భారీన పడ్డారని.. వారిని ఆసుపత్రికి తరలించారని..అలాగే మిగతా కంటెస్టెంట్లకు కోవిడ్ టెస్ట్ నిర్వహించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరంతా క్షేమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Bheemla Nayak: సందడి మొదలైంది.. పవన్ బర్త్ ‏డే అదిరిపోయే సర్‏ప్రైజ్ ప్లాన్ చేసిన భీమ్లా నాయక్ టీం.. ట్వీట్ వైరల్..

Karthikeya 2 movie: హీరోయిన్‏ను డిఫరెంట్‏గా పరిచయం చేసిన నిఖిల్.. కార్తికేయ 2లో నటించేది ఈ ముద్దుగుమ్మనే..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!